ఆర్థిక మంత్రిత్వ శాఖ

వ‌ల‌స‌కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల‌తోపాటు పేద‌ల‌కు మ‌ద్ద‌తుగా ప‌లు స్వ‌ల్ప‌కాలిక , దీర్ఘ‌కాలిక చ‌ర్య‌ల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించారు.

- వ‌ల‌స‌కార్మికుల‌కు రెండు నెల‌ల‌పాటు ఆహార‌ధాన్యాలు
-వ‌ల‌స‌కార్మికులు వారు దేశంలోని ఏ చౌక‌ధ‌ర‌ల దుకాణం నుంచైనా ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌నుంచైనా స‌ర‌కులు తీసుకునే విధంగా 2021 మార్చినాటికి -ఒక దేశం-ఒక రేష‌న్ కార్డు విధానాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ వినియోగం
- వ‌ల‌స‌కార్మికుల‌కు ,పట్ట‌ణ పేద‌క‌లు అందుబాటు ధ‌ర‌లో ఇళ్ళ కాంప్లెక్స్‌లకు ప‌థ‌కం
-శిశు ముద్రా లోన్ల‌కు 12 నెల‌ల‌పాటు 2 శాతం వ‌డ్డీ స‌బ్‌వెర్ష‌న్‌- 1500 కోట్ల రూపాయ‌ల మేర‌కు స‌హాయం
-వీధివ్యాపారుల‌కు 5000 కోట్ల రూపాయ‌ల రుణ‌స‌దుపాయం
-పిఎమ్‌ఎవై (అర్బన్) కింద ఎంఐజి కోసం, రుణ ఆధారిత స‌బ్సిడీ పథకాన్ని పొడిగించడం ద్వారా హౌసింగ్ రంగానికి, మధ్య ఆదాయ వర్గాలకు రూ .70,000 కోట్లు ఊతం
-గృహ‌రంగం, మ‌ధ్యాదాయ వ‌ర్గాల‌కు రుణ అనుసంధాన స‌బ్సిడీ ప‌థ‌కం
-సిఎఎంపిఎ నిధుల‌ను ఉప‌యోగించి ఉపాధి క‌ల్ప‌న‌కు రూ 6000 కోట్లు
-నాబార్డ్ ద్వారా రైతుల‌కు అద‌న‌పు అత్య‌వ‌స‌ర వ‌ర్కింగ్ కేపిట‌ల్ కింద రూ 30,000 లు
-కిసాన్ క్రెడిట్ కార్డ్ ప‌థ‌కం కింద 2.5 కోట్ల మంది రైతుల‌కు 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రాయితీ రుణ ఊతం

Posted On: 14 MAY 2020 6:59PM by PIB Hyderabad

గౌర‌వ‌నీయ ప్ర‌ధాన‌మంత్రి 2020 మే 12న 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువ గ‌ల అంటే భార‌త దేశ జిడిపిలో ప‌దిశాతంతో స‌మాన‌మైన ప్ర‌త్యేక , ఆర్థిక స‌మ‌గ్ర ప్యాకేజ్‌ని ప్ర‌క‌టించారు. స్వావ‌లంబిత భార‌త్ ఉద్య‌మానికి అంటే ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ అభియాన్‌కు ప్ర‌ధాన‌మంత్రి శంఖం పూరించారు. ఇందుకు ప్ర‌ధాన‌మంత్రి ఐదు ప్ర‌ధాన స్తంభాల గురించి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. అవి, ఆర్థికం, మౌలిక‌స‌దుపాయాలు, వ్య‌వ‌స్థ‌, ఉత్సాహ‌పూరితులైన జ‌నం, డిమాండ్‌.
వలస కార్మికులు, వీధి వ్యాపారులు,  పట్టణ పేద వలసదారులు, చిన్న వ్యాపారులు ,స్వయం ఉపాధి క‌లిగిన ప్ర‌జ‌లు, చిన్న రైతులు , గృహనిర్మాణరంగంలోని వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను తొల‌గించ‌డానికి రెండ‌వ విడ‌త చ‌ర్య‌ల‌ను , కేంద్ర ఆర్థిక,
కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి శ్రీమతి. నిర్మలా సీతారామన్ ఈ రోజు విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు.
 వలసదారులు, రైతులు, చిన్న వ్యాపారాలు మరియు వీధి వ్యాపారులతో సహా పేదలకు మద్దతు ఇవ్వడానికి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలను వివరించారు. పేద‌ల‌తోపాటు వ‌ల‌స‌దారులు, రైతులు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల‌కు మ‌ద్ద‌తు నిచ్చేందుకు స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక చ‌ర్య‌ల‌ను ఆమె ప్ర‌కటించారు.

