నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఇందూ శేఖర్ చతుర్వేది
प्रविष्टि तिथि:
11 MAY 2020 3:24PM by PIB Hyderabad
నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కొత్త కార్యదర్శిగా శ్రీ ఇందూ శేఖర్ చతుర్వేది (ఐఏఎస్) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. శ్రీ చతుర్వేది 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. శ్రీ ఆనంద్ కుమార్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన స్థానంలో ఇప్పుడు శ్రీ ఇందూ శేఖర్ చతుర్వేది నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కొత్త కార్యదర్శిగా
బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీ చతుర్వేది మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను కలుసుకున్నారు. మంత్రిత్వ శాఖ ముందు ఉన్న పని మరియు వివిధ సమస్యలను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నియామకానికి ముందు శ్రీ చతుర్వేది జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ వాతావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, అదనపు కార్యదర్శి (వాతావరణ మార్పు విభాగం) గా విధులు నిర్వర్తించారు. శ్రీ చతుర్వేది ఐఐటీ- కాన్పూర్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బీటెక్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో (అమెరికా) అంతర్జాతీయ అభివృద్ధి అంశంపై పీజీ విద్యను అభ్యసించారు. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వంలో క్షేత్ర, విధాన స్థాయిలలోని వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. దీనికి తోడు ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖల్లోనూ జాయింట్ సెక్రటరీ లేదా సమానమైన హోదాలో శ్రీ చతుర్వేది సేవలందించారు. ప్రణాళిక సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యక్తిగత వ్యవహారాలు ప్రజా ఫిర్యాదు మరియు పింఛన్లు వంటి వివిధ మంత్రిత్వ శాఖల్లో కూడా పనిచేసిన విస్తృత అనుభవం శ్రీ చతుర్వేది సొంతం. శ్రీ చతుర్వేది ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, కమ్యూనిటీ మొబిలైజేషన్ మరియు పార్టిసిపేటరీ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌లో కూడా శిక్షణ పొందారు.
(रिलीज़ आईडी: 1622967)
आगंतुक पटल : 277