వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఎఫ్‌సిఐ ఆహార ధాన్యం పంపిణీ, సేకరణను సమీక్షించిన శ్రీ పాశ్వాన్

ఆహార పంపిణీకి జీవన రేఖ ఎఫ్‌సిఐ

పంపిణీ, సేకరణను వేగవంతం చేయమని ఎఫ్‌సిఐని ఆదేశించిన శ్రీ పాశ్వాన్; నిల్వల పట్ల సంతృప్తి

Posted On: 28 MAY 2020 6:06PM by PIB Hyderabad

ఆహార ధాన్యాల పంపిణీ, సేకరణపై భారత ఆహార సంస్థ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ప్రాంతీయ జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈ రోజు అధ్యక్షత వహించారు.

 

 

లాక్ డౌన్ సమయంలో ఎఫ్.సి.ఐ పాత్రను ఈ సందర్బంగా ప్రశంసించిన శ్రీ పాశ్వాన్, ఉద్యమ స్ఫూర్తితో జరిగిన ఆహార ధాన్యం సేకరణ, పంపిణీ ఇప్పటి వరకు ఎప్పుడు చేయని విధంగా సాగిందని అన్నారు. ప్రపంచ మహమ్మారి సంక్షోభ సమయంలో ఎఫ్‌సిఐ సిబ్బంది అంతా ఆహార యోధులనిపించుకున్నారని, వారు ఈ సవాలును అవకాశంగా మార్చారని ఆయన తెలిపారు. లాక్ డౌన్ వ్యవధిలో ఆహార ధాన్యాల లోడింగ్, ఆన్లోడింగ్, రవాణాను  ఎఫ్‌సిఐ రికార్డు సమయంలోచేపట్టిందని ప్రశంసించారు. మరోవైపు, సేకరణ కూడా అంతరాయం లేకుండా కొనసాగింది, ఈ సంవత్సరం ప్రభుత్వ సంస్థలు గోధుమల సేకరణ గత సంవత్సరం గణాంకాలను అధిగమించింది. సమీక్షా సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆహార ధాన్యాల పంపిణీని కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

 

 

ఆత్మ నిర్భర ప్యాకేజి :

వలసదారుల కోసం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఆహార ధాన్యాల కేటాయింపును సమీక్షించిన శ్రీ పాశ్వాన్, మే, జూన్ నెలలకు కేంద్ర ప్రభుత్వం 37 రాష్ట్ర / యుటిల కోసం 8.00 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు (2.44 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 5.56 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం) కేటాయించినట్లు చెప్పారు. ఎఫ్‌సిఐ ప్రకారం, మొత్తం కేటాయింపునకు గాను, 27.05.2020 వరకు 2.06 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు రాష్ట్రాలు / యుటిలు తీసుకున్నాయి. అండమాన్-నికోబార్, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్ మొత్తం కేటాయింపును రెండు నెలలు తీసుకున్నాయి. రాష్ట్ర / యుటి ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని, ఆహార ధాన్యాలు ఎత్తివేయడం వేగవంతం చేయాలని మంత్రి ఎఫ్‌సిఐని ఆదేశించారు.

ప్రధానమంత్రి అన్న గరీబ్ యోజన:

ఈ పథకం కింద, 2020 ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు 37 రాష్ట్ర / యుటిలకు 120.04 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాన్ని (15.65 ఎల్‌ఎమ్‌టి గోధుమలు, 104.4 ఎల్‌ఎమ్‌టి బియ్యం) కేటాయించారు. ఈ పథకం కింద సంబంధిత అధికారులను సమన్వయం చేయాలని శ్రీ పాశ్వాన్ కోరారు. లిఫ్టింగ్‌ను వేగవంతం చేయడానికి రాష్ట్ర / యుటి ప్రభుత్వంతో, తద్వారా ఆహార ధాన్యాలు లబ్ధిదారునికి సకాలంలో చేరడానికి చర్యలు తీసుకోవాలన్నారు.  మొత్తం పిఎమ్‌జికెఎవై కేటాయింపులకు గాను, 27.05.2020 వరకు, 95.80 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాన్ని (15.6 ఎల్‌ఎమ్‌టి గోధుమలు, 83.38 ఎల్‌ఎమ్‌టి బియ్యం) రాష్ట్రాలు / యుటిలు వినియోగించుకున్నట్టు ఎఫ్‌సిఐ సమాచారం ఇచ్చింది.

ఇ-వేలం లేకుండా ఓఎంఎస్ఎస్ (డి) కింద ఛారిటబుల్ / ఎన్జిఓకు ఆహార ధాన్యాల అమ్మకం:

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, 25.05.2020 వరకు, 186 సంస్థలకు 1179 మెట్రిక్ గోధుమలు, 890 సంస్థలకు 8496 మెట్రిక్ బియ్యం అమ్మకానికి ఆమోదించినట్లు ఎఫ్‌సిఐ తెలియజేసింది, వీటిలో 886 మెట్రిక్ గోధుమలు, 7778 మెట్రిక్ బియ్యంని సంస్థలు తీసుకున్నాయని ఎఫ్‌సిఐ తెలిపింది.   
 

పశ్చిమ బెంగాల్, ఒడిశా లో అంఫాన్ తుపాను:

ఎఫ్‌సిఐ ప్రకారం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓఎంఎస్ఎస్ (డి) అమ్మకం కింద 11,800 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వను ఇ-వేలం లేకుండా క్వింటాల్ కి రూ .2250 / - కి కోరింది, అయితే ఆహార ధాన్యాల అవసరం ఒడిశా ప్రభుత్వం ఈ రోజు వరకు తెలియజేయలేదు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎఫ్‌సిఐ సమన్వయం చేసుకోవాలని, తుఫాను దెబ్బతిన్న రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల తాజా స్థితిని అంచనా వేయాలని శ్రీ పాశ్వాన్ అన్నారు.

సేకరణ (బియ్యం / గోధుమ): 

సమీక్ష సమావేశంలో మంత్రి రబీ కాలం-ఆర్‌ఎంఎస్ 2020-21లో గోధుమల అమ్మకం, ఖరీఫ్ కాలం-కేఎంఎస్ 2019-20లో బియ్యం సేకరణ గురించి సమీక్షించారు. గోధుమల సేకరణ గత సంవత్సరం కన్నా అధికంగా ఉన్నందున, తదుపరి గోధుమ (ఆర్‌ఎంఎస్ 2020-21), బియ్యం (కెఎంఎస్ 20-21) సేకరణను తాజా అంచనాలను సిద్ధం చేయాలనీ మంత్రి ఎఫ్‌సిఐని కోరారు. ఎఫ్‌సిఐ చెప్పినదాని ప్రకారం, 27.5.2020 నాటికి మొత్తం 351 ఎల్‌ఎమ్‌టి గోధుమలు (ఆర్‌ఎంఎస్ 20-21) సేకరించబడ్డాయి. 60.40 ఎల్‌ఎమ్‌టి బియ్యం (ఆర్‌ఎంఎస్) సేకరించారు. 2019-20లో మొత్తం 700.29 ఎల్‌ఎమ్‌టి వరిని (470.23 ఎల్‌ఎమ్‌టి బియ్యంతో సహా) సేకరించారు. 

ఆహార ధాన్యాల కదలిక:

లాక్ డౌన్ అయినప్పటి నుండి, ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలు తీసుకుని రోడ్లు, రైల్వే, జలమార్గం ద్వారా రవాణా అయ్యాయి. కష్టతరమైన మరియు కొండ ప్రాంతాలలో వాయు మార్గం ద్వారా గంటలకు చేర్చేరు. 3550 రైలు రేక్‌ల ద్వారా సుమారు 100 ఎల్‌టి ఆహార ధాన్యాలు రవాణా చేశారు. 12 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రోడ్ల ద్వారా రవాణా అయ్యాయి, 12 నౌకల ద్వారా 12,000 టన్నుల ఆహార ధాన్యాలు రవాణా చేశారు. మొత్తం 9.61 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు ఈశాన్య రాష్ట్రాలకు రవాణా చేశారు.

సెంట్రల్ పూల్ లో నిల్వలు:

27.05.2020 నాటికి ఆహార ధాన్యాల నిల్వల గురించి ఎఫ్‌సిఐ సమాచారం ఇచ్చింది. సెంట్రల్ పూల్‌లో 479.40 ఎల్‌ఎమ్‌టి గోధుమలు, 272.29 ఎల్‌ఎమ్‌టి బియ్యం, మొత్తం 751.69 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుత, భవిష్యత్ ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి ప్రస్తుతమున్న నిల్వల స్థితిపై సంతృప్తిని వ్యక్తం చేసిన శ్రీ పాశ్వాన్, ఈ సంక్షోభ సమయంలో కష్టపడి పనిచేస్తున్న ఎఫ్‌సిఐ అధికారులు, కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. 

****   



(Release ID: 1627609) Visitor Counter : 214