సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఈవెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీ ,చిన్నతరహా ఫైనాన్సింగ్ ఎంటర్‌ప్రైజెస్ లు సానుకూల దృక్ఫథంతో ఉండాలని , ప్రస్తుత పరిస్థితినుంచి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అన్వేషించాలని కోరిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరి
Posted On:
08 MAY 2020 6:00PM by PIB Hyderabad
కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ, రోడ్డు రవాణా , జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈవెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్, ఫైనాన్స్ ఇండస్ట్రీ డవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యులతో ఆయారంగాలపై కోవిడ్ -19 ప్రభావంపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా , ఎం.ఎస్.ఎం.ఇ సంస్థలకు చెందిన ప్రతినిధులుకోవిడ్ -19 ప్రభావం వల్ల తాము ఎదుర్కొంటున్న సవాళ్లు , ఇబ్బందుల గురించి వివరించారు. ఈ రంగం మనుగడ సాగించడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతూ వారు పలు సూచనల చేశారు.
ఈ రంగం అద్భుతంగా పనిచేస్తున్నదని అంటూ శ్రీ నితిన్ గడ్కరి, వారి ప్రతిభ, వారి దార్శనికత ఎల్లెడలా గుర్తింపు పొందిందని అన్నారు. మనం కరోనాపై పోరాటం చేస్తున్నందున, ఈవెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం తమను ఎం.ఎస్.ఎం.ఇలుగా రిజిస్టర్ చేయించుకుని ,ప్రభుత్వ పథకాలనుంచి లబ్ధిపొందాల్సిందిగా సూచించారు.
ఈ రంగంలోని సంస్థలకు భారతదేశంలో భారీ సామర్థ్యం ఉందని, ప్రగతి మైదాన్‌ను అంతర్జాతీయ ఎక్స్‌పోజిషన్ సెంటర్‌గా భారత్ పునర్నిర్మిస్తోందన్నారు. పరిశ్రమలకు అన్ని స్థాయిలలో గరిష్ఠ సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ రంగం సవివరమైన విజ్ఞాపనను అందిస్తే దానిని తాను ఇతర మంత్రిత్వ శాఖలు ,విభాగాల దృష్టికి తీసుకుపోగలనని ఆయన అన్నారు.
ఈ సంక్షోభం నుండి బయటపడటానికి పరిశ్రమ ఈ సమయంలో సానుకూల వైఖరిని కలిగి ఉండాలని శ్రీ గడ్కరీ కోరారు.
చైనా నుండి జపాన్ తన పెట్టుబడులు ఉపసంహరించుకుని వేరే ప్రాంతాలకు వెళ్లడానికి జపాన్ ప్రభుత్వం తన పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీని అందించిందని మంత్రి గుర్తు చేశారు. ఇది భారతదేశానికి ఒక అవకాశమని, దానిని అందిపుచ్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన కొన్ని అంశాలు సూచనలలో , MSME గా నమోదు చేసుకోవడానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోసం ఒక కేటగిరీని ప్రవేశపెట్టడం, MSME లకు రాష్ట్ర ,జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారుల అవసరం, సోర్సింగ్ ఫండ్లలో చిన్న ఫైనాన్సింగ్ యూనిట్లకు సహాయం, సంబంధిత పథకం కింద ఇచ్చే హామీలను పొందటానికి చిన్న ఫైనాన్సింగ్ యూనిట్లకు క్రెడిట్ రేటింగ్ అవసరాన్ని తొలగించడం వంటివి ఉన్నాయి.
ప్రతినిధుల ప్రశ్నలకు శ్రీ గడ్కరీ స్పందిస్తూ, సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తానని , ఇతర సంబంధిత విభాగాలు , ప్రభుత్వాల దృష్టికి ఈ విషయాలను తీసుకువెళతానని ఆయన తెలిపారు.
పరిశ్రమ సానుకూల విధానాన్ని అనుసరించాలని, కోవిడ్ -19 సంక్షోభం అనంతరం ఏర్పడే అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు..
(Release ID: 1622267)
Visitor Counter : 171