రైల్వే మంత్రిత్వ శాఖ

2020 మే 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలు 3274 “శ్రామిక్ ప్రత్యేక” రైళ్లను నడిపాయి. 25 రోజుల్లో “శ్రామిక్ ప్రత్యేక” రైళ్ల ద్వారా 44 లక్షలకు పైగా ప్రయాణికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు.

రైళ్లలో ప్రయాణించే వలసదారులకు 74 లక్షలకు పైగా ఉచిత భోజనాలతో పాటు ఒక కోటికి పైగా మంచి నీళ్ల సీసాలను అందజేశారు.


ఈ రోజు నడుస్తున్న రైళ్లు ఎలాంటి రద్దీని ఎదుర్కోలేదు.


శ్రామిక్ ప్రత్యేక రైళ్లతో పాటు, మే 12వ తేదీ నుండి న్యూఢిల్లీని కలుపుతూ 15 జతల ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. జూన్ 1వ తేదీ నుండి టైం టేబుల్ లో పేర్కొన్న మరో 200 రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

Posted On: 26 MAY 2020 5:04PM by PIB Hyderabad

వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతర వ్యక్తులను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా, భారతీయ రైల్వేలు 2020 మే నెల 1వ తేదీ నుండి "శ్రామిక్ ప్రత్యేక" రైళ్లను నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 2020 మే 25వ తేదీ వరకు 3274 “శ్రామిక్ ప్రత్యేక” రైళ్లను నడపడం జరిగింది. ఈ “శ్రామిక్ ప్రత్యేక” రైళ్ల ద్వారా 44 లక్షలకు పైగా ప్రయాణికులను వారి సొంత రాష్ట్రాలకు చేరారు.  2020 మే నెల 25వ తేదీన 2.8 లక్షల ప్రయాణీకులతో 223 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు బయలుదేరాయి. 

ఈ రైళ్లలో ప్రయాణించే వలసదారులకు ఐ.ఆర్.సి.టి.సి.  74 లక్షలకు పైగా ఉచిత భోజనాలతో పాటు ఒక కోటికి పైగా మంచి నీళ్ల సీసాలను పంపిణీ చేసింది.

ఈ రోజు నడుస్తున్న రైళ్లు ఎలాంటి రద్దీని ఎదుర్కోవటం లేదని తెలిసింది. 

శ్రామిక్ ప్రత్యేక రైళ్లతో పాటు, మే 12వ తేదీ నుండి న్యూఢిల్లీని కలుపుతూ 15 జతల ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. జూన్ 1వ తేదీ నుండి టైం టేబుల్ లో పేర్కొన్న మరో 200 రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

 

****



(Release ID: 1626952) Visitor Counter : 312