మంత్రిమండలి
అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం (ఇసిఎల్‌జిఎస్) ప్రవేశపెట్టడం ద్వారా 3 లక్షల కో్ట్ల రూపాయలవరకు అదనపు నిదులకు కేంద్ర కేబినెట్ అనుమతి.
నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సిజిటిసి)నుంచి సభ్య రుణ సంస్థలకు (ఎంఎల్ఐ ఎస్ లు) నూరు శాతం రుణ గ్యారంటీ వర్తింపు
ఆసక్తికగల ముద్ర రుణగ్రహీతలతోసహా ,అర్హత కలిగిన మైక్రో, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజ్ (ఎంఎస్ఎంఇ) రుణ గ్రహీతలకు, హామీతోకూడిన అత్యవసర క్రెడిటి్‌లైన్ (జిఇసిఎల్) సదుపాయం
Posted On:
20 MAY 2020 2:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ కింది అనుమతులు జారీ చేసింది.
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారటీ పథకం కింద , అర్హత కలిగిన ఎం.ఎస్.ఎం.ఇలు , ఆసక్తిగల ముద్ర రుణగ్రహీతలకు 3 లక్షల కోట్లరూపాయల వరకు అదనపు నిధులు అందుబాటులోకి తెచ్చేందుకు వీలు కల్పించారు.
ఈ పథకం కింద , అర్హత కలిగిన ఎం.ఎస్.ఎం.ఇలు, ఆసక్తికలిగిన ముద్ర రుణగ్రహీతలకు గ్యారంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ (జిఇసిఎల్) సదుపాయం కింద నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ నూరు శాతం గ్యారంటీ కవరేజ్ సదుపాయాన్ని కలిగిస్తుంది.
ఇందుకోసం ,కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి మరో మూడు ఆర్థిక సంవత్సరాల కాలం వరకు 41,600 కోట్ల రూపాయల కార్పస్ అందుబాటులో ఉంచుతుంది..
ఈ పథకం జిఇసిఎల్ సదుపాయం కింద మంజూరైన అన్ని రుణాలకు, ఈ పథకం ప్రకటించిన తేదీ నుంచి 31-10-2020 వరకు లేదా జిఇసిఎల్ కింద 3,00,000 కోట్లరూపాయలు మంజూరు అయ్యేవరకు ఏది ముందుపూర్తి అయితే , దాని ప్రకారం వర్తించేలా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
వివరాలు:
అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకాన్ని (ఇసిఎల్‌జిఎస్), మున్నెన్నడూ లేనటువంటి కోవిడ్ -19 పరిస్థితులు,అనంతరం ప్రకటించిన లాక్ డౌన్ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలకింద రూపొందించారు. కోవిడ్ -19 ,పరిణామాలు, తదనంతర లాక్‌డౌన్ ఎం.ఎస్.ఎం.ఇ రంగంలో తయారీ , ఇతర కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఎం.ఎస్.ఎం ఇలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతో, పూర్తిస్థాయి గ్యారంటీ కలిగిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ రూపంలో అదనంగా 3 లక్షల కోట్ల రూపాయల నిధులు అందుబాటులోకి తెచ్చేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
కోవిడ్ -19 సంక్షోభం సృష్టించిన ఆర్థిక ఇబ్బందులరీత్యా, సభ్య రుణదాత సంస్థలు (ఎంఎల్ఐఎస్‌లు) అంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్‌బిఎఫ్‌సిలు) ఎం.ఎంస్.ఎం. ఇ రుణ గ్రహీతలకు అదనపు నిధుల సదుపాయం కల్పించడం, నిధుల అందుబాటును పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం, అలాగే రుణగ్రహీతలు జిఇసిఎల్ ఫండింగ్‌ను తిరిగి చెల్లించనందువల్ల ఏదైనా నష్టం వాటిల్లితే దానికి నూరుశాతం గ్యారంటీని ఇందులో పొందుపరిచారు.
ఈ పథకంలోని ముఖ్యాంశాలు :
ఈ పథకం కింద జిఇసిఎల్ నిధులు పొందడానికి , ఎంఎస్ఎంఇ రుణ గ్రహీత ఖాతాలు కలిగిన వారై ఉండి, 29-02-2020 నాటికి 25 కోట్ల రూపాయల వరకు రుణ బకాయిని ఆ రోజుకంటే ముందు 60 రోజులు, లేదా అంతకంటె తక్కువ కాలం కలిగి ఉన్న ఖాతాదారులు అంటే, రెగ్యులర్, ఎస్ఎం.ఎ 0, ఎస్ఎంఎ 1 ఖాతాలు, వార్షిక టర్నోవర్ 100 కోట్ల రూపాయలవరకు గల వారు అర్హులు.
అర్హత కలిగిన ఎంఎస్ఎం ఇ రుణగ్రహీతలకు జిఇసిఎల్ నిధులను అదనపు వర్కింగ్ కాపిటల్ టరమ్ లోన్ ( బ్యాంకులు, ఆర్థిక సంస్థలైనట్లయితే) లేదా అదనపు టరమ్ లోన్ (ఎన్‌బిఎఫ్ సి లు అయినట్లయితే)ను 29 ఫిబ్రవరి 2020 వ తేదీ నాటికి , వాటి మొత్తం రుణ బకాయిలో 20 శాతం మొత్తం వరకు ఇస్తారు.
జిఇసిల్ ద్వారా అందించే మొత్తం నిదులను ఎన్‌సిజిటిసి ద్వారా నూరు శాతం గ్యారంటీతో ఇసిఎల్‌జిఎస్ కింద ఎం.ఎల్.ఐ ఎస్‌లకు సమకూరుస్తారు.
ఈ పథకం కింద రుణ కాల పరిమితి 4 సంవత్సరాలుగా ఉంటుంది. అసలుపై ఒక ఏడాది మారటోరియం ఉంటుంది.
ఈ పథకం కింద మెంబర్ లెండింగ్ సంస్థ (ఎంఎల్ఐ ఎస్) లనుంచి ఎసిజిటిసి ఎలాంటి గ్యారంటీ ఫీజు వసూలు చేయదు.
ఈ పథకం కింద వడ్డీరేట్ల పరిమితి బ్యాంకులకు,ఆర్థిక సంస్థలకు(ఎఫ్ఐలకు) 9.25 శాతంగా, ఎన్‌బిఎఫ్‌సిలకు 14 శాతంగా నిర్ణయించారు.
పథకం అమలుకు సంబంధించిన షెడ్యూలు:
ఈ పథకం జిఇసిఎల్ కింద మంజూరైన అన్ని రుణాలకు , పథకం ప్రకటించిన తేదీ నుంచి 31.10.2020 వరకు లేదా జిఇసిఎల్ కింద 3 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసేంత వరకు ఏది ముందు అయితే అది వరకు ఉంటుంది.
ప్రభావం:
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తలెత్తిన అనూహ్య పరిస్థితులు, ఆ తదనంతరం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా ఎంఎస్ఎంఇ రంగం తయారీ ఇతర కార్యకలాపాలు బాగా దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఆర్థిక రంగంలో ఎం.ఎస్.ఎం.ఇలు పోషిస్తున్న కీలక పాత్ర, అవి కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఈ పథకం ఈ రంగానికి అత్యావశ్యకమైన సహాయాన్ని అందిస్తుంది. ఇందుకు ఎం.ఎల్.ఐలకు రాయితీల కింద అదనపు రుణ సదుపాయాన్ని 3 లక్షల కోట్ల రూపాయల వరకు తక్కువ ధరకు అందించడం జరుగుతుంది. దీనితో ఎం.ఎస్.ఎం ఇలు తమ నిర్వహణాపరమైన బాద్యతలను నెరవేర్చడానికి వీలు కలగడంతోపాటు తమ వ్యాపారాలు పునః ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుంది.
ప్రస్తుత అనూహ్య పరిస్థితులలో ఎం.ఎస్.ఎం.ఇలకు మద్దతు ఇవ్వడం వల్ల అవి తమ కార్యకలాపాలను కొనసాగించ గలుగుతాయి. ఈ పథకం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి మద్దతు నిస్తుంది.
(Release ID: 1625399)
Visitor Counter : 364
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam