చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, కేంద్ర ప్రభుత్వ ఇతర న్యాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన న్యాయ శాఖ మంత్రి

న్యాయవ్యవస్థలో డిజిటల్ విధానాలకు మరింత ఊతం ఇవ్వడానికి లాక్ డౌన్ ఒక అవకాశంగా తీసుకోవాలి : శ్రీ రవిశంకర్ ప్రసాద్

Posted On: 10 MAY 2020 4:51PM by PIB Hyderabad

 

కేంద్ర న్యాయన్యాయ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు అటార్నీ జనరల్ నేతృత్వంలోని న్యాయ అధికారుల బృందంతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించారు. ఈ సమావేశంలో భారత అటార్నీ జనరల్శ్రీ కె.కె.వేణుగోపాల్సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతాఅదనపు సొలిసిటర్ జనరళ్లుఅసిస్టెంట్ సొలిసిటర్ జనరళ్లున్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శిఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి విధించిన లాక్ డౌన్ సమయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఇది మొదటిది. 

న్యాయ మంత్రి తన ప్రారంభ ఉపన్యాసంలోసవాళ్లు ఎదుర్కొంటున్న సమయమిదనిప్రధాని శ్రీ నరేంద్ర మోడీ దేశాన్ని టీం ఇండియాగా నడిపిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో తగిన ప్రతిస్పందన కోసం తరచూ సంప్రదింపులు జరుపుతోంది. లాక్ డౌన్ అవసరందాని నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లను పరిష్కరించడం గురించి ప్రధానమంత్రి స్వయంగా ఉమ్మడి అభిప్రాయానికి రావాలని ముఖ్యమంత్రులతో వరుస వర్చువల్ సమావేశాలు చేపట్టినట్లు శ్రీ ప్రసాద్ న్యాయ అధికారులకు చెప్పారు. కేబినెట్ కార్యదర్శిఆరోగ్య కార్యదర్శి వివిధ ప్రధాన కార్యదర్శులుఆరోగ్య కార్యదర్శులతో సంభాషిస్తున్నారు. విస్తృతమైన అభిప్రాయాల ఆధారంగాహోం మంత్రిత్వ శాఖఆరోగ్య మంత్రిత్వ శాఖఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలు విపత్తు నిర్వహణ చట్టం క్రింద మార్గదర్శకాలను జారీ చేస్తాయి.సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా కేసుల స్వభావంఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు జారీ చేస్తున్న ఉత్తర్వులను వివరించారుఇవి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలనుతీసుకున్న చర్యలను సమర్థించాయి.

ఈ కష్ట సమయాల్లో మితిమీరిన వ్యాజ్యాలు( పిల్‌లను)ను నివారించాల్సిన అవసరం ఉందని న్యాయ శాఖ మంత్రి ప్రత్యేకంగా స్పష్టం చేశారు. కేసులను దాఖలు చేయకుండా ఎవరైనా ఆపలేనప్పటికీఈ రకమైన జోక్యాలకు సమర్థవంతమైన ప్రతిస్పందన ఉండాలన్నారు. దీనిని అటార్నీ జనరల్ఇతర న్యాయ అధికారులందరూ ప్రశంసించారు. న్యాయ శాఖ కార్యదర్శిఈ-కోర్ట్ లు, ఇతర పరిణామాల ప్రస్తావించారు. లాక్ డౌన్ సమయంలో కేసుల ఈ-ఫైలింగ్ కోసం నమోదు చేసుకున్న న్యాయవాదుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉందని ఆయన తెలిపారు. లాక్ డౌన్ సమయంలో పిటిషన్ల ఈ-ఫైలింగ్ కోసం 1282 న్యాయవాదులు నమోదు చేసుకున్నారుఅందులో గత వారంలోనే 543 మంది న్యాయవాదులు నమోదు చేసుకున్నారు. కోవిడ్-19 కు సంబంధించిన కేసుల గురించి న్యాయ మంత్రిత్వ శాఖలో అందుబాటులో ఉన్న సమన్వయ వ్యవస్థను న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి వివరించారు. తమ విధానంలో ఏకరూపత ఉండాలనిసుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే వివిధ హైకోర్టులకు తెలియజేయాలని ఇక్కడ ఒక సాధారణ ఏకాభిప్రాయం. ఈ-కోర్ట్ ల వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనీ సమావేశంలో లా అధికారులు అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్ట్ కి సంబంధించిన ఈ-కోర్ట్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్న న్యాయ శాఖ కార్యదర్శి ఈ ప్రతిపాదనలను కమిటీ ముందు పెట్టాలని న్యాయ శాఖ మంత్రి సూచించారు. మహమ్మారి తీవ్ర సమస్యగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కోర్ట్ కార్యకలాపాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతాయని అన్నారు. న్యాయ ప్రక్రియలో డిజిటల్ విధానాలు మరింత పటిష్టంగా రూపుదిద్దుకోవాలని కేంద్ర న్యాయ మంత్రి అభిప్రాయపడ్డారు. .

*****(Release ID: 1622748) Visitor Counter : 240