రైల్వే మంత్రిత్వ శాఖ

2020 మే నెల 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు 37 లక్షల మంది ప్రయాణికులతో 2813 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపిన - భారతీయ రైల్వేలు

రద్దీ పరిస్థితి గణనీయంగా తగ్గింది మరియు రైళ్ల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి.


మొత్తం శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 80 శాతం రైళ్ళు ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ లోని వివిధ గమ్యస్థానాలకు చేరాయి.


ఈ గమ్యస్థానాలకు వెళ్లే రైళ్లు ఎక్కువకావడంతో ఈ మార్గాల్లో రద్దీ ఏర్పడింది.


దీనికి తోడు, స్టేషన్లలో సామాజిక దూరం పాటించడం వంటి వివిధ ఆరోగ్య పరమైన నిబంధనల కారణంగా ప్రయాణీకులు రైలు నుండి దిగేటప్పుడు ఎక్కువ సమయం తీసుకోవడంతో టెర్మినళ్ల వద్ద రద్దీ ఏర్పడింది. ఇది రాకపోకల రద్దీని మరింత ప్రభావితం చేసింది.


ఈ రద్దీని అధిగమించడానికి కొన్ని రైళ్లను మధుర, ఝార్సుగూడ మీదుగా మళ్లించడం జరిగింది.


రైల్వే బోర్డు స్థాయిలో, జోనల్ రైల్వే స్థాయి మరియు డివిజనల్ స్థాయిలో 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోంది.


ఈ శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో ప్రయాణీకులకు క్రమం తప్పకుండా భోజనం మరియు త్రాగు నీరు సరఫరా అయ్యేలా మరియు ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలగకుండా ఐ.ఆర్.సి.టి.సి. మరియు రైల్వే శాఖ అన్ని చర్యలు తీసుకుంది.

Posted On: 24 MAY 2020 5:11PM by PIB Hyderabad

భారతీయ రైల్వేయాలు 2020 మే నెల 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు 37 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణీకులతో 2,813 కంటే ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపింది.  వీటిలో 60  శాతం రైళ్లు గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల నుండి బయలుదేరగా, వీటిలో ఎక్కువ రైళ్లు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేరాయి.  మొత్తం శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో దాదాపు 80 శాతం రైళ్లు ఉత్తరప్రదేశ్ (1301 రైళ్లు) మరియు బీహార్ (973 రైళ్లు) రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి.  వీటిలో ఎక్కువ రైళ్లు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా లక్నో, గోరఖ్ పూర్ పరిసర ప్రాంతాలకు, బీహార్ రాష్ట్రంలో పాట్నా చుట్టు పక్కల ప్రాంతాలకు చేరుకున్నాయి.  నిన్నటి నుండీ బయలుదేరిన మొత్తం 565 రైళ్లలో,  266 రైళ్లు బీహార్ రాష్ట్రానికి, 172 రైళ్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికీ నడుస్తున్నాయి. 

 

ఈ గమ్యస్థానాలకు వెళ్లే రైళ్లు ఎక్కువకావడంతో  ఈ మార్గాల్లో రద్దీ ఏర్పడింది. దీనికి తోడు, స్టేషన్లలో సామాజిక దూరం పాటించడం వంటి వివిధ ఆరోగ్య పరమైన నిబంధనల కారణంగా ప్రయాణీకులు రైలు నుండి దిగేటప్పుడు ఎక్కువ సమయం తీసుకోవడంతో టెర్మినళ్ల వద్ద రద్దీ ఏర్పడింది.  ఇది రాకపోకల రద్దీని మరింత ప్రభావితం చేసింది.

 

ఈ రద్దీని అధిగమించడానికి  కొన్ని రైళ్లను మధుర, ఝార్సుగూడ మీదుగా మళ్లించడం జరిగింది.  దీనితో పాటు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మార్గంలో రద్దీని నివారించడానికి ఆయా మార్గాల హేతుబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.  రైళ్లు ఆలస్యం కాకుండా చూసేందుకు, రైల్వే బోర్డు స్థాయిలో, జోనల్ రైల్వే స్థాయి మరియు డివిజనల్ స్థాయిలో 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోంది.  శ్రామిక్ ప్రత్యేక రైళ్లు సరైన సమయానికి నడిచే విధంగా చూసేందుకు రైళ్లను నడిపే సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.  ఈ చర్యల కారణంగా రద్దీ పరిస్థితి గణనీయంగా తగ్గింది మరియు రైళ్ల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. 

 

రాకపోకల రద్దీకి దారితీసే తూర్పు ప్రాంత రైళ్ల సంఖ్య పెరగడంతో, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీనితో భోజన పంపిణీ సమయాలు తారుమారయ్యాయి.  ఈ శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో ప్రయాణీకులకు క్రమం తప్పకుండా భోజనం మరియు త్రాగు నీరు సరఫరా అయ్యేలా మరియు ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలగకుండా ఐ.ఆర్.సి.టి.సి.  మరియు రైల్వే శాఖ అన్ని చర్యలు తీసుకుంది. 

 

****



(Release ID: 1626632) Visitor Counter : 229