ప్రధాన మంత్రి కార్యాలయం
బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధాన మంత్రి
Posted On:
25 MAY 2020 7:27PM by PIB Hyderabad
బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు. ఈద్-ఉల్-ఫిత్ర్ సందర్భం లో బాంగ్లాదేశ్ ప్రజల కు మరియు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
నేత లు ఉభయులూ అమ్ఫాన్ తుఫాను వల్ల ఇరు దేశాల లోనూ వాటిల్లిన నష్టం తాలూకు వారి వారి అంచనాల ను ఒకరి తో మరొకరు వెల్లడి చేసుకొన్నారు. ప్రపంచవ్యాప్త వ్యాధి ‘కోవిడ్’ యొక్క స్థితి ని గురించి మరియు ఈ విశ్వమారి విషయం లో ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సమన్వయాన్ని గురించి కూడా నేత లు చర్చించారు. ఈ సవాళ్ల కు పరిష్కారాల ను అన్వేషించడం లో బాంగ్లాదేశ్ కు భారతదేశం సాయపడుతుందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
స్నేహశీలురైనటువంటి బాంగ్లాదేశ్ ప్రజల కు మరియు ప్రధాని శేఖ్ హసీనా కు మంచి ఆరోగ్యం మరియు శ్రేయం ప్రాప్తించాలంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
***
(Release ID: 1626805)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam