రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

సీపెట్ పేరును 'సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌&టెక్నాలజీ'గా మార్పు

మొత్తం పెట్రో కెమికల్ రంగం వృద్ధికి సీపెట్‌ అంకితం అవుతుంది: సదానంద గౌడ

Posted On: 28 MAY 2020 1:21PM by PIB Hyderabad

"సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌&టెక్నాలజీ"గా ఉన్న సీపెట్‌ పేరును, "సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్‌&టెక్నాలజీ"గా మార్చారు. ఇది, " కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ" ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రధాన జాతీయ సంస్థ. 

    తమిళనాడు సొసైటీల నమోదు చట్టం-1975 [(తమిళనాడు యాక్ట్‌ 27 (1957)] కింద కొత్త పేరును నమోదు చేశారు. 

    మొత్తం పెట్రో కెమికల్ రంగం వృద్ధికి సీపెట్‌ సంపూర్ణంగా అంకితమవుతుందని; విద్య, నైపుణ్యం, సాంకేతిక దన్ను, పరిశోధనలపై దృష్టి పెడుతుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ చెప్పారు.

    విద్య, పరిశోధనల ద్వారా ప్లాస్టిక్‌ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడం సీపెట్ ప్రాథమిక లక్ష్యం. ఈ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. వనరులను సమర్థవంతంగా వినియోగించగల, విక్రయించగల ప్లాస్టిక్‌ ఆధారిత పరిష్కారాలను సృష్టించేందుకు పరిశ్రమలతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుతోంది.


(Release ID: 1627439) Visitor Counter : 387