సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        గాంధీ శాంతి పురస్కారం-2020 నామినేషన్ల తుది గడువు పెంపు
                    
                    
                        జూన్ 15, 2020 వరకు అవకాశమిచ్చిన కేంద్ర ప్రభుత్వం
                    
                
                
                    Posted On:
                11 MAY 2020 6:23PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                గాంధీ శాంతి పురస్కారాన్ని అందించేందుకు కేంద్ర సాంస్క్రతిక మంత్రిత్వ శాఖ ఏటా నామినేషన్లు ఆహ్వానిస్తోంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.indiaculture.nic.in లో పేర్కొన్న విధాన నియమావళి నిబంధనలను అనుసరించి నామినేషన్లు ఉండాలి. గాంధీ శాంతి పురస్కారం-2020 నామినేషన్ల తుది గడువు ఈ ఏడాది ఏప్రిల్ 30తో ముగిసింది. కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ గడువును కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 15.06.2020 వరకు పెంచింది. నిర్ణీత నమూనాలో నామినేషన్లు లేదా సిఫారసులను మెయిల్, ఈమెయిల్ చేయవచ్చు. చిరునామా:
నిరుపమ కొట్రు, సంయుక్త కార్యదర్శి
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
రూమ్ నం. 334-సి, శాస్త్రి భవన్
న్యూదిల్లీ
టెలీఫ్యాక్స్ నం. 011-23381198
ఈమెయిల్: jsmuseakad-culture[at]gov[dot]in
mdehuri.rgi[at]nic[dot]in
                
                
                
                
                
                (Release ID: 1623098)
                Visitor Counter : 333