హోం మంత్రిత్వ శాఖ

భార‌త‌దేశ‌పు సంక్షేమం రైతుల ద్వారానే సాధ్యం- శ్రీ‌మోదీ ప్ర‌భుత్వ‌విశ్వాసం. రైతుల‌కు సాధికార‌త క‌ల్పిస్తే దేశం స్వావ‌లంబ‌న సాధిస్తుంఇ: శ్రీఅమిత్ షా

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రైతుల ప‌ట్ల ఎంతో ఆద‌ర‌ణ‌చూపుతున్నారు, ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లోనూ వారిప‌ట్ల ఆదర‌ణ‌తో ఉన్నారు. మొత్తం ప్ర‌పంచానికే ఇది ఆద‌ర్శ‌ప్రాయంగా ఉంది.: కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షాr
శ్రీ న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ మిష‌న్ మున్నెన్న‌డూ చూడ‌ని అభివృద్ధిని సాధిస్తుంది.ఆదాయాలు, ఉపాధి పెరుగుతుంది: శ్రీ అమిత్ షా

Posted On: 15 MAY 2020 8:10PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ్య‌వ‌సాయం, దాని సంబంధిత రంగాల‌కు ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ మిష‌న్ కింద‌  ఒక ఆర్థిక ప్యాకేజ్‌ని 2020 మార్చి 15న ప్ర‌క‌టించారు.ఇందుకు  ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను అభినందిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం, భార‌త‌దేశ సంక్షేమం రైతుల సంక్షేమంలో ఉంద‌ని విశ్వ‌సిస్తోంది. ప్ర‌స్తుతం రైతుల‌కు మున్నెన్న‌డూ లేనంత స‌హాయం అంద‌డం గ‌మ‌నిస్తే, రైతుల‌కు సాధికార‌త క‌ల్పించ‌డం ద్వారా దేశాన్ని స్వావ‌లంబ‌న సాధించేట్టు చేయాల‌న్న  ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌కు ఇది అద్దం ప‌డుతోంద‌ని అన్నారు.
                    లాక్‌డౌన్‌ సమయంలో రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని ముఖ్యమైన చర్యల గురించి ప్ర‌స్తావిస్తూ  హోంమంత్రి, "మోడీ ప్రభుత్వం లాక్‌డౌన్ స‌మ‌యంలో  రైతులకు రూ. 74,300 కోట్ల విలువైన పంటను కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పి), కొనుగోలు చేయడం ద్వారా ఉపశమనం క‌లిగించింది. ; పిఎం కిసాన్ కింద రూ .18,700 కోట్లను రైతు ఖాతాలకు బదిలీ చేసింది; పంటల బీమా పథకం కింద రూ .6,400 కోట్లు ఇచ్చింది ” అని చెప్పారు
                     పశుసంవర్ధక రంగానికి సంబంధించిన ప్యాకేజీపై హోంమంత్రి మాట్లాడుతూ, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశంలో పాల వినియోగం 20 నుంచి 25 శాతం తగ్గిందని, అయితే శ్రీ న‌రేంద్ర‌ మోడీ ప్రభుత్వం రైతుల‌కు అండ‌గా నిలిచేందుకు రూ .4,100 కోట్ల విలువైన 111 కోట్ల లీటర్ల పాలను కొనుగోలు చేసిందని  ఆయ‌న చెప్పారు.”.  పశుసంవర్ధక రంగానికి చెందిన 2 కోట్ల మంది రైతులకు  ప్ర‌స్తుతం 5,000 కోట్ల రూపాయ‌ల మేర‌కు స‌హాయం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రికి శ్రీ అమిత్ షా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 లక్ష కోట్ల రూపాయ‌ల‌ 'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి గురించి హోంమంత్రి మాట్లాడుతూ, ప్రధాని శ్రీ న‌రేంద్ర‌ మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ .1 లక్ష కోట్ల 'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి' ఏర్పాటు నిర్ణయం, వ్యవసాయ రంగానికి, భారతదేశంలోని రైతుల సంక్షేమానికి  కొత్త దిశను ఇస్తుంద‌న్న‌ నాకు నమ్మకం ఉంది ”. అని అమిత్ షా పేర్కొన్నారు.
క్లస్టర్ ఆధారిత విధానాన్ని అవలంబించడం ద్వారా  మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కోసం 10,000 కోట్ల రూపాయలు అందించే నిర్ణయం మామిడి, కుంకుమ, మిరప ,వెదురు వంటి చిన్న సంస్థలతో సంబంధం ఉన్న ప్రజలకు అపూర్వమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇది వారి ఆదాయాన్ని పెంచడమే కాక, వారికి మంచి మార్కెట్‌ను కూడా అందిస్తుంద‌ని శ్రీ అమిత్‌ షా అన్నారు.
 
మత్స్య రంగానికి సంబంధించిన ప్యాకేజీపై ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్ర‌ హోంమంత్రి,శ్రీ అమిత్ షా, "ప్రధాన్ మంత్రి మత్స్య సంపాద యోజన (పిఎంఎంఎస్‌వై) కింద మత్స్య రంగానికి రూ .20 వేల కోట్లు అందించాలని శ్రీ  న‌రేంద్ర‌మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం , మౌలిక సదుపాయాలు,  ఆధునీకరణ, ఉత్పాదకత , ఉత్పత్తి నాణ్యత, అలాగే, ఈ రంగంలో కొత్త ఉద్యోగాలను సృష్టించ‌డానికి మ‌రింత ఊపుఇస్తుంద‌న్నారు.
 శ్రీ అమిత్‌షా మాట్లాడుతూ పశుసంవర్ధక రంగానికి 15 వేల కోట్ల రూపాయ‌ల‌ ‘పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి’, , ఔష‌ధ మొక్క‌ల సాగును  ప్రోత్సహించడానికి 4,000 కోట్ల రూపాయ‌లు,  తేనెటీగల‌ పెంపకం కోసం 500 కోట్ల రూపాయ‌లు  కేటాయించ‌డం ద్వారా ఈ రంగాల‌లో రాబ‌డి,  ఉపాధి పెరుగుదలతో పాటు ఈ రంగాల‌ అపూర్వ వృద్ధి , ప్ర‌గ‌తికి  దారితీస్తుంద‌ని ఆయ‌న అన్నారు.
వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో  సంస్కరణల‌కు సంబంధించి తీసుకున్న‌ చారిత్రాత్మక నిర్ణయంపై, హోం మంత్రి  అమిత్‌షా మాట్లాడుతూ, శ్రీ న‌రేంద్ర‌మోడీ ప్రభుత్వం ఒక సెంట్ర‌ల్‌ చట్టాన్ని తీసుకువస్తుందని, ఇది రైతులకు తమ ఉత్పత్తులను మంచి ధరకు విక్రయించడానికి తగిన ఆప్ష‌న్ల‌ను ఇస్తుంద‌ని చెప్పారు.. దీని తరువాత, వారు  ఎలాంటి అవ‌రోధాలు లేకుండా అంతర్-రాష్ట్ర వాణిజ్యం చేసుకోగ‌లుగుతార‌న్నారు. ఇ-ట్రేడింగ్ ద్వారా వారి ఉత్పత్తులు దేశంలోని మారుమూల ప్రాంతాల‌కు కూడా చేరే వీలుంటుంద‌ని ఆయ‌న అన్నారు.



(Release ID: 1624362) Visitor Counter : 176