రక్షణ మంత్రిత్వ శాఖ
సముద్ర సేతు తదుపరి దశను ప్రారంభించిన నావికాదళం
प्रविष्टि तिथि:
30 MAY 2020 6:53PM by PIB Hyderabad
విదేశాలో ఉన్న భారత పౌరలను తరలించటానికి సముద్ర సేతు తదుపరి దశను 2020 జూన్ 1న భారత నావికాదళం ప్రారంభిస్తోంది. ఈ దశలో భాగంగా భారత నావికాదళ నౌక జలాశ్వ శ్రీలంకలోని కొలంబో నుంచి తమిళనాడులోని తూత్తుకుడికి 700 మందిని తరలిస్తుంది. ఆ తరువాత మాల్దీవులలోని మాలె నుంచి తూత్తుకుడికి మరో 700 మందిని తరలిస్తుంది.
భారత నావికాదళం ఇంతకు ముందు చేపట్టిన తరలింపుల ద్వారా ఇప్పటికే 1,488 మంది భారత జాతీయులను మాలె నుంచి కొచ్చికి తీసుకొచ్చింది. శ్రీలంక, మాల్దీవులలోని భారత కార్యాలయాలు తరలించాల్సిన భారత జాతీయుల జాబితాలు తయారు చేసి వాళ్ళకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన మీదట నౌకలు ఎక్కిస్తున్నాయి. నౌకలో కూడా భౌతిక దూరం పాటించటం లాంటి జాగ్రత్తలు పాటింపజేస్తున్నారు. ప్రయాణ సమయంలో వారందరికీ ప్రాథమిక సౌకర్యాలతోబాటు వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.
తూత్తుకుడిలో దిగినవారిని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల రక్షణకు అప్పగిస్తారు. ఈ కార్యకలాపాలన్నిటినీ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ఏజెన్సీలు సమన్వయం చేస్తాయి.
***

(रिलीज़ आईडी: 1628007)
आगंतुक पटल : 362
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada