మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

విద్యారంగానికి ఊతం ఇచ్చేందుకు ప‌లు చ‌ర్య‌లు ప్ర‌క‌టించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌

మాన‌వ సంక్షేమ మూల‌ధ‌నంపై పెట్టే పెట్టుబ‌డి ఉత్పాద‌క‌, దేశ శ్రేయ‌స్సు పై పెట్టే పెట్టుబ‌డి : శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌
ఒక దేశం- ఒక డిజిటల్ ప్లా్ట్‌ఫాం, ఒక తర‌గ‌తి ఒక చాన‌ల్ వంటివి దేశంలోని మారుమూల ప్రాంతాల వారికి కూడా నాణ్య‌మైన విద్య‌ను అందిస్తాయి : మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి

Posted On: 18 MAY 2020 4:06PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ‌ మంత్రి శ్రీమతి. నిర్మ‌లా సీతారామ‌న్‌,  విద్యా రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు  మే 17 న న్యూఢిల్లీలో ప‌లు చ‌ర్య‌ల‌ను ప్రకటించారు. మానవ సంక్షేమ‌ మూలధనంపై పెట్టుబడులు పెట్టడం అంటే దేశ ఉత్పాదకత, శ్రేయస్సు కు పెట్టే  పెట్టుబడితో సమానం అని మంత్రి అన్నారు. ప్రస్తుత మహమ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన ప‌రిస్థితులు మన విద్యావ్యవస్థకు కొత్త సవాళ్లను , అనేక అవకాశాలను అందించిందన్నారు..
     విద్యా రంగం, అనేక చ‌ర్య‌ల‌ను  చేప‌ట్ట‌డానికి  ప్ర‌స్తుత  అవకాశాన్ని ఉపయోగించుకున్న‌దని అమె అన్నారు.  ముఖ్యంగా కొత్త శకానికి నాంది పలుకుతూ మానవ సంక్షేమ మూలధనంపై  ప్ర‌త్యేక దృష్టితో  పెట్టుబడి పెట్ట‌డం ద్వారా,
వినూత్న పాఠ్యాంశాలు , బోధనలను అవలంబించడం, గ్యాప్ ప్రాంతాలపై శక్తిని కేంద్రీకరించడం, ప్రతి దశలో మరింత సమగ్రంగా  సాంకేతికతను స‌మీకృతం చేయ‌డం వంటి చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా విద్య  అన్ని స్థాయిలలో ,అన్ని ప్రాంత‌ల‌లో  అంద‌రు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా అందరూ నేర్చుకునేలా స‌మాన అవ‌కాశాలు క‌ల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అన్నారు
     విద్యా రంగానికి ప్రాధాన్యత ఇచ్చినందుకు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ‘శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్’ ప్రధాన‌మంత్రి  శ్రీ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.విద్యారంగంలో ప‌లు కార్య‌క్ర‌మాలు ప్రారంభించినందుకు  కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, విద్యావ్యవస్థలో గ‌ణ‌నీయ‌మైన మార్ను ను తీసుకురావ‌డం ద్వారా దేశంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని సాధిస్తార‌న్న ఆశాభావాన్ని ఆయ‌న‌ వ్యక్తం చేశారు.

    Dr Ramesh Pokhriyal Nishank
    ✔@DrRPNishank
     · May 17, 2020

    शिक्षा की पहुँच को और अधिक व्यापक और सुगम बनाने हेतु माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के कुशल मार्गदर्शन में माननीय वित्त मंत्री @nsitharaman जी और वित्त राज्यमंत्री @ianuragthakur जी ने "PM eVIDYA" नामक पहल की शुरुआत की हैं,इसके लिए उनका आभार। #AatmaNirbharApnaBharat

    Dr Ramesh Pokhriyal Nishank
    ✔@DrRPNishank

    भारत सरकार की इस पहल से हमारी शिक्षा व्यवस्था और अधिक मजबूत, समावेशी एवं उपयोगी साबित होगी और देश के करोड़ों छात्र-छात्राएं इससे लाभान्वित होंगे।@PMOIndia@narendramodi@nsitharaman@nsitharamanoffc@ianuragthakur@PIB_India@DDNewslive#AatmaNirbharApnaBharat
    152
    12:43 PM - May 17, 2020
   

