ఆర్థిక మంత్రిత్వ శాఖ

జీఐఎఫ్‌టీ-ఐఎఫ్ఎస్‌సీలోని అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలలో రూపాయి-డాల‌ర్ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రారంభించిన శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 08 MAY 2020 4:03PM by PIB Hyderabad

 

 

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు రెండు అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలపై రూపాయి-డాల‌ర్ (ఐఎన్ఆర్-యుఎస్డి) ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రారంభించారు. బీఎస్ఈ యొక్క ఇండియా ఐఎన్ఎక్స్, ఎన్ఎస్ఈకి చెందిన ఎన్ఎస్ఈ-ఐఎఫ్ఎస్‌సీ ఎక్స్ఛేంజీలపై ఎన్ఆర్-యుఎస్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులను మంత్రి ప్రారంభించారు. గాంధీనగర్‌లోని జీఐఎఫ్‌టీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంట‌ర్ ‌నందు వీడియో కాన్ఫరెన్స్ కార్య‌క్ర‌మం ద్వారా మంత్రి దీనిని ప్రారంభించారు. గ‌డిచిన దశాబ్ద కాలంలో లేదా భారతదేశానికి సంబంధించిన ఆర్థిక సేవల్లో గణనీయమైన మార్కెట్ వాటా ఇతర అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలకు మారింది. వివిధ ర‌కాల వ్యాపారాల‌ను భారతదేశానికి తీసుకురావడం ఆర్థిక కార్యకలాపాల ప‌రంగానూ ఉపాధి ప‌రంగా ల‌బ్ధి పొందేందుకు గాను చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీఐఎఫ్‌టీ-ఐఎఫ్ఎస్‌సీలోని అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలలో రూపాయి -డాల‌ర్ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రారంభించ‌డం ఈ దిశ‌గా ఒక ముంద‌డుగు. జీఐఎఫ్‌టీ-ఐఎఫ్ఎస్‌సీ లావాదేవీల్లో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే వారందరికీ అన్ని టైమ్స్‌జోన్ల‌లో 22 గంటలు ఇది అందుబాటులో ఉండ‌నుంది. జీఐఎఫ్‌టీ-ఐఎఫ్ఎస్‌సీ వద్ద ప్రపంచ స్థాయి వ్యాపార వాతావరణంతో పాటుగా త‌క్క‌వ ప‌న్ను వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంచ‌డం వ‌ల్ల ఐఎన్ఆర్‌- యుఎస్‌డీ కాంట్రాక్టులు అధిక మొత్తంలో భార‌త్‌కు తీసుకువ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఇది ఐఎఫ్ఎస్‌సీ ద్వారా భారీ మొత్తంలో ప్రపంచ భాగస్వామ్యాన్ని భార‌త్‌కు తీసుకురావ‌డంతో పాటుగా భారతదేశం యొక్క ఐఎఫ్ఎస్‌సీని ప్రపంచ వ్యాప్తంగా అనుసంధానిస్తుంది.



(Release ID: 1622183) Visitor Counter : 160