హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 కార‌ణంగా విధించిన వీసా, ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన కేంద్ర‌ హోం మంత్రిత్వ‌శాఖ‌

ఒసిఐ కార్డుక‌లిగి .విదేశాల‌లో చిక్కుకుపోయిన కొన్ని కేట‌గిరీల వారు తిరిగి ఇండియాకు వ‌చ్చేందుకు అనుమ‌తి

Posted On: 22 MAY 2020 3:06PM by PIB Hyderabad

 కోవిడ్ -19 కార‌ణంగా విధించిన వీసా, ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను  కేంద్ర‌ హోంమంత్రిత్వ‌శాఖ స‌డ‌లించింది.
  ఓవ‌ర్సీస్  సిటిజ‌న్ ఆఫ్ ఇండియా  (ఒసిఐ) కార్డుక‌లిగి .విదేశాల‌లో చిక్కుకుపోయిన కొన్ని కేట‌గిరీల వారు ఇండియాకు తిరిగి వ‌చ్చేందుకు హోంమంత్రిత్వశాఖ అనుమ‌తి మంజూరు ,చేసింది.

ఒసిఐ కార్డు క‌లిగి విదేశాల‌లో చిక్కుకుపోయిన కింది కేట‌గిరీల వారిని ఇండియా కు తిరిగివ‌చ్చేందుకు అనుమ‌తించారు:-
--విదేశాల‌లో భార‌త జాతీయుల‌కు పుట్టిన మైన‌ర్ పిల్ల‌లు, ఒసిఐ కార్డు క‌లిగిన వారు.
-- కుటుంబంలో ఎవ‌రైనా చ‌నిపొవ‌డం వంటి కుటుంబ అత్య‌వ‌స‌ర ‌ప‌రిస్థితుల కార‌ణంగా ఇండియాకు రావాల‌నుకుంటున్న ఒసిఐ కార్డుదారులు.
--దంప‌తుల‌లో ఒక‌రు ఒసిఐ కార్డుక‌ల‌వారై ఉండి, మ‌రొక‌రు భార‌త‌జాతీయులై, ఇండియాలో శాశ్వ‌త నివాసం క‌లిగిన వారు.
-- ఒసిఐ కార్డు క‌లిగిన యూనివ‌ర్సిటీ విద్యార్థులు (చ‌ట్ట‌ప్ర‌కారం మైన‌ర్లుకానివారు).  అయితే, త‌ల్లిదండ్రులు భార‌తీయ పౌరులై ఉండి  భార‌త్‌లో నివ‌సిస్తున్న‌వారై ఉండాలి.

 ఒసిఐ కార్డు క‌లిగి విదేశాల‌లో చిక్కుకుపోయిన పైన పేర్కొన్న కేట‌గిరీల‌కు చెందిన వారిని తిరిగి ఇండియాకు తీసుకువ‌చ్చే ఏ విమానానికి, నౌక‌, రైలు లేదా ఏ ఇత‌ర వాహ‌నానికీ 07-05-2020 వ తేదీ  , అంత‌కుముందు విధించిన ప్ర‌యాణ ఆంక్ష‌లు ఏవీ వ‌ర్తించ‌వు. అయితే , కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ 07-05-2020న జారీ చేసిన  ఇత‌ర ష‌ర‌తులు, విధివిధానాలు మాత్రం అలాగే కొన‌సాగుతాయి.
 అధికారిక స‌మాచారం కోసం కింద క్లిక్ చేయండి.

 (Release ID: 1626077) Visitor Counter : 248