రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

'మేక్ ఇన్ ఇండియా' ప్రోత్సాహ‌కానికి స్థానిక‌ రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్‌ను సేక‌రించాలిః మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా

- ఈ చ‌ర్య వస్తువులు, సేవల తయారీ మరియు ఉత్పత్తిని పెంచేందుకు దోహ‌దం చేస్తుంది
- ప‌బ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌లో భాగంగా 2020-21, 2021-23 మరియు 2023-25 సంవ‌త్స‌రాల్లో
వ‌రుస‌గా 60 శాతం, 70 శాతం మరియు 80 శాతం మేర స్థానికంగానే త‌యారైన రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ సేక‌ర‌ణ జ‌ర‌పాల‌ని సూచించిన డిపార్టెమెంట్ ఆఫ్ కెమిక‌ల్ అండ్ పెట్రోకెమికల్స్

Posted On: 02 JUN 2020 1:53PM by PIB Hyderabad

మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి దేశంలో వస్తువులు, సేవలు, పనుల తయారీ మరియు ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గాను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంట‌ర్న‌ల్ ట్రేడ్' (డీపీఐఐటీ) 29.05.2019 న పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్య‌త ఇచ్చే విధంగా) ఆర్డర్ 2017 ను సవరించింది. ఆదాయం మరియు ఉపాధిని పెంచాల‌నే ల‌క్ష్యంతో ఈ స‌వ‌ర‌ణ‌ను చేప‌ట్టారు. రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్‌ గుర్తించేటప్పుడు, క‌నిష్ట స్థానిక కంటెంట్ మరియు లెక్కింపు పద్ధతిని సూచించేటప్పుడు, రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ విభాగం దేశీయ తయారీలో అందుబాటులో ఉన్న సామర్థ్యాన్ని మరియు స్థానిక పోటీ యొక్క పరిధిని అంచనా క‌ట్టింది. ఇందులో భాగంగా దాదాపు 55 రకాల రసాయనాలు, పెట్రోకెమికల్స్, పురుగుల మందులు మరియు డైస్టఫ్‌లు గుర్తించారు. 2020-2021 ఏడాదికి కెమికల్స్ & పెట్రోకెమికల్స్ కోసం కనీస స్థానిక కంటెంట్‌ను 60 శాతం వద్ద ప్రారంభించి, ఆ తరువాత, 2021-2023 సంవత్సరాలకు 70 శాతానికి, 2023-2025 సంవత్సరాలకు 80 శాతంగా ఉంచాల‌ని నిర్ణ‌యించారు. డిపార్ట్‌మెంట్‌ గుర్తించిన 55 కెమికల్స్ & పెట్రోకెమికల్స్ నందు దాదాపు 27 ఉత్ప‌త్తుల విష‌యంలో స్థానిక సరఫరాదారులు రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల విలువ క‌లిగిన ప్రొక్యూర్‌మెంట్ ప్ర్ర‌క్రియ‌లో బిడ్లు దాఖ‌లు చేసేందుకు అర్హులు. మిగిలిన
28 కెమికల్స్ & పెట్రోకెమికల్స్ విషయంలో తగినంత స్థానిక సామర్థ్యం మరియు స్థానిక పోటీ ఉన్న వారి నుంచి  బిడ్ల‌ మొత్తంతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే సంస్థలు స్థానిక సరఫరాదారు నుండి మాత్రమే సేకరణ చేప‌ట్టాల్సి ఉంటుంది. తాజాగా తీసుకున్న ఈ చ‌ర్యతో  ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను కార్య‌క్ర‌మాన్ని మ‌రింత బలోపేతం చేయ‌నుంది. దీనికి తోడు “మేక్ ఇన్ ఇండియా” కార్య‌క్ర‌మంలో భాగంగా దేశీయ ఉత్పత్తిని కూడా పెంచ‌నుంది. కేంద్రం తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని రసాయనాలు మరియు ఎరువుల శాఖ స‌హాయ మంత్రి, షిప్పింగ్ శాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ మన్సుఖ్ మాండవియా ప్ర‌శంసించారు. ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ "వస్తువులు, సేవలు మరియు పనుల తయారీ మరియు ఉత్పత్తిని పెంచడానికి స్థానికంగా ఉన్న ల‌భ్య‌త నుంచి రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ సేక‌ర‌ణ‌ను తప్పనిసరి చేయ‌డం మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహ‌కంగా ఉంటుంది" అని అన్నారు.


 



(Release ID: 1628675) Visitor Counter : 218