మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశంలో పరిశోధనకు ప్రోత్సాహం ఇవ్వాడానికి పిఎంఆర్ఎఫ్ స్కీముకు సవరణలు ప్రకటించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
ఈ సవరణల వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఈ స్కీము వల్ల ప్రయోజనం పొందుతారు -- శ్రీ రమేష్ పొక్రియాల్ 'నిషాంక్'
Posted On:
07 MAY 2020 4:14PM by PIB Hyderabad
దేశంలో పరిశోధనను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రధానమంత్రి పరిశోధన విశిష్ట సభ్యత్వ పథకానికి వివిధ సవరణలు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పొక్రియాల్ 'నిషాంక్' గురువారం ప్రకటించారు. ఈ సవరణల తరువాత ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు (ఐ ఐ ఎస్ సి/ఐ ఐ టిలు/ఎన్ఐటిలు/ఐ ఐ ఎస్ ఈ ఆర్ లు /ఐ ఐ ఈ ఎస్ టి / సి ఎఫ్ ఐ ఐ ఐటి లు) ఈ సభ్యత్వం పొందటానికి అవసరమైన అర్హత గేట్ స్కోరును 750 నుంచి 650కి తగ్గించారు. అంతేకాక వారికి కనీస సిజిపిఎ 8.0 లేక తత్సమానంగా ఉండాలని మంత్రి తెలిపారు.
ఫెలోషిప్ స్కీములో చేరడానికి ఇక ముందు రెండు రకాల ప్రవేశాలు ఉంటాయి. మొదటిది నేరుగా ప్రవేశం పొందడం మరియు రెండవది లాటరల్ ఎంట్రీ. లాటరల్ ఎంట్రీలో పిఎంఆర్ఎఫ్ మంజూరు చేసే సంస్థలలో పి హెచ్ డి పట్టభద్రులు కావడానికి పరిశోధన జరుపుతున్న విద్యార్థులు (12 లేదా 24 నెలలు పూర్తి చేసినవారు) కూడా ఈ స్కీము కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేయవచ్చు