పేద‌లు , వ‌ల‌స‌కార్మికులు, రైతులు ఎదుర్కొనే క‌ష్టాల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ ఎప్పుడూ ఆందోళ‌న చెందుతుంటార‌ని , శ్రీ‌మ‌తి నిర్మలాసీతారామ‌న్ అన్నారు. రైతులు, కార్మికులు ఈ దేశానికి వెన్నెముక అని,  వారు తమ చెమటతో, శ్రమతో మనందరికీ సేవలు అందిస్తార‌న్నారు. వలస కార్మికులకు సామాజిక భద్రతతో పాటు పట్టణ ప్రాంతాల్లో సరసమైన , సౌకర్యవంతమైన అద్దె గృహాలు అవసరమ‌న్నారు. వలస, అసంఘటిత కార్మికులతో సహా పేదలకు ఉపాధి అవకాశాలు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రైతుల‌కు స‌కాలంలో త‌గినంత రుణ మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని ఆమె చెప్పారు.

  స‌మాజం, ఆర్థిక వ్య‌వ‌స్జ‌లోని అన్ని వ‌ర్గాల వారి అవ‌స‌రాల ప‌ట్ల ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. చిన్న వ్యాపారాలు ప్ర‌త్యేకించి వీది వ్యాపారులకు శిశు ముద్రా రుణాల ద్వారా గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవ‌నోపాథి క‌ల్పించేందుకు మ‌ద్ద‌తునివ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. వారికి వ్యాపార మార్గం చూప‌డం  ద్వారా మన ప్రోత్సాహం అవసరమ‌ని అలాగే సామాజిక భద్రత , మెరుగైన రుణ‌స‌దుపాయం క‌ల్పించ‌డంలో  శ్రద్ధ వహించాలన్నారు.
వలస కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారుల , వీధి వ్యాపారుల‌తో సహా పేదలకు మద్దతు ఇవ్వడానికి స్వల్పకాలిక , దీర్ఘకాలిక చర్యలను ఈ రోజు ప్రకటించారు: -
1.  వ‌ల‌స‌కార్మికుల‌కు  రెండు నెల‌ల‌పాటు ఉచిత ఆహార‌ధాన్యాలు
వ‌ల‌స కార్మికుల‌కు సంబంధించి ప్ర‌తి వ‌ల‌స కార్మికుడికి  అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల‌లో 5 కేజీల వంతున అద‌న‌పు ఆహార‌ధాన్యాలు , ఒక్కోకుంటుంబానికి నెల‌కు ఒక కేజీ ప‌ప్పులు 2020 మే ,జూన్ రెండు నెల‌ల‌కు ఉచితంగా కేటాయించ‌డం జ‌రుగుతుంది.
జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం కింద పేర్లు న‌మోదు కాని వ‌ల‌స‌కార్మికులు లేదా ప్ర‌స్తుతం వారు చిక్కుకుపోయిన  ఆయా రాష్ట్రాలు,లేదా కేంద్ర పాలిత ప్రాంతాల‌లో రేష‌న్ కార్డు లేని వారు దీనికి అర్హులు. ఈ ప‌థ‌కంలో పేర్కొన్న‌ట్టుగా ల‌క్షిత ల‌బ్దిదారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరేందుకు త‌గిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను కోర‌డం జ‌రుగుతోంది. 8 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుఅ ఆహార‌ధాన్యాలు, 50,000 మెట్రిక్ ట‌న్నుల‌ చానా ను కేటాయించ‌డం జ‌రుగుతుంది. ఇందుకు అయ్యే మొత్తం 3,500 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.
2. వ‌ల‌స‌కార్మికులు దేశంలోని ఏ  చౌక‌ధ‌ర‌ల దుకాణం ద్వారా అయినా ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌ (రేష‌న్‌) మార్చి 2021 నాటికి  అందుకునేలా చేసేందుకు అవ‌స‌రమైన సాంకేతిక వ్య‌వ‌స్థ‌-ఒక దేశం, ఒక కార్డు ను ఉప‌యోగిస్తారు. రేష‌న్ కార్డు పోర్ట‌బిలిటీ పైల‌ట్ ప‌థ‌కాన్ని 23 రాష్ట్రాల‌కు విస్త‌రింప‌చేస్తారు. దీనితో  ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ కిందికి వ‌చ్చే జ‌నాభాలో 83 శాతం, అంటే 67కోట్ల మంది ల‌బ్ధిదారులు 2020 ఆగ‌స్టు నాటికి నేష‌న‌ల్ పోర్ట‌బిలిటీ ఆప్ రేష‌న్ కార్డుల కిందికి వ‌స్తారు. నూరుశాతం నేష‌న‌ల్ పోర్ట‌బిలిటీ ని 2021 మార్చి నాటికి సాధిస్తారు. ఇది ప్ర‌ధాన‌మంత్రి సాంకేతిక ప‌రిజ్ఞాన ఆధారిత వ్య‌వ‌స్థాగ‌త సంస్క‌ర‌ణ‌ల‌లో భాగం. ఈ ప‌థ‌కం కింద వ‌ల‌స కార్మికులు, వారి కుటుంబ స‌భ్యులు ప్ర‌జా పంపిణీ కింద ప్ర‌యోజ‌నాల‌ను దేశంలోని ఏ చౌక‌ధ‌ర‌ల దుకాణం  నుంచైనా పొంద‌వ‌చ్చు. దీనివ‌ల్ల మార్గ‌మ‌ధ్యంలో ఉన్న వ‌లస కార్మికులు కూడా దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డినుంచైనా ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.
3. వ‌ల‌స‌కార్మికులు, ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం ప్రారంభం కానున్న చౌక అద్దె గృహాల కాంప్లెక్స్ లు
వలస కార్మికులు , పట్టణ పేదలకు సరసమైన అద్దెతో సుల‌భ‌త‌ర జీవ‌నానికి ఒక  పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. వలస కార్మికులు, పట్టణ పేదలు విద్యార్థులకు సామాజిక భద్రత , నాణ్యమైన జీవ‌నాన్ని చౌక‌ అద్దె హౌసింగ్ కాంప్లెక్స్  అందిస్తుంది.
నగరాల్లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన‌ ఇళ్లను పిపిపి మోడ్ కింద రాయితీ ద్వారా సరసమైన అద్దె హౌసింగ్ కాంప్లెక్స్‌లుగా (ఎఆర్‌హెచ్‌సి) మార్చడం ద్వారా దీనిని అమ‌లు చేస్తారు; తయారీ యూనిట్లు, పరిశ్రమలు, సంస్థలు, అసోసియేషన్లు తమ ప్రైవేట్ భూమిలో చౌక‌ అద్దె హౌసింగ్ కాంప్లెక్స్‌లను (ARHC) అభివృద్ధి చేయడానికి , నిర్వ‌హించ‌డానికి;  రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు , కేంద్ర ప్రభుత్వ సంస్థలను చౌక‌ అద్దె హౌసింగ్ కాంప్లెక్స్‌లను (ARHC) అభివృద్ధి చేయడానికి, నిర్వ‌హించ‌డానికి  ప్రోత్సహించడం  జ‌రుగుతుంది.  ఈ ప‌థ‌కానికి సంబంధించి  స్ప‌ష్ట‌మైన  వివరాలను మంత్రిత్వ శాఖ , డిపార్ట‌మెంట్  విడుదల చేస్తుంది.

