ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్స్-1
41.57 శాతానికి చేరిన రికవరీ రేటు
Posted On:
25 MAY 2020 4:36PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ,కోవిడ్ -19 నియంత్రణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో పలు ముందస్తు, సానుకూల చర్యలు చేపడుతోంది. ఈ చర్యలను ఉన్నత స్ధాయిలో క్రమం తప్పకుండా సమీక్షించడం జరుగుతోంది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 57,720 మంది కోవిడ్ వైరస్‌నుంచి కోలుకున్నారు. గత 24 గంటలలో 3280 మంది ఈ వ్యాధినుండి నయమయ్యారు. దీనితో మొత్తం రికవరీ రేటు 41.57 శాతానికి చేరింది. దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కేసుల సంఖ్య 1,38,845 కు చేరింది. ప్రస్తుతం వైద్యుల పర్యవెక్షణ లో ఉన్న కేసుల సంఖ్య 77,103
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in కు అలాగే @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
(Release ID: 1626767)
Visitor Counter : 248
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam