శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించడంపై దృష్టిపెడుతూ జాతీయ సాంకేతిక దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాలి.

ఈ సదస్సు శాస్త్రవేత్తలు, టెక్నోక్రాట్లు, ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు , జాతీయ , అంతర్జాతీయ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు , అధ్య‌య‌న సంస్థ‌ల‌ను స‌న్నిహితం చేస్తుంది.

Posted On: 10 MAY 2020 4:12PM by PIB Hyderabad

'రీస్టార్ట్' పేరుతో సైన్స్, టెక్నాలజీ , రీసెర్చ్ ట్రాన్స్‌లేషన్స్ ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి బ‌లోపేతం  చేయడంపై ఉన్నత స్థాయి డిజిటల్ కాన్ఫరెన్స్ ను  సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి (డిఎస్‌టి) చెందిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి)  ,కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( CII)లు జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే 11, 2020 సోమవారం నిర్వ‌హించ‌నున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ,ఎర్త్ సైన్సెస్ శాక మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ హాజరై జాతీయ సాంకేతిక దినోత్సవ ప్రసంగం చేస్తారు. ఈ కార్యక్రమంలో , నీతి ఆయోగ్ -సైన్స్ సభ్యుడు  డాక్టర్ వి కె సారస్వత్ ; భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర‌ సలహాదారు ప్రొఫెసర్ కె. విజయరాఘవన్; చీఫ్ సైంటిస్ట్, డబ్ల్యూహెచ్‌ఓ, డాక్టర్ సౌమ్య స్వామినాథన్; డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, మరికొందరు ప్ర‌త్యేక ప్ర‌సంగాలు చేస్తారు. టిడిబి, డిఎస్‌టి, సిఐఐ ఇతర అధికారులు హాజరవుతారు. బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, డాక్టర్ శేఖర్ సి మాండే, డిజి, సిఎస్ఐఆర్  , భారతదేశానికి ఇటలీ రాయబారి విన్సెంజో డి లూకా వివిధ సెషన్లలో ప్రత్యేక ప్రసంగాలు చేస్తారు.
కోవిడ్ -19 సంక్షోభంలో,  ఈమహమ్మారిపై పోరాటంలో సాంకేతికత ముందంజలో ఉంది. ప్రపంచం తన కొత్త సాధారణ ప‌రి స్థితుల‌కు సర్దుబాటు అవుతున్న‌ప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార రంగ నాయ‌కులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి కొత్త వ్యూహాలను రూపొందించ‌డంలో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు, ఇవి తిరిగి కోలుకోవ‌డానికి,  సంక్షోభం నుండి  మ‌రింత బ‌లంగా  బయటపడటానికి సహాయపడతాయి.
ఆర్థిక వ్యవస్థను తిరిగి బ‌లోపేతం  చేయడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి గ‌ల ప్ర‌స్తుత అవ‌స‌రాన్ని దృష్టిలో ఉంచుకుని, టిడిబి జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటోంది, ఆ దిశగా సాంకేతిక పరిష్కారాలపై దృష్టి సారించింది.  కోవిడ్ -19 అనంత‌ర కాలానికి భార‌త‌దేశాన్ని సిద్దం చేసేందుకుఈ సాంకేతిక పరిజ్ఞానాలలో, మెడికల్ టెక్నాలజీలు, అధునాతన టెక్నాలజీలు  తయారీ ఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన‌ సంక్షోభంలో శాస్త్ర ,సాంకేతిక విజ్ఞానం పోషించిన పాత్రపై తమ ఆలోచ‌న‌ల‌ను పంచుకునేందుకు శాస్త్రవేత్తలు, టెక్నోక్రాట్లు, ప్రభుత్వ అధికారులు, డిప్లొమాట్లు, డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థల ప్రముఖులను ఈ స‌ద‌స్సు ఒకే వేదికపైకి తీసుకువ‌స్తుంది.. ఇది ప్రస్తుత మహమ్మారిని ఎదుర్కోవ‌డ‌మే కాక, ముందు ముందు ఎదుర‌య్యే సవాళ్లను ప‌రిష్క‌రించ‌డంలో కూడా మ‌న‌కు సహాయపడుతుంది.
ఈ సమావేశంలో  ‘మెడిసిన్స్ & మెడికల్ టెక్నాలజీస్’ , ‘అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ - న్యూ టెక్నాలజీ హారిజన్స్’; ‘అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, గ్లోబల్ ఇన్నోవేషన్  టెక్నాల‌జీ అల‌యెన్స్‌ ఫ‌ర్‌   గ్లోబల్ ఎకనామిక్ లీడర్‌షిప్  వంటి టెక్నిక‌ల్ స‌మావేశాలు ఉంటాయి..
టిడిబి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున, ప్రతి సంవత్సరం మే 11 ను జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటుంది. దేశంలో ఆవిష్క‌ర‌ణ‌లు, సాంకేతిక రంగంలో సాధించిన అద్బుతాల‌కు గుర్తుగా దీనిని జ‌రుపుకుంటారు. అంతేకాదు ఈరోజుకు చారిత్ర‌కంగా కూడా ప్రాధాన్య‌త ఉంది.  మే 11, 1998 న పోఖ్రాన్ వద్ద అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా భారతదేశం ఒక పెద్ద సాంకేతిక పురోగతిని సాధించింది.
అంతేకాదు,  మొట్టమొదటి స్వదేశీ విమానం హన్సా -3 ని ఇదే  తేదీన బెంగళూరులో పరీక్షించి చూశారు; అదే రోజున భారతదేశం త్రిశూల్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 1999 నుండి, ఈ రోజును జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు
టెక్నాలజీ డే నిర్వ‌హించ‌డం , శాస్త్రీయ అన్వేష‌ణ‌, సాంకేతిక సృజనాత్మకత , ఆవిష్కరణల కోసం భారతదేశం ప‌డుతున్న‌ తపనను సూచిస్తుంది . ఈ పరిణామాలు జాతీయ సామాజిక-ఆర్ధిక ప్రయోజనాలు , ప్రపంచ స్థాయిలో మ‌న పాత్ర‌ను సంఘ‌టితం చేస్తాయి.
డిజిటల్ కాన్ఫరెన్స్ మాత్ర‌మే కాకుండా, టిడిబి మ‌ద్ద‌తు క‌లిగిన‌ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సంస్థలతో పాటు వర్చువల్ ఎక్స్‌పోజిషన్‌ను ప్లాన్ చేశారు. వివిధ సంస్థలు , కంపెనీలు, డిజిటల్ బి 2 బి లాంజ్ ద్వారా తమ ఉత్పత్తులను ఎక్స్‌పోజిషన్‌లో ప్రదర్శించనున్నాయి. ఈ కాన్ఫ‌రెన్స్ లో ప్రపంచవ్యాప్తంగా  ప్రజలు స్టాల్స్‌ను సందర్శించవచ్చు.
ఆస‌క్తి ఉన్నావారు కాన్ఫ‌రెన్స్‌కు, ఎగ్జిబిష‌న్ కు హాజ‌రుకావ‌డానికి ముందుగా కింది లింక్ ను ఉప‌యోగించి  రిజిస్ట‌ర్ చేసుకోవాలి.
https://www.ciidigitalevents.in/SignUp.aspx?EventId=E000000003.

 

****


(Release ID: 1622718) Visitor Counter : 275