వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంపై స్పష్టత..

Posted On: 11 MAY 2020 6:43PM by PIB Hyderabad

ఆధార్ నంబ‌రుతో అనుసంధానం చేయ‌ని రేష‌న్ కార్డులు రద్దు చేయబడ‌నున్నాయంటూ ఈ రోజు  కొన్ని వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ వెల్ల‌డించిన ఆధార్ నోటిఫికేషన్ 07.02.2017 ప్రకారం (ఎప్పటికప్పుడు సవరించినట్లు) దేశంలోని అన్ని రాష్ట్రాలు / ‌కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వారు త‌మ రేషన్ కార్డులు / లబ్ధిదారులతో ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాల‌ని పేర్కొంది. ఇందుకు గ‌డువును ఎప్ప‌టిక‌ప్పుడు స‌వ‌రిస్తూ తాజాగా సెప్టెంబ‌రు 30వ తేదీ వరకు డిపార్ట్మెంట్ దీనిని పొడిగించింది.



ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లు..
24.10.2017 మరియు 08.11.2018 తేదీన అన్ని రాష్ట్రాలు / యుటీలకు డిపార్ట్మెంట్ పంపిన లేఖ‌ల‌లో ప్ర‌భుత్వం దీనికి సంబంధించి మ‌రింత స్పష్టమైన సూచనలు జారీ చేసింది. ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయ‌లేద‌న్న ప్ర‌తిప‌దిక‌న‌ అప్ప‌టి వ‌ర‌కు రేష‌న్ కార్డు దారులుగా ఉన్న నిజమైన లబ్ధిదారులు / గృహస్థుల‌కు ఇచ్చే ఆహార ధాన్యాల కోటాను నిరాకరించ కూడ‌ద‌ని తెలిపింది. వారి పేర్ల‌ను / రేషన్ కార్డులు తొలగించకూడ‌దు/ రద్దు చేయకూడ‌ద‌ని కూడా సూచ‌న‌లు చేసింది. అంతేకాకుండా లబ్ధిదారుడి బయోమెట్రిక్ / ఆధార్ ప్రామాణీకరణ యొక్క వైఫల్యం, లబ్ధిదారుడి యొక్క బయోమెట్రిక్స్ సరిగా లేకపోవడం నెట్‌వర్క్ / నెట్ కనెక్టివిటీ / లింకింగ్ లేదా మ‌రే ఇతర సాంకేతిక కారణాల వల్ల ఎన్‌ఎఫ్‌ఎస్ఏ కింద కార్డు దారుల‌కు ఆహార ధాన్యాలు జారీ చేయ‌డాన్ని తిరస్కరించబడవ‌ద్ద‌ని కూడా త‌గిన సూచనలు జారీ చేయబడ్డాయి. ప్రస్తుత సంక్షోభపు పరిస్థితులలో ఏ ఒక్క పేద లేదా అర్హులైన వ్యక్తి లేదా కుటుంబానికి ఆహార ధాన్యాలు ల‌భించ‌క‌ ఇబ్బందులు ప‌డ‌డాన్ని నివారించేలా జాగ్ర‌త్త ప‌డేందుకు ఆచరణాత్మక విధానం అవసర‌మ‌ని పేర్కోంది.
90 శాతం కార్డుల అనుసంధానం పూర్తి..
నిర్ణీత సమయంలో ఆధార్‌ను రేషన్ కార్డుతో అనుసంధానించడం మరియు రేషన్‌కు అర్హత ఉన్న ఏ వ్యక్తికి యాక్సెస్ నిరాకరించబడకుండా చ‌ర్య‌లు చేప‌డుతారు. కేంద్ర మరియు రాష్ట్ర / ‌కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల నిరంతర కృషితో ప్రస్తుతం మొత్తం 23.5 కోట్లలో 90 శాతం రేషన్ కార్డులు ఇప్పటికే కార్డు హోల్డర్ల ఆధార్ సంఖ్యలతో అనుసంధానం చేయబడ్డాయి (అనగా కుటుంబంలో కనీసం ఒక సభ్యుడు); అయితే, మొత్తం 80 కోట్ల మంది లబ్ధిదారులలో దాదాపు 85 శాతం మంది తమ ఆధార్ నంబర్‌ను తమ రేషన్ కార్డులతో సీడ్ చేశారు. దీనికి తోడు అన్ని సంబంధిత రాష్ట్రాలు / యుటీలు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏలో భాగంగా మిగిలిన రేషన్ కార్డులు / లబ్ధిదారుల ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాయి.
వ‌న్ నేష‌న్.. వ‌న్ రేష‌న్ ప్ర‌ణాళిక‌లో భాగంగా..
పేదలు మరియు వలస లబ్ధిదారుల ప్ర‌యోజ‌నాలను కాపాడేందుకు వీలుగా కేంద్ర ప్ర‌భుత్వం ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో భాగంగా వ‌న్ నేష‌న్.. వ‌న్ రేష‌న్ కార్డ్ ప్ర‌ణాళిక‌లో భాగంగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ రేషన్ కార్డుదారులకు జాతీయ / ఇంటర్-స్టేట్ పోర్టబిలిటీ రేష‌న్ విధానం అమలును ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అవాంత‌రం లేని ఇంటర్-స్టేట్ పోర్టబిలిటీ రేష‌న్ లావాదేవీలను సాధించడానికి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఉన్న అన్ని రాష్ట్రాలు / యుటీల యొక్క ప్రత్యేకమైన రేషన్ కార్డులు / లబ్ధిదారుల డేటాను నిర్వహించడానికి కేంద్రీకృత రిపోజిటరీని కలిగి ఉండటం చాలా అవసరం. అందువల్ల దేశంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ప్రతి అర్హత గల రేషన్ కార్డు హోల్డర్ / లబ్ధిదారుడి యొక్క ప్రత్యేకమైన రికార్డును ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించ‌డం కీల‌కం కానుంది. తద్వారా అతని లేదా ఆమె రేష‌న్ పొందే అర్హత ప‌రిరక్షించబడుతుంది.

 



(Release ID: 1623150) Visitor Counter : 181