ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం జరిగింది.
Posted On:
10 MAY 2020 2:44PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సౌకర్యాలు గుర్తించడం జరిగింది. కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రజారోగ్య సౌకర్యాలు ఈ క్రింది విధంగా మూడు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి
కేటగిరి-1, కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రి(డిసిహెచ్)- ఈ ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు వైద్యపరంగా తీవ్రమైన కేసులుగా గుర్తించిన పేషెంట్లకు సమగ్ర చికిత్సను అందించేందుకు నిర్దేశించినవి. ఈ ఆస్పత్రులలో ఐసియులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయంతోకూడిన బెడ్లు ఉంటాయి. ఈ ఆస్పత్రులలో అనుమానితు కేసులకు, నిర్ధారత కేసులకు ప్రత్యేక వార్డులుంటాయి. ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు , ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలకు రెఫరల్ ఆస్పత్రులుగా, కోవిడ్ నుంచి రక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
కేటగిరి 2 లో కోవిడ్ ప్రత్యే ఆరోగ్య కేంద్రం (డిసిహెచ్‌సి)- ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు వైద్యపరంగా తమకు కేటాయించిన ఒక మాదిరి తీవ్రత కలిగిన అన్ని కేసులకు సంరక్షణ అందించే ఆసుపత్రులు. ఈ ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రంలో నిర్ధారిత కేసులకు , అనుమానిత కేసుల కోసం ప్రత్యేక వార్డులు ఉన్నాయి . ఈ ఆసుపత్రులలో ఆక్సిజన్ సదుపాయాంతో పడకలు ఉంటాయి. ప్రతి ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోవిడ్ హాస్పిటల్స్‌కు మ్యాప్ చేయబడుతుంది.
కేటగిరీ 3 కోవిడ్ ప్రత్యేక సంరక్షణ కేద్రాలు (డిసిసిసి)- కోవిడ్ సంరక్షణ కేంద్రాలు వైద్యపరంగా తేలికపాటి లేదా,చాలా తేలికపాటి కేసులు లేదా కోవిడ్ అనుమానిత కేసులను పరిశీలించి వారిని సంరక్షిస్తాయి వీటిని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తాత్కాలిక వసతులలో ఏర్పాటు చేస్తాయి. అంటే హాస్టళ్ళు, హోటళ్లు, పాఠశాలలు,స్టేడియంలు, లాడ్జీలువంటి వాటి ప్రభుత్వ , ప్రైవేటు సదుపాయాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. నిర్ధారిత, అనుమానిత కేసులకు విడివిడిగా సదుపాయాలు ఉంటాయి.
ప్రతి ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలకు , రిఫెరల్ సౌకర్యం కోసం కనీసం ఒక ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రికి మ్యాప్ చేయబడుతుంది
10-5-2020 నాటికి 483 జిల్లాలలో 7740 సదుపాయాలను గుర్తించారు. ఇవి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఏర్పటయ్యాయి. ఇందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసినవాటితోపాటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినవి కూడా ఉన్నాయి. వీటిలో 6,56,769 ఐసొలేషన్ బెడ్లు, 3,05,567 కోవిడ్ నిర్ధారిత కేసుల కోసం బెడ్లు, 3,51,204 బెడ్లు అనుమానిత కేసుల కోసం, 99,492 బెడ్లు ఆక్సిజన్ సదుపాయం కలిగిన బెడ్లు, 1696 సదుపాయాలు ఆక్సిజన్ మానిఫోల్డ్‌బెడ్లు, 34076 బెడ్లు ఐసియు బెడ్లు ఉన్నాయి.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రజలకు తగిన సమాచారం అందించడం కోసం తమ వెబ్‌సైట్లలో ఈ మూడు రకాల కోవిడ్ ప్రత్యేక సౌకర్యాల గురించి తెలియజేయాలని , ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని భారత ప్రభుత్వం కోరింది. 32 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు తమ వెబ్‌సైట్లు , పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సమాచారాన్ని ఇప్పటికే అప్‌లోడ్ చేశాయి , మిగిలినవి కూడా ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేసేపనిలో ఉన్నాయి.
కోవిడ్ -19 కేసులకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి)లో పరీక్షల సామర్ద్యం మరింత పెంచాల్సిన అవసరం ఉండడంతో సాధికార కమిటీ 2 సిఫార్సులకు అనుగుణంగా ఎక్కు వ పరీక్షలుచేయగల మిషన్‌ను సమకూర్చుకోవడానికి అనుమతించడం జరిగింది.
కోబాస్ 6800 పరీక్షా యంత్రాన్ని ఇప్పుడు ఎన్‌సిడిసిలో విజయవంతంగా ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ,ఎన్‌సిఆర్, లడఖ్, జమ్ము కాశ్మీర్, ఇతర రాష్ట్రాల వారి అవసరాలకు అనుగుణంగా నమూనాలను పరీక్షించడానికి ఎన్‌సిడిసి సహకారం అందిస్తోంది. ప్రస్తుతం ఎన్‌సిడిసిలో పరీక్ష సామర్థ్యం రోజుకు 300 నుంచి 350 పరీక్షలు. 24 గంటల్లో 1200 నమూనాలను పరీక్షించే సామర్థ్యం కలిగిన అధిక పరీక్షా యంత్రం అయిన కోబాస్ 6800 తో, ఎన్‌సిడిసి వద్ద కోవిడ్ -19 పరీక్ష సామర్థ్యం గణనీయంగా మెరగుపడింది..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 19,357 మందికి వ్యాధి నయమైంది. గత 24 గంటల్లో 1511 మంది రోగులు వ్యాధినయమై ఇళ్లకు వెళ్లారు. ఇది మొత్తం రికవరీ రేటును 30.76శాతానికి తీసుకు వెళుతోంది. నిర్ధారిత కోవిడ్ మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 62,939. నిన్నటి నుండి,దేశంలో కోవిడ్ -19 నిర్దారిత కేసులు 3277 పెరిగాయి.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/ అలాగే @MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు అలాగే @CovidIndiaSeva కుపంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1622685)
Visitor Counter : 392
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam