రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వే, శ్రామిక్ స్పెషల్ రైళ్లద్వారా 19 రోజులలో 21.5 లక్షలమంది వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేర్చింది.
మరో 1600 శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు నడిపింది.
వలసకార్మికులకు మరింత ఊరట కలిగించేందుకు భారతీయ రైల్వే శ్రామిక్ ప్రత్యేక రైళ్ళను రెట్టింపు చేయనుంది.ఈ రాత్రికి 200 రైళ్ళు నడపనుంది.
2020 జూన్ 1 నుంచి భారతీయ రైల్వే 200 టైమ్‌టేబుల్డ్ రోజువారీ కొత్త రైళ్ళను ప్రవేశపెట్టనుంది.
వీటికి బుకింగ్ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇది కొద్దిరోజులలో ప్రారంభమౌతుంది. ఇవి నాన్ ఎసి రైళ్లు. ఈ రైళ్ళ షెడ్యూలు, అవి నడిచే సమయం తదితర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
ఈ చర్య దేశవ్యాప్తంగా గల వలస కార్మికులకు పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించనుంది.
Posted On:
19 MAY 2020 9:38PM by PIB Hyderabad
వలస కార్మికులకు మరింత ఉపశమనం కలిగించడానికి శ్రామిక్ రైళ్ల సంఖ్యను రెట్టింపు చేయాలని భారత రైల్వే భావిస్తోంది.
ఈ శ్రామిక్ స్పెషల్ రైళ్లతో పాటు, జూన్ 1, 2020 నుండి ఇండియన్ రైల్వే 200 కొత్త టైమ్ టేబుల్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ రైళ్ల మార్గాలు , షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు. ఈ రైళ్ళకు బుకింగ్ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేసుకోవలసి ఉంటుంది. దీనిని కొద్దిరోజులలో ప్రకటిస్తారు.
ఇవి నాన్ ఎసి రైళ్ళు. ఏ రైల్వే స్టేషన్‌లోనూ వీటికి టిక్కెట్లు అమ్మరు. వీటిలో ప్రయాణించదలచుకున్న వారు టిక్కెట్లు కొనుగోలుకు రైల్వేస్టేషన్‌కు రానవసరం లేదు.
వలసకార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారందరినీ వారి స్వరాష్ట్రాలకు వీలైనంత త్వరగా తీసుకువెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రైల్వే తెలిపింది.
తాము ఉంటున్న ప్రాంతానికిదగ్గరలోని మెయిన్ లైన్ పై గల రైల్వే స్టేషన్‌లో వారు ఎక్కేలా కృషిచేయడం జరుగుతుంది.
రహదారులపై నడుస్తున్న వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపడానికి వీరి పేర్లను సమీప జిల్లా కేంద్రంలో రిజిస్టర్ చేయించి ,తరువాత వారిని సమీప మెయిన్ లైన్ రైల్వే స్టేషన్‌కు తరలించి , ఈ వలస కార్మిక ప్రయాణికుల జాబితాను రైల్వేకు ఇవ్వాల్సిందిగా రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది .దీనివల్ల. రైల్వే అధికారులు శ్రామిక్ స్పెషల్స్ ద్వారావీరి తదుపరి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయడానికి వీలుంటుంది.
గత 19 రోజుల్లో 21.5 లక్షలకు పైగా వలసదారులను శ్రామిక్ స్పెషల్" రైళ్ల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు తరలించారు. మే 19 వరకు 1600 కి పైగా శ్రామిక్ స్పెషల్" రైళ్లను నడిపారు.
వలసకార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారందరినీ వారి స్వరాష్ట్రాలకు వీలైనంత త్వరగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రైల్వే తెలిపింది.
(Release ID: 1625268)
Read this release in:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati