రైల్వే మంత్రిత్వ శాఖ

దేశ‌వ్యాప్తంగా 2020 మే 9 వ‌రకు 283 శ్రామిక్ స్పెష‌ల్ రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ ఇండియ‌న్ రైల్వే

ఈరోజు మ‌రో 49 శ్రామిక్ స్పెష‌ల్ రైళ్ళు .
ప్ర‌యాణికుల‌కు ఉచిత భోజ‌న , మంచినీటి వ‌స‌తి
ప్రయాణీకులను పంపే రాష్ట్రం , వారిని స్వీకరిస్తున్న రాష్ట్రం రెండూ సమ్మతి ఇచ్చిన తరువాత మాత్రమే రైల్వేశాఖ రైళ్ల‌ను న‌డుపుతోంది.
భౌతిక దూరం పాటిస్తున్నారు.
ఒక్కొక్క శ్రామిక్ ప్ర‌త్యేక రైలులో 1200 మందికి ప్ర‌యాణ‌స‌దుపాయం
తాజా స‌మాచారం ప్ర‌కారం, 300కు పైగా రైళ్లు న‌డుస్తున్నాయి.

Posted On: 09 MAY 2020 10:20PM by PIB Hyderabad

కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఆదేశాల మేర‌కు, ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు , వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన ఇతర వ్యక్తులను వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చ‌డానికి  భారత రైల్వే “శ్రామిక్ స్పెషల్” రైళ్లను నడపాలని నిర్ణయించింది.
9 మే 2020 నాటికి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 283 “శ్రామిక్ స్పెషల్” రైళ్లు న‌డుస్తున్నాయి, ఇందులో 225 రైళ్లు గమ్యస్థానానికి చేరుకున్నాయి , 58 రైళ్లు ప్ర‌యాణికుల చేర‌వేత‌లో ఉన్నాయి. మ‌రో 49 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఈరోజు తిర‌గ‌నున్నాయి.
ఈ 283 రైళ్లు, ఆంధ్రప్రదేశ్ (2 రైళ్లు), బీహార్ (90 రైళ్లు), హిమాచల్ ప్రదేశ్ (1 రైలు), జార్ఖండ్ (16 రైళ్లు), మధ్యప్రదేశ్ (21 రైళ్లు), మహారాష్ట్ర (3 రైళ్లు), ఒడిశా (21 రైళ్లు), రాజస్థాన్ (4 రైళ్లు), తెలంగాణ (2 రైళ్లు), ఉత్తర ప్రదేశ్ (121 రైళ్లు), పశ్చిమ బెంగాల్ (2 రైళ్లు) ఆయా రాష్ట్రాల గ‌మ్య‌స్థానాలకు చేరుకున్నాయి.
ఈ రైళ్లలో వ‌ల‌స కార్మికుల‌ను, ప్రయాగ్‌రాజ్‌, ఛప్రా, బాలియా, గయా, పూర్నియా, వారణాసి, దర్భాంగా, గోరఖ్‌పూర్, లక్నో, జౌన్‌పూర్, హతియా, బస్తీ, కతిహార్, దానపూర్, ముజఫర్‌పూర్, సహర్సా వంటి నగరాలకు చేర్చారు.
ఈ శ్రామిక్ స్పెషల్ రైళ్లలో, గరిష్టంగా 1200 మంది ప్రయాణికులు సామాజిక దూరాన్ని గమనించి ప్రయాణించవచ్చు. రైలు ఎక్కే ముందు ప్రయాణికులను త‌ప్ప‌కుండా  పరీక్షిస్తారు. ప్రయాణ సమయంలో, ప్రయాణీకులకు ఉచిత భోజనం , నీరు అంద‌జేస్తారు.


 



(Release ID: 1622647) Visitor Counter : 183