గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ట్రైఫెడ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సంయుక్త కార్యాచరణ గిరిజన కళాకారులను ఆదుకునేందుకు ఉచిత రేషన్ కిట్లు
Posted On:
08 MAY 2020 5:47PM by PIB Hyderabad
దేశంలోని గిరిజనులకు సాయం చేసేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రైఫెడ్ (TRIFED), ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ (AOL) అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. గిరిజన సంస్థలను ప్రోత్సహించడానికి, ఈ రెండు విభాగాలు నిర్వహించే కార్యక్రమాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. గిరిజన కళాకారులను ఆదుకునేందుకు ఉచిత రేషన్ కిట్లు అందించడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అంగీకరించింది.
గిరిజన కళాకారుల జాబితాలను ట్రైఫెడ్ ప్రాంతీయ కార్యాలయాలు రూపొందించాయి. 9,409 మంది గిరిజన కళాకారులు దేశవ్యాప్తంగా ఉన్నట్లు గుర్తించాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ చేపట్టనున్న #iStandWithHumanity కార్యక్రమం కింద, వీరందరికీ రేషన్ కిట్లు అందజేస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కార్యాలయాల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
క్రమ సంఖ్య. ప్రాంతీయ కార్యాలయం అవసరమైన రేషన్ కిట్ల సంఖ్య
1. అహ్మదాబాద్ 756
2. ఛండీగఢ్ 191
3. భోపాల్ 954
4. జైపూర్ 2707
5. కోల్‌కతా 1576
6. ముంబయి 817
7. రాంచీ 2017
8. డెహ్రాడూన్ 391
మొత్తం 9409
10 మే 2020 నుంచి ప్రతి వారం కొత్త సమాచారం అందుతుంది.
(Release ID: 1622246)
Visitor Counter : 235
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam