రక్షణ మంత్రిత్వ శాఖ
మిషన్ సాగర్ - 10 మే 2020
Posted On:
10 MAY 2020 3:30PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆహార పదార్ధాలు, హైడ్రో క్లోరోక్క్విన్ టాబ్లెట్లు, ఆయుర్వేద మందులు, వైద్య సహాయ బృందాలతో సహా కోవిడ్ కు సంబంధించిన మందులను మాల్దీవులు, మారిషస్, సీషెల్స్, మడగాస్కర్, కొమొరోస్ దేశాలకు అందించడం కోసం భారత ప్రభుత్వ అవుట్ రీచ్ కార్యక్రమాల్లో భాగంగా భారత నావికాదళం నౌక కేసరి 2020 మే నెల 20వ తేదీన బయలుదేరింది. కోవిడ్19 కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న దేశాల మధ్య సత్సంబంధాలను పెంపొందించే
దిశగా, ఈ ప్రాంతంలో ముందుగా ప్రతిస్పందించిన దేశంగా భారతదేశం చేపట్టిన చర్యల్లో భాగంగా "మిషన్ సాగర్" కార్యక్రమాన్ని చేపట్టింది.
‘సాగర్’ ప్రాంతంలో అందరికీ భద్రత మరియు అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఆశయానికి అనుగుణంగా, భారతదేశం తన పొరుగు దేశాలతో సంబంధాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేసి, ఇప్పటికే ఉన్న బంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుంది. రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో పాటు భారత ప్రభుత్వ ఇతర ఏజెన్సీల సన్నిహిత సహకారంతో "మిషన్ సాగర్" పురోగమిస్తోంది.
మిషన్ సాగర్ లో భాగంగా భారత నావికా దళం నౌక కేసరి మాల్దీవుల రిపబ్లిక్ లోని మాలే నౌకాశ్రయానికి చేరుకుని అక్కడ 600 టన్నుల ఆహారధాన్యాలను అందజేస్తుంది. పొరుగు దేశాలైన భారతదేశం మరియు మాల్దీవులు బలమైన మరియు అత్యంత సన్నిహిత రక్షణ మరియు దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాయి.
*****
(Release ID: 1622687)
Visitor Counter : 406
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam