రైల్వే మంత్రిత్వ శాఖ

రిజర్వేషన్‌ కౌంటర్ల పునఃప్రారంభానికి రైల్వే శాఖ పచ్చజెండా

సాధారణ సేవ కేంద్రాలు, ఏజెంట్ల ద్వారా టిక్కెట్ల బుకింగ్‌కు అనుమతి
దశలవారీగా రిజర్వేషన్‌ కౌంటర్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని జోనల్‌ కార్యాలయాలకు ఆదేశాలు
రిజర్వేషన్‌ కౌంటర్ల ప్రాంతాలు, పని వేళలను ప్రచారం చేయాలని ఆదేశాలు

Posted On: 21 MAY 2020 9:12PM by PIB Hyderabad

రైల్వే రిజర్వేషన్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకునేందుకు, రిజర్వేషన్‌ కౌంటర్లను దశల వారీగా రైల్వే శాఖ పునఃప్రారంభించబోతోంది. స్థానిక అవసరాలు, పరిస్థితులను బట్టి రిజర్వేషన్‌ కౌంటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుని, తెలియజేయాలని జోనల్‌ కార్యాలయాలను రైల్వే శాఖ ఆదేశించింది. రిజర్వేషన్‌ కౌంటర్లు శుక్రవారం నుంచి దశల వారీగా ప్రారంభమవుతాయి. రిజర్వేషన్‌ కౌంటర్ల ప్రారంభం, ప్రాంతం, పని వేళల సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తారు. సాధారణ సేవ కేంద్రాలు, ఏజెంట్ల ద్వారా కూడా శుక్రవారం నుంచి రిజర్వేషన్‌ టిక్కెట్ల బుకింగ్‌కు రైల్వే శాఖ అనుమతినిచ్చింది.

    ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు నడుస్తాయి. రైల్వే సేవలను పునరుద్ధరించడంలో బుకింగ్ కేంద్రాలను పునఃప్రారంభించడం ఒక ముఖ్యమైన అడుగుగా మారుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రిజర్వేషన్‌ రైళ్లలో ప్రయాణించేవారు టిక్కెట్లు బుక్‌ చేసుకునే ప్రక్రియను సులభతరం చేస్తుంది.

    ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో.. సామాజిక దూరం, పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి జోనల్‌ రైల్వేలు విధులు నిర్వహిస్తాయి.
 


(Release ID: 1625974) Visitor Counter : 274