"ఒక దేశం, ఒక డిజిటల్ వేదిక, "ఒక తరగతి ఒక‌ ఛానల్‌ అనేవి దేశంలోని సుదూర ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా సామగ్రిని అందేలా చేస్తాయని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. ఈ కార్యక్రమాలు విద్య అందుబాటును , ఈక్విటీని పెంచుతాయని , రాబోయే కాలంలో స్థూల నమోదు నిష్పత్తిని మెరుగు పరుస్తాయని ఆయన అన్నారు. దివ్యాంగ‌ పిల్లలకు కూడా తగిన శ్రద్ధ వహిస్తున్నామని, ఈ చర్యలు న‌వ‌భారత నిర్మాణంలో కొత్త ఉదాహరణగా నిలుస్తాయని ఆయన అన్నారు.
కేంద్ర ఆర్థిక‌మంత్రి ఈ దిశ‌గా కొన్ని త‌క్ష‌ణ చ‌ర్య‌లు ప్ర‌క‌టించారు. అవి:
      డిజిటల్,ఆన్‌లైన్ , ఆన్-ఎయిర్ విద్యకు సంబంధించిన అన్ని ప్రయత్నాలను ఏకీకృతం చేసే పిఎం ఇ-విద్యా అనే సమగ్ర  కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించడం జ‌రుగుతుంది, ఇది విద్యకు సంబంధించి బహుళ-విధ అందుబాటుకు వీలు క‌ల్పిస్తుంది. అన్ని రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు పాఠశాల విద్యలో నాణ్యమైన ఇ-కంటెంట్‌ను అందించడానికి దీక్షా(DIKSHA ) (ఒక దేశం-వన్ డిజిటల్ ప్లాట్‌ఫాం) ఇప్పుడు దేశపు డిజిటల్ మౌలిక సదుపాయంగా మారుతుంది;  టెలివిజ‌న్ ద్వారా విద్య‌కు సంబంధించి ( ఒక త‌ర‌గ‌తి, ఒక ఛాన‌ల్‌) 1 వ‌త‌ర‌గ‌తి నుంచి 12 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క త‌ర‌గ‌తికి ఒక ప్రత్యేక ఛాన‌ల్ స‌దుపాయం వ‌ల్ల నాణ్య‌మైన విద్యా సంబంధ మెటీరియ‌ల్ విద్యార్థుల‌కు అందుబాటులోకి వ‌స్తుంది. పాఠ‌శాల‌, ఉన్నత విద్యారంగంలోని వారికి మూక్స్ ఫార్మ‌ట్ లో స్వ‌యం ఆన్‌లైన్ కోర్సులు, ఐఐటిపిఎల్ ద్వారా ఐఐటిజెఇఇ ,నీట్ ప్రిప‌రేష‌న్‌, క‌మ్యూనిటీ రేడియో ద్వారా పాఠాల ప్ర‌సారం, సిబిఎస్ఇ వారి శిక్షా వాని పాడ్ కాస్ట్‌, డిజిట‌ల్లీ యాక్సిస‌బుల్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్ - డైసీ ప్లాట్ ఫాంపై దివ్యాంగుల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన స్ట‌డీ మెటీరియ‌ల్, అలాగే  దివ్యాంగుల కోసం సంకేత భాష‌లో  ఎన్ఐఒఎస్ వెబ్‌సైట్‌, యూట్యూబ్‌లోని మెటీరియ‌ల్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి దేశ‌వ్యాప్తంగాగ‌ల సుమారు 25 కోట్ల మంది పాఠ‌శాల స్థాయి విద్యార్థుల‌కు ఉపక‌రిస్తాయి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్  మహమ్మారి  విస్త‌రించిన ఈ సమయంలో, విద్యార్థుల మానసిక ఆరోగ్యం కాపాడ‌డం , మానసిక క్షేమం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు , వారి కుటుంబాలకు మానసిక సామాజిక సహాయాన్ని అందించడం ఎంతైనా అవసరం. ఒక వెబ్‌సైట్, టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్, కౌన్సెలర్ల జాతీయ డైరెక్టరీ, ఇంటరాక్టివ్ చాట్ ప్లాట్‌ఫాం మొదలైన వాటి ద్వారా మనోదర్ప‌ణ్ కార్య‌క్ర‌మం ప్రారంభించబడుతోంది. ఈ చ‌ర్య‌ దేశంలోని పాఠశాలలకు వెళ్లే పిల్లలందరికీ, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు  పాఠశాల విద్యలోభాగ‌స్వాములంద‌రికీ ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంది.
        ఉన్నత విద్యారంగంలో ఇ-లెర్నింగ్‌ను ప్రభుత్వం విస్తరిస్తోంది - ఓపెన్, డిస్టెన్స్ , ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేయడం ద్వారా. అత్యున్న‌త స్థాయి 100 విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభిస్తాయి. అలాగే, సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు , ODL ప్రోగ్రామ్‌లలో ఆన్‌లైన్ భాగం కూడా ప్రస్తుత 20 శాతం నుండి 40 శాతానికి పెంచబడుతుంది. ఇది వివిధ కళాశాలలు , విశ్వవిద్యాలయాలలో దాదాపు 7 కోట్ల మంది విద్యార్థులకు మెరుగైన అభ్యాస అవకాశాలను అందిస్తుంది.
     అభ్యాస ఫలితాలపై దృష్టి సారించే విద్యార్థులకు అనుభవపూర్వక , ఆనందకరమైన అభ్యాసంతో పాటు విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక , కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పాఠ్యాంశాలు భారతీయ నైతికత మూలాలు క‌లిగి ఉండాలి , ప్రపంచ నైపుణ్య అవసరాలతో అనుసంధాన‌త క‌లిగి ఉండాలి. అందువల్ల, ప్రపంచ బెంచ్‌మార్క్‌ల ప్రకారం విద్యార్థులు , భవిష్యత్ ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్య , అలాగే శిశు విద్యా బోధ‌న‌ కోసం కొత్త జాతీయ పాఠ్యాంశాలు , బోధనా ముసాయిదాను సిద్ధం చేయాలని నిర్ణయించ‌డం జ‌రిగింది.
    దేశంలోని ప్రతి బిడ్డ తప్పనిసరిగా గ్రేడ్ 3 లో పునాది అక్షరాస్యత , న్యూమ‌ర‌సీ పొందేలా చూడటానికి జాతీయ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్ను  ప్రారంభించడం జ‌రుగుతుంది. దీని కోసం, ఉపాధ్యాయ సామర్థ్యం పెంపొందించడం, దృఢ‌మైన‌ పాఠ్య ప్రణాళిక, ఆకర్షణీయమైన అభ్యాస సామగ్రి - ఆన్‌లైన్ - ఆఫ్‌లైన్ విధానం , అభ్యాస ఫలితాలు , వాటి ప్రామాణీకృత‌ సూచికలు, అంచనా పద్ధతులు, అభ్యాస పురోగతిని ట్రాక్ చేయడం మొదలైనవి క్రమబద్ధమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లడానికి  చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంది. ఈ మిషన్ 3 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 4 కోట్ల మంది పిల్లల అభ్యాస అవసరాలను తీర్చనుంది.


(Release ID: 1624979) Visitor Counter : 304