ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 పై పోరాటాని కి 3,100 కోట్ల రూపాయల ను కేటాయించిన పిఎమ్ కేర్స్ ఫండ్ ట్రస్ట్
Posted On:
13 MAY 2020 8:23PM by PIB Hyderabad
కోవిడ్-19 పై పోరాటాని కి 3,100 కోట్ల రూపాయల ను కేటాయించాలని పిఎం కేర్స్ (ప్రైం మినిస్టర్ స్ సిటిజన్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఇమర్ జన్సి సిట్యుయేశన్స్) ఫండ్ ట్రస్ట్ ఈ రోజు న నిర్ణయించింది. ఆ 3,100 కోట్ల రూపాయల లో, సుమారు 2,000 కోట్ల రూపాయల మొత్తాన్ని వెంటిలేటర్ ల కొనుగోలు కు ప్రత్యేకించనున్నారు; 1,000 కోట్ల రూపాయల ను వలస కార్మికుల సంరక్షణ కు మరియు 100 కోట్ల రూపాయల ను టీకామందు అభివృద్ధి కార్యకలాపాల కు సాయపడటానికి ఇవ్వడం జరుగుతుంది.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి (అధికార రీత్యా) నాయకత్వం లో ఈ ట్రస్టు ను 2020వ సంవత్సరం మార్చి నెల 27వ తేదీ నాడు ఏర్పాటు చేయడమైంది. దీని లో రక్షణ మంత్రి, దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రులు అధికార రీత్యా ఇతర సభ్యులు గా వ్యవహరిస్తారు. ప్రధాన మంత్రి ఈ ప్యాకేజి ని ప్రకటిస్తూ, కోవిడ్-19 తో భారతదేశం సాగిస్తున్న పోరాటాని కి సాయపడేటటువంటి పిఎమ్ కేర్స్ ఫండ్ కు ఉదారం గా చందాల ను అందిస్తున్నందుకు గాను దాతలందరి కి ధన్యవాదాలు పలికారు.
అ) 50,000 వెంటిలేటర్ లు
దేశవ్యాప్తం గా కోవిడ్-19 కేసుల ను దీటు గా ఎదుర్కోవడం కోసం ఉద్దేశించిన మౌలిక సదుపాయాల కల్పన ను వృద్ధి చేయటం కోసం, 50,000 ‘మేడ్- ఇన్- ఇండియా’ వాయు ప్రసరణ వ్యవస్థల ను పిఎమ్ కేర్స్ ఫండ్ నుండి దాదాపు 2,000 కోట్ల రూపాయల ను వెచ్చించడం ద్వారా కొనుగోలు చేయనున్నారు. ఈ వెంటిలేటర్ లను సంక్లిష్ట దశ కు చేరుకొన్న కోవిడ్-19 బాధితుల కు మెరుగైన చికిత్స ను అందించడం కోసం అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల లోని ప్రభుత్వ ఆసుపత్రుల కు ఇవ్వడం జరుగుతుంది.
ఆ) వలస కార్మికుల కోసం సహాయక చర్యలు
వలస కార్మికుల కోసం మరియు పేదల కోసం ఇప్పటికే అమలుపరుస్తున్నటువంటి సంక్షేమ చర్యల ను మరింత పటిష్ఠం చేయడం కోసం రాష్ట్రాల కు/ కేంద్రపాలిత ప్రాంతాల కు పిఎమ్ కేర్స్ ఫండ్ నుండి ఏక మొత్తం సహాయం గా 1,000 కోట్ల రూపాయల ను అందిస్తారు. ఈ మొత్తాన్ని వలస కార్మికుల కు బస, ఆహారం సరఫరా, వైద్య చికిత్స మరియు రవాణా ఏర్పాట్ల నిమిత్తం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రయత్నాల ను మరింత గా బల పరచడానికి గాను జిల్లా కలెక్టర్ లు/ మ్యూనిసిపల్ కమిశనర్ ల కు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల కు/ కేంద్రపాలిత ప్రాంతాల కు ఇవ్వనున్నారు. ఈ ధన రాశి ని.. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీ గా
(క) 2011 జనాభా లెక్క ల ఆధారం గా రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం జన సంఖ్య- 50 శాతం వెయిటేజి, (ఖ) కోవిడ్-19 పాజిటివ్ కేసుల లో ఇంతవరకు నమోదు అయిన సంఖ్య- 40 శాతం వెయిటేజి మరియు (గ) అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల కు సమాన భాగం (10 శాతం వెయిటేజి) ల ఆధారం గా.. విడుదల చేయడం జరుగుతుంది. తద్ద్వారా అన్ని రాష్ట్రాల కోసం మౌలికం గా కనీస ధన రాశి ని సమకూర్చేందుకు వీలు ఏర్పడుతుంది. ఈ డబ్బుల ను జిల్లా కలెక్టర్/ జిల్లా మెజిస్ట్రేట్/ మ్యూనిసిపల్ కమిశనర్ లకు సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ కమిశనర్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.
ఇ) టీకామందు అభివృద్ధి
కోవిడ్-19 ని ఎదిరించి పోరాడటాని కి మిగతా అన్నిటి కంటే టీకామందు యొక్క అవసరం ఎంతయినా ఉంది. మరి అటువంటి అత్యాధునికమైన వ్యాక్సిన్ ను అభివృద్ధిపరచే పని లో భారతదేశంలోని విద్యాసంస్థ లు, స్టార్ట్- అప్ లు మరియు పరిశ్రమ కలిసికట్టుగా తలమునకలు అయ్యాయి. కోవిడ్-19 టీకామందు యొక్క రూప రచన లో, కోవిడ్-19 టీకామందు యొక్క అభివృద్ధి లో కృషి చేస్తున్న వారి కి సాయపడటానికి గాను 100 కోట్ల రూపాయల మొత్తాన్ని పిఎమ్ కేర్స్ ఫండ్ నుండి ఇవ్వడం జరుగుతుంది. తద్ద్వారా టీకా మందు అభివృద్ధి ప్రక్రియ కు ఉత్ప్రేరకం రూపం లో దోహద పడినట్లు కాగలదు. ఈ నిధుల ను ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ పర్యవేక్షణ లో ఉపయోగిస్తారు.
**
(Release ID: 1623742)
Visitor Counter : 410
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada