భారత ఎన్నికల సంఘం
వాయిదాపడిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు తాజా తేదీలు
Posted On:
01 JUN 2020 6:09PM by PIB Hyderabad
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రాజ్యసభలో 2020 ఏప్రిల్‌లో రిటైర్ అవుతున్న సభ్యుల స్థానాలకు సంబంధించి 17 రాష్ట్రాలనుంచి ఖాళీ పడే 55 స్థానాల భర్తీకి 25-02-2020న ఎన్నికలను ప్రకటించింది.దీనిని నెంబర్ 318/CS-Multi/2020(1) తేదీ 06.03.2020 ద్వారా నోటిఫై చేశారు. ఉపసంహరణలకు తుది గడువు అయిన 18-03-2020 తర్వాత, సంబంధిత రిటర్నింగ్ అధికారులు 10 రాష్ట్రాలనుంచి 37 స్థానాలలో ఎలాంటి పోటీ లేనందున ఆయా స్థానాలను భర్తీ చేసినట్టు ప్రకటించారు. సంబంధిత రిటర్నింగ్ అధికారుల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించి 18 స్థానాలకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు 26-03-2020(గురువారం) జరగాలి.ఎన్నికల కమిషన్ 06-03-2020న జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం 30-3-2020(సోమవారం) లోగా ఎన్నికలు పూర్తి కావలసి ఉంది.
అయితే, ప్రజాప్రాతినిథ్య చట్టం,1951 లోని సెక్షన్ 153 ప్రకారం, ఎన్నికల కమిషన్ తగిన కారణాలు ఉన్నాయని సంతృప్తి చెందిన పక్షంలో ఏ ఎన్నికలనైనా పూర్తి చేసేందుకు గడువును పొడిగించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంది. ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 30 లేదా సెక్షన్ 39 సబ్ సెక్షన్ (1) కింద, తాను జారీ చేసిన నోటిఫికేషన్‌కు అవసరమైన సవరణలు చేసి గడువు పొడిగించవచ్చు. దాని ప్రకారం,కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తలెత్తిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి , ఊహించని పరిణామాలు ,దేశంలో జారీ అయిన సూచనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ 24-03-2020 నాటి ప్రెస్ నోట్ ద్వారా సంబంధిత చట్టం లోని సెక్షన్ 153లోని నిబంధనల ప్రకారం ఎన్నికలను వాయిదా వేసి, ఎన్నికల నిర్వహణ కాలాన్ని పొడిగించింది. దేశంలో పరిస్థితులను సమీక్షించిన మీదట రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన తాజా తేదీలపై ఎన్నికల కమిషన్ ప్రకటన చేయనున్నట్టు తెలిపింది.
ఈ ఎన్నికలకు సంబంధించి ఆయా రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే ప్రచురించిన పోటీచేస్తున్న అభ్యర్థుల జాబితా ,06-03-2020 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్న తదుపరి ప్రక్రియకు చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్ ప్రెస్‌నోట్ తెలిపింది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిని ఎన్నికల కమిషన్ సవివరంగా సమీక్షించింది.30-05-2020 న కేంద్ర హోంశాఖ కార్యదర్శిజారీ చేసిన మార్గదర్శకాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద నేషనల్ ఎగ్జిక్యుటివ్ కమిటీ ఛైర్మన్ జారీ చేసిన మార్గదర్శకాలు , అలాగే సంబంధిత ఛీఫ్ ఎలక్టొరల్ అధికారులు పంపిన సమాచారం, ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని , ఎన్నికల కమిషన్ పోలింగ్, కౌంటింగ్ తాజా తేదీలను నిర్ణయించింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో (4స్థానాలు), గుజరాత్ (4 స్థానాలు),జార్ఖండ్(2స్థానాలు), మధ్యప్రదేశ్ (3 స్థానాలు),మణిపూర్ (1స్థానం), మేఘాలయ (1 స్థానం),రాజస్థాన్ (3 స్థానాల)లో మొత్తం 18 స్థానాలకు పోలింగ్ , ఓట్ల లెక్కింపు కింద పేర్కొన్న షెడ్యూలు ప్రకారం జరుగుతాయి.
ఈవెంట్స్
|
తేదీ
|
పోలింగ్ తేదీ
|
19 జూన్ 2020 (శుక్రవారం)
|
పోలింగ్ సమయం
|
9-00 ఎ.ఎం నుంచి 4,00 పి.ఎం
|
ఓట్ల లెక్కింపు
|
19 జూన్ 2020 (శుక్రవారం) 5-00 పి.ఎం గంటలకు
|
ఎన్నికలు ఏ తేదీకి ముందు పూర్తి చేయాలి:
|
22 జూన్ 2020 (సోమవారం)
|
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల సందర్భంలో కోవిడ్ -19 నియంత్రణ చర్యలకు సంబంధించి జారీ అయిన ఆదేశాలను పాటించేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఒక సీనియర్ అధికారిని నియమించేలా చూడాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
ఈ ఎన్నికల పరిశీలకులుగా సంబంధిత రాష్ట్రాల ఛీఫ్ ఎలక్టొరల్ అదికారులను ఎన్నికల కమిషన్ నియమించింది.
(Release ID: 1628545)
Visitor Counter : 270