శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 ను ఎదుర్కోవడానికి పరిష్కారాల అన్వేషణలో సైన్స్ అండ్ టెక్నాలజీ
- గణనాత్మక ఔషధ ఆవిష్కరణకు ‘హాకథాన్’ చేపట్టబడిందిః ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్
Posted On:
28 MAY 2020 6:13PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ సభ్యుడు, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్ గురువారం (26వ తేదీ) ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో కోవిడ్-19 పై
సమరంలో భాగంగా జరుగుతున్న వివిధ పరిశోధనలను గురించి వివరించారు. కోవిడ్-19 వైరస్ కు టీకాలు, ఔషధ ఆవిష్కరణలు, రోగనిర్ధారణ, మరియు వ్యాధి పరీక్షల రంగాలలో శాస్త్ర మరియు సాంకేతికతకు సంబంధించిన కార్యకలాపాలను గురించి ఆయన ఇక్కడ వివరించారు. కోవిడ్-19 కు సంబంధించిన టీకాల ఆవిష్కరణ గురించి వివరిస్తూ ఈ ప్రక్రియ సాధారణంగానే.. నెమ్మదిగా మరియు అనిశ్చితితో నిండి ఉంటుందని వివరించారు. కానీ, కోవిడ్- 19 వైరస్‌కు వ్యతిరేకంగా టీకా మందు విజయవంతం కావడానికి పెద్ద సంఖ్యలో సమాంతర ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు.
టీకాల ఆవిష్కరణకు మూడు రకాల ప్రయత్నాలు..
టీకా ఆవిష్కరణ ప్ర్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా జరుగుతోందని ఆయన వివరించారు. భారతీయ టీకాల అభివృద్ధి పరిశ్రమలో చాలా బలమైన వివిధ సంస్థలు, భారతీయ అకాడెమియాతో పాటుగా అంకుర సంస్థలు ఈ దిశగా విశేషంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ దిశగా మూడు రకాల ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. మొదటిది స్వదేశీ ప్రయత్నాలు, రెండవది ప్రపంచ వ్యాప్తంగా సహకార ప్రయత్నాలు, ఇక్కడ భారతీయ సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి మరియు మూడోది ప్రపంచ ప్రయత్నాలలో భారత భాగస్వామిగా నిలవడమని ఆయన తెలిపారు. ఇంత పెద్ద పోర్ట్‌ఫోలియోతో తయారీ మరియు స్టాక్‌పైలింగ్ కోసం రిస్క్-తగ్గించే ప్రయత్నాల తరువాత విజయం దిశగా మంచి హామీ ఇవ్వబడుతుంది.
మూడు విధాలుగా కరోనా ఔషధ ఆవిష్కరణ ప్రయత్నాలు..
కరోనా ఔషధపు ఆవిష్కరణపై మన శాస్త్రీయ ప్రయత్నాలు మూడు విధాలుగా సాగుతున్నాయి. మొదటిదిః వైరస్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న మందులు కరోనా వ్యాప్తి పరిణామాలను తగ్గించడంలో ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో భేరీజు వేస్తూ.. వాటిని తగు విధంగా నవీకరించి తయారు చేయడం. రెండోదిః అందుబాటులో ఉన్న వివిధ ఔషధ మొక్కల నుంచి ఫైటో- ఫార్మాస్యూటికల్స్‌ను సేకరించి వాటిని వైరస్ కట్టడి దిశగా పరీక్షించడం. చివరగాః విభిన్న విధానాలను ఉపయోగించి గుణాత్మకత కలిగిన ఔషధ ఆవిష్కరణకు ‘హాకథాన్’తో సహా కొత్త ఔషధ ఆవిష్కరణలు చేపట్టడం.
సహకారంతోనే పరిశోధనల్లో వేగం..
వివిధ పరిశోధన ప్రయత్నాల సమ్మేళనం కొత్త పరీక్షలు మరియు పరీక్షా సామగ్రి దిశగా దారి తీస్తున్నట్టుగా తెలిపారు. వైరస్‌ను గుర్తించడానికి మరియు యాంటీబాడీలను గుర్తించేందుకు కొత్త పరీక్షలు వంటి వాటికి కూడా ఆయా పరిశోధనలు దారి తీస్తున్నట్టుగా కూడా ఆయన వివరించారు. ఆ తరువాత దశలో సెరోలాజికల్ అధ్యయనాలను ఉపయోగిస్తున్నట్టుగా కూడా ఆయన తెలిపారు. మన శాస్త్రవేత్తలు, సంస్థలు మరియు సైన్స్ ఏజెన్సీల సహకార ప్రయత్నాల ద్వారా ఈ పరిణామాల్లో వేగం సాధ్యమవుతుంది. ఈ పరిశోధనల్లో వేగం, నాణ్యతను పరీక్షించేలా
నియంత్రణ వ్యవస్థ కూడా ఈ ప్ర్రక్రియలో చాలా దగ్గరగా నిమగ్నమై కృషి చేస్తున్నాయి.
(Release ID: 1627565)
Visitor Counter : 288