వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పరిశ్రమ, వాణిజ్య సంఘాలతో సమావేశం నిర్వహించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్

ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ విశ్వాసం, స్వావలంబన మరియు శ్రద్ధ గల దేశాన్ని సూచిస్తుందన్న శ్రీ గోయల్

Posted On: 27 MAY 2020 6:55PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశ్రమ, వాణిజ్య సంఘాలతో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ అయిన తర్వాత కోవిడ్ -19 ప్రభావాన్న అంచనా వేయడం, వారి కార్యకలాపాలపై తదుపరి సడలింపులు అంచనా వేయడం, ఆర్థిక వ్యవస్థన తిరిగి గాడిలో పెట్టేందుకు వారి సూచనలను తెలుసుకునేందుకు జరిగిన 5వ సమావేశం ఇది.

ఈ సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రులు శ్రీ సోమ్ ప్రకాష్, శ్రీ హెచ్.ఎస్.పురి సహా ఇతర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో CII, FICCI, ASSOCHAM, NASSCOM, PHDCI, CAIT, FISME, Laghu Udyog Bharati, SIAM, ACMA, IMTMA, SICCI, FAMT, ICC and IEEMA అసోసియేషన్లు పాల్గొన్నాయి.

ఈ అసోసియేషన్లను ఉద్దేశించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, భవిష్యత్తు ఎంచుకోవడం మన చేతుల్లోనే ఉందని, ఆలోచనలు, సంస్థ అమలు ప్రణాళికలు మరియు భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చడానికి కోవిడ్ ఆనంతర కాలానికి సిద్ధంగా ఉండడం, పని చేయడం ప్రారంభించడం మేలు చేస్తుందని తెలిపారు.  ‘జాన్ భీ, జహన్ భీ’ అంటూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన సామెత గురించి మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ కొత్త ఊపిరులు ఊదాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రస్తుతం పునరుజ్జీవం గాల్లో దీపంలా ఉందని, అంశాలను వెదకాల్సిన అవసరం ఉందని తెలిపారు.  ఆత్మనిర్భర్ భారత్ కింద భారత్ తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జాతికి సహాయం చేస్తాయని అన్నారు.

ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం వ్యక్తిగతమైన సహాయమో, మూసి వేయడమో లేదా విదేశీయులకు వ్యతిరేకం కాదన్న శ్రీ పీయూష్ గోయల్, ఈ భావన సమాజంలోని అన్ని వర్గాలను జాగ్రత్తగా చూసుకునే మరియు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని పెంపొందించే నమ్మకమైన, స్వావలంబన, శ్రద్ధగల దేశాన్ని సూచిస్తుందని తెలిపారు. గత మూడు దశాబ్ధాల్లో సరళీకరణ అనంతర దేశం పురోగమిస్తోందని, అయితే దృష్టి కేంద్రీకృతమై ఉందని శ్రీ గోయల్ అన్నారు. గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని, అక్కడ నుంచి లక్షలాది మంది ప్రజలు ఉపాధి మరియు అవకాశాల కోసం నగరాలకు వలస వెళ్ళవలసి వచ్చిందన్న ఆయన, భారతదేశంలోని 130 కోట్ల మంది పౌరుల్లో ఆత్మ నిర్భర్ భారత్ ఏకత్వ స్ఫూర్తిని పెంపొందిస్తుందని ఆయన తెలిపారు. ఇది భారతీయ కంపెనీలకు మద్ధతు అందిస్తుందని ప్రస్తుతం ఫర్మిచర్, బొమ్మలు, స్పోర్ట్స్ షూస్ వంటి అనేక సాధారణ వస్తువులను కూడా దేశం దిగుమతి చేసుకుంటూ ఉండడం బాధాకరమని తెలిపారు. దేశంలో సాంకేతిక శక్తి మరియు నైపుణ్యం కలిగిన మానవ శక్తి ఉన్నప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఇది మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సంఘటితమైన మరియు విస్తృతమైన ఆలోచనల ద్వారా ఈ విషయంలో ప్రయత్నాలు చేయాలని శ్రీ గోయల్ పరిశ్రమకు పిలుపునిచ్చారు. కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటం ప్రభుత్వం మాత్రమే చేపట్టేది కాదని, ఇది దేశం సమైఖ్యంగా చేయాలని పోరాటమని, వాటాదారులంతా ఇందులో కీలక పాత్ర పోషించాల్సి ఉందని అన్నారు. వారి సలహాలను సక్రమంగా పరిశీలించి, హేతుబద్ధమైన, వాస్తవమైన డిమాండ్ల మీద సకాలంలో తగిన చర్యలు తీసుకుంటామని శ్రీ పీయూష్ గోయల్, సంఘాలకు హామీ ఇచ్చారు. 

 

***



(Release ID: 1627345) Visitor Counter : 263