రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వైమానిక దళం, నావికాదళం, తీరప్రాంత గస్తీ దళం మరియు ఇతర దళాలకు అవసరమైన వైమానిక క్షేత్రాల మౌలిక సదుపాయాల ఆధునీకరణ

Posted On: 08 MAY 2020 6:25PM by PIB Hyderabad

భారత వైమానిక దళం (ఐ.ఏ.ఎఫ్.), భారత నావికా దళం (ఐ.ఎన్.), భారత తీరప్రాంత గస్తీ దళం (ఐ.సి.జి.)లకు అవసరమైన 37 వైమానిక క్షేత్రాల మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం సుమారు 1200 కోట్ల రూపాయల కాంట్రాక్టు పై రక్షణ మంత్రిత్వశాఖ ఈ రోజు సంతకం చేసింది.   ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. 

భారత వైమానిక దళానికి చెందిన 30 వైమానిక క్షేత్రాల నవీకరణతో కలిసిన ఎమ్.ఏ.ఎఫ్.ఐ. మొదటి దశ ఆధారంగా అనుసరించే ఈ ఎమ్.ఏ.ఎఫ్.ఐ. రెండవ దశ చేపట్టారు.  ఎమ్.ఏ.ఎఫ్.ఐ. మొదటి దశ కింద చేపట్టిన వైమానిక క్షేత్రాల ఆధునీకరణ ద్వారా మిలిటరీ మరియు పౌర వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరింది. 

క్యాట్-II ఇన్ స్ట్రుమెంట్ లాండింగ్ సిస్టం (ఐ.ఎల్.ఎస్.) మరియు క్యాట్-II ఎయిర్ ఫీల్డ్ లైట్నింగ్ సిస్టం (ఏ.ఎఫ్.ఎల్.ఎస్.) మొదలైన 

ఆధునిక ఎయిర్‌ఫీల్డ్ పరికరాల సంస్థాపన మరియు ప్రారంభంతో కూడిన ఒక టర్న్‌కీ ప్రాజెక్ట్ ఇది.  వైమానిక క్షేత్రాల చుట్టూ ఉన్న ఆధునిక పరికరాలు నేరుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎ.టి.సి.) కి అనుసంధానించబడి ఉంటాయి, దీంతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు ఎయిర్ఫీల్డ్ వ్యవస్థలపై అద్భుతమైన నియంత్రణ ఉంటుంది.  ఈ ప్రాజెక్ట్ కింద నావిగేషనల్ ఎయిడ్స్ మరియు మౌలిక సదుపాయాల స్థాయిని పెంచడం ద్వారా కార్యాచరణ సామర్ధ్యం పెరుగుతుంది.  తక్కువ దృశ్యమానతలో, వాతావరణం సరిగా లేని పరిస్థితుల్లో కూడా సైనిక మరియు పౌర విమానాల కార్యకలాపాలు సులభంగా, సురక్షితంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. 

ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ పరిశ్రమకు ప్రేరణనిస్తుంది. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన వివిధ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా, ఈ ప్రాజెక్ట్ సుమారు 250 కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కాంట్రాక్ట్ మార్కెట్లో చాలా అవసరమైన మూలధనాన్ని నింపడానికి సహాయపడుతుంది. సివిల్, ఎలక్ట్రికల్ పరికరాలు, నిర్మాణరంగంతో పాటు కమ్యూనికేషన్, ఏవియానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాలలో ఉపాధి కల్పన అవకాశాలను ఈ ప్రాజెక్టు మెరుగుపరుస్తుంది. 

*****



(Release ID: 1622302) Visitor Counter : 213