ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా స్థితిగతులు

48.19%కి పెరిగిన రికవరీ రేటు

Posted On: 01 JUN 2020 3:28PM by PIB Hyderabad

శ్రేణీకృతంగా, ముందస్తుగా, క్రియాశీలంగా రాష్ట్రాలు / యుటిలతో పాటు కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 నివారణ, నియంత్రణ, నిర్వహణతో అనేక చర్యలు తీసుకుంటోంది. క్రమం తప్పకుండా అత్యున్నత స్థాయిలో వీటి సమీక్ష పర్యవేక్షణ జరుగుతోంది.

గత 24 గంటల్లో 4,835 కోవిడ్ -19 రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు, మొత్తం 91,818 మంది రోగులు కోవిడ్-19 నుండి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. ఆ రేటు 48.19% కి చేరుకుంది. మే 18 న రికవరీ రేటు 38.29%. మే 3 న ఇది 26.59%. ఏప్రిల్ 15 న ఇది 11.42%.గా ఉంది. 

ప్రస్తుతం దేశంలో 93,322 క్రియాశీల కేసులు వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి. కేసు మరణాల రేటు 2.83%. మే 18 న మరణాల రేటు 3.15%. మే 3 న ఇది 3.25%. ఏప్రిల్ 15 న ఇది 3.30%. దేశంలో మరణాల రేటులో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. సాపేక్షంగా తక్కువ మరణాల రేటు సకాలంలో కేసు గుర్తింపు, నిరంతర నిఘా, కేసుల క్లినికల్ నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టడం జరుగుతోంది. 

ఈ సందర్భంలో రెండు పరిణామాలు గమనించదగ్గవి. ఒకటి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతుండడం, రెండోది మరణాల సంఖ్య తగ్గడం. 

472 ప్రభుత్వ, 204 ప్రైవేట్ ప్రయోగశాలలు (మొత్తం 676 ప్రయోగశాలలు) ద్వారా దేశంలో పరీక్ష సామర్థ్యం పెరిగింది. కోవిడ్-19 కోసం ఇప్పటివరకు 38,37,207 నమూనాలను పరీక్షించగా, 1,00,180 నమూనాలను నిన్న పరీక్షించారు.

మే 31 డబ్ల్యుహెచ్ఓ నివేదిక-132 ప్రకారం ఎక్కువ మరణాల రేటు ఉన్న దేశాలు :

దేశం 

మొత్తం మరణాలు 

మరణాల రేటు 

ప్రపంచం

367,166

6.19%

అమెరికా 

1,01,567

5.92%

యునైటెడ్ కింగ్డమ్

38,376

14.07%

ఇటలీ 

33,340

14.33%

స్పెయిన్ 

29,043

12.12%

ఫ్రాన్స్ 

28,717

19.35%

బ్రెజిల్ 

27,878

5.99%

బెల్జియం 

9,453

16.25%

మెక్సికో 

9,415

11.13%

జర్మనీ 

8,500

4.68%

ఇరాన్ 

7,734

5.19%

కెనడా 

6,996

7.80%

నెదర్లాండ్స్ 

5,951

12.87%

 

కోవిడ్-19 సంబంధిత సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనల కోసం సందర్శించండి:  https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA 

కోవిడ్-19 కి సంబంధించి సాంకేతిక సమస్యలను ఫిర్యాదు చేయడానికి: technicalquery.covid19[at]gov[dot]in ఇతర సమస్యలకు ncov2019[at]gov[dot]in ; @CovidIndiaSeva .

ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నెంబర్: +91-11-23978046 or 1075 (టోల్ ఫ్రీ).కోవిడ్-19కి సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్లు కోసం:  https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

****



(Release ID: 1628457) Visitor Counter : 230