ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం నాడు శాస్త్రవేత్తల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
11 MAY 2020 4:17PM by PIB Hyderabad
ఇతరుల జీవితాల లో ఒక వాస్తవికమైనటువంటి విభిన్నత ను తీసుకొనిరావడం కోసం విజ్ఞానశాస్త్రాన్ని మరియు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న దేశ శాస్త్రవేత్తలు అందరిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.
శ్రీ మోదీ జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం సందర్భం లో తన సందేశాన్ని ట్విటర్ లో ఈ క్రింది విధం గా పొందుపరచారు.
‘‘ఇతరుల జీవితాల లో ఒక వాస్తవికమైన విభిన్నత ను తీసుకురావడం కోసం విజ్ఞానశాస్త్రం తాలూకు ఫలితాల తో పాటు సాంకేతిక విజ్ఞానం తాలూకు ఫలితాల ప్రభావ సామర్థ్యాన్ని వినియోగం లోకి తెస్తున్నటువంటి వారందరి కి జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం సందర్భం నాడు మన దేశ ప్రజలు ప్రణామాన్ని ఆచరిస్తున్నారు. 1998వ సంవత్సరం లో ఇదే రోజు న మన శాస్త్రజ్ఞులు సాధించిన అసామాన్యమైన ప్రగతి ని మనం స్మరించుకొందాము. అది భారతదేశ చరిత్ర లో ఓ మహత్వపూర్ణమైన ఘటన’’ అని ఆయన అన్నారు.
పోఖ్ రణ్ పరీక్షలు 1998వ సంవత్సరం మే నెల 11వ తేదీ న జరిగిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అప్పట్లో పరమాణు సంబంధిత పరీక్షలు కేవలం ఒక బలమైన రాజకీయ నాయకత్వం కారణం గానే సంభవమయ్యాయి.
ప్రధాన మంత్రి తన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) ధారావాహిక కార్యక్రమం లోని ఒక భాగం లో ఈ పరీక్షల కు సంబంధించి ఆడిన మాటల ను కూడా తన సందేశం లో జత పరచారు.
‘‘పోఖ్ రణ్ లో 1998వ సంవత్సరం లో జరిగిన పరీక్షలు ఒక బలమైన రాజకీయ నాయకత్వం ఎటువంటి విభిన్నత్వాన్ని సాధ్యపడేటట్టు చేయగలుగుతుందనే విషయాన్ని సైతం చాటి చెప్పాయి. పోఖ్ రణ్ ను గురించి, భారతదేశ శాస్త్రవేత్తల ను గురించి మరియు అటల్ గారి అసాధారణమైనటువంటి నేతృత్వాన్ని గురించి #MannKiBaat ధారావాహిక కార్యక్రమం లో భాగం అయిన ఒక కార్యక్రమం లో నేను ప్రస్తావించాను. ఆ వేళ నేను ఏమన్నానో ఇదుగో ఇక్కడ గమనించండి’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఈ రోజు న, ప్రపంచాన్ని కోవిడ్-19 బారి నుండి విముక్తం చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నాల లో సాంకేతిక విజ్ఞానం ఎందరికో సాయపడుతోంది. కరోనావైరస్ ను ఓడించే పద్ధతుల ను కనుగొనడం కోసం సాగుతున్నటువంటి పరిశోధన లో మరియు నూతన ఆవిష్కరణ లో మునుముందు న నిలచి పరిశ్రమిస్తున్న వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఆరోగ్యప్రదమైనటువంటి మరియు ఉత్తమమైనటువంటి ఒక భూగ్రహాన్ని సృజించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకొంటూ ముందంజ వేయగలమా’’ అని కూడా శ్రీ మోదీ ట్విటర్ లో తన మనోభావాల ను అక్షరబద్ధం చేశారు.
(Release ID: 1623076)
Visitor Counter : 327
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam