ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం

48.31 శాతానికి పెరిగిన రికవరీ రేటు.

2.80 శాతానికి తగ్గిన మరణాల రేటు.

Posted On: 03 JUN 2020 3:15PM by PIB Hyderabad

గత 24 గంటల్లో, కోవిడ్-19 వ్యాధి నుండి మొత్తం 4,776 మంది కోలుకున్నారు.    దీంతోఇంతవరకు కోవిడ్-19 వ్యాధి నుండి కోలుకుని బయటపడిన వారి సంఖ్య 1,00,303 కి పెరిగింది.  కోవిడ్-19 వ్యాధి సోకిన రోగులలో రికవరీ రేటు 48.31 శాతానికి పెరిగింది.   ప్రస్తుతం, కోవిడ్-19 వ్యాధి లక్షణాలు కలిగి ఉన్న 1,01,497 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు

మరణాల రేటు 2.80 శాతంగా ఉంది

దేశంలో ప్రస్తుతం 480 ప్రభుత్వ మరియు 208 ప్రయివేటు ప్రయోగశాలలు (మొత్తం 688 ప్రయాగశాలలు) ద్వారా  పరీక్షల సామర్ధ్యం పెరిగింది.   కోవిడ్-19 కోసం ఇంతవరకు మొత్తంగా 41,03,233 నమూనాలను పరీక్షించడం జరిగింది.  కాగా, నిన్న ఒక్క రోజే, 1,37,158 నమూనాలను పరీక్షించారు

దేశంలో కోవిడ్-19 నిర్వహణ కోసం అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాల పరంగా గమనిస్తే,   ప్రస్తుతం దేశంలో 952 ఆసుపత్రులను కేవలం కోవిడ్-19 సేవల కోసం ప్రత్యేకంగా కేటాయించారు.  ఈ ఆసుపత్రులలో  1,66,332 ఐసోలేషన్ పడకలు,  21,393 ఐ.సి.యు. పడకలు, 72,762 ఆక్సిజన్ సౌకర్యం కలిగిన పడకలు అందుబాటులో ఉన్నాయి.  అదేవిధంగా, ప్రస్తుతం దేశంలో 2,391 ఆరోగ్య కేంద్రాలను కేవలం కోవిడ్-19 సేవల కోసం ప్రత్యేకంగా కేటాయించారు.  ఈ ఆరోగ్య కేంద్రాలలో 1,34,945 ఐసోలేషన్ పడకలు,  11,027 ఐ.సి.యు. పడకలు, 46,875 ఆక్సిజన్ సౌకర్యం కలిగిన పడకలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 125.28 లక్షల ఎన్-95 మాస్కులు, 101.54 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ. లు) లను వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు / కేంద్ర సంస్థలకు సమకూర్చారు

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

https://www.mohfw.gov.in/        మరియు       @MoHFW_INDIA . 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు 
          technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

                    ncov2019[at]gov[dot]in     మరియు    @CovidIndiaSeva. 

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +191-11-23978046  లేదా  1075  (టోల్ ఫ్రీ) ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

****


(Release ID: 1629022)