4. శిశు మ‌ద్ర లోన్లు అందుకున్న వారికి 12 నెల‌ల పాటు 2 శాతం వ‌డ్డీ స‌బ్ వెర్ష‌న్‌కు అవ‌కాశం- 1500 కోట్ల రూపాయ‌ల స‌హాయం
50,000 రూపాయల లోపు రుణాలు ఉన్న ముద్రా శిశు రుణగ్రహీతలకు 12 నెలల కాలానికి స‌కాలంలో చెల్లింపుదారులకు 2% వడ్డీ ఉపసంహరణను భారత ప్రభుత్వం అందిస్తుంది. ముద్రా శిశు రుణాల ప్రస్తుత పోర్ట్‌ఫోలియో సుమారు 1.62 లక్షల కోట్ల రూపాయలు. ఇది శిశు ముద్రా రుణగ్రహీతల‌కు సుమారు 1,500 కోట్ల రూపాయల మేర‌కు ఉపశమనం కల్పిస్తుంది.
 5. వీధి వ్యాపారుల కోసం రూ 5,000 కోట్ల రూపాయ‌ల రుణ‌స‌దుపాయం
వీధి  వ్యాపారుల‌కు క్రెడిట్ సులభంగా పొందటానికి వీలుగా ఒక నెలలోనే ఒక ప్రత్యేక పథకం ప్రారంభించబడుతుంది, ప్రస్తుత పరిస్థితులలో దెబ్బ‌తిన్న వీరి  వ్యాపారాలను పునః ప్రారంభించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ పథకం కింద, ప్రారంభ వర్కింగ్ క్యాపిటల్‌కు బ్యాంక్ క్రెడిట్ సౌకర్యం  ప్రతి సంస్థకు 10,000 రూపాయల వ‌ర‌కు అందించ‌డం జ‌రుగుతుంది.
 ఈ పథకం పట్టణ , గ్రామీణ వ్యాపారుల‌కు,, పొరుగున ఉన్న ప‌ట్ట‌ణ‌ప్రాంతాల‌లో వ్యాపారంచేసే వారికి వ‌ర్తిస్తుంది.  డిజిటల్ చెల్లింపులు , సకాలంలో తిరిగి చెల్లించడం వంటి వాటిని మానిట‌రీ రివార్డుల ద్వారా ప్రోత్సహించడం జ‌రుగుతుంది. ఈ పథకం కింద 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది. వీరికి  రూ. 5,000 కోట్లు వీరికి అందుబాటులోకి వ‌స్తుంది.
6. పిఎమ్‌ఎవై (అర్బన్) కింద ఎంఐజి కోసం క్రెడిట్ అనుసంధానిత‌ సబ్సిడీ పథకాన్ని పొడిగించడం ద్వారా హౌసింగ్ రంగానికి, మధ్య ఆదాయ వర్గాలకు రూ .70,000 కోట్లు అందుబాటులోకి వ‌స్తాయి.
మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ కోసం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (వార్షిక ఆదాయం రూ .6 నుంచి 18 లక్షల మధ్య) మార్చి 2021 వరకు అందించడం జ‌రుగుతుంది. ఇది 2020-21 మధ్య కాలంలో 2.5 లక్షల మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది   గృహనిర్మాణ రంగంలో రూ .70,000 కోట్లకు పైగా పెట్టుబడికి వీలు క‌ల్పిస్తుంది.
7. సిఎఎంపిఎ నిధులను ఉపయోగించి ఉపాధి క‌ల్ప‌న‌కు రూ .6,000 కోట్లు
పట్టణ ప్రాంతాలు, ఆర్టిఫిషియ‌ల్ రీజ‌న‌రేష‌న్‌, అసిస్టెడ్ నేచుర‌ల్ రీజ‌న‌రేష‌న్‌, అటవీ నిర్వహణ, నేల , తేమ పరిరక్షణ పనులు, అటవీ సంరక్షణ, అటవీ న్యప్రాణుల సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధి, వన్యప్రాణుల రక్షణ  నిర్వహణ మొదలైన ప‌నుల‌కు సుమారు  6000 కోట్ల రూపాయల మేర‌కు కాంపెన్సేట‌రీ అఫార‌స్ట్రేష‌న్ మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్ అధారిటీ (సిఎఎంపిఎ)నిధుల‌ను వినియోగిస్తారు. ఈ ప్రణాళికలకు భారత ప్రభుత్వం తక్షణ అనుమతి ఇస్తుంది. ఇది పట్టణ, సెమీ అర్బన్ , గ్రామీణ ప్రాంతాల్లో  గిరిజనులకు (ఆదివాసుల‌కు) ఉద్యోగావకాశాలను క‌ల్పిస్తుంది.

 


8. నాబార్డ్ ద్వారా రైతుల‌కు అద‌న‌పు ఎమ‌ర్జెన్సీ వ‌ర్కింగ్ కేపిట‌ల్ స‌మ‌కూర్చేందుకు రూ 30,000 కోట్లు
గ్రామీణ సహకార బ్యాంకులు , ఆర్‌ఆర్‌బిల పంట రుణ అవసరాలను తీర్చడానికి నాబార్డ్ రూ .30,000 కోట్ల అదనపు రీ ఫైనాన్స్ మద్దతును అందిస్తుంది. ఈ రీఫైనాన్స్ ఫ్రంట్-లోడ్ ,  ఆన్ ట్యాప్‌లో లభిస్తుంది. ఇది సాధారణంగా ఈ రంగానికి నాబార్డ్ అందించే రూ .90,000 కోట్లకు అద‌నం. ఇది సుమారు 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది, ఎక్కువగా చిన్న, స‌న్న‌కారు రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంది, ఇది వారి ర‌బీ పంటకోత అవ‌స‌రాలు ,ప్రస్తుత ఖరీఫ్ అవసరాలను తీర్చగలదు.

9. కిసాన్ క్రెడిట్ కార్డ్ ప‌థ‌కం కింద 2.5 కోట్ల మందిరైతుల‌కు 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రుణ స‌దుపాయం
కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పిఎం- కిసాన్‌ లబ్ధిదారులకు రాయితీ పై రుణం అందించడానికి ప్రత్యేక చ‌ర్య‌లు తీసుకుంటారు. మత్స్యకారులు , పశుసంవర్ధక రైతులను కూడా ఈ ప్ర‌యోజ‌నాలు అందించ‌నున్నారు. . ఇది వ్యవసాయ రంగంలో రూ .2 లక్షల కోట్ల అదనపు లిక్విడిటీకి అవ‌కాశం క‌ల్పిస్తుంది. 2.5 కోట్ల మంది రైతులకు ఇది వ‌ర్తిస్తుంది.



 

****


(Release ID: 1623914) Visitor Counter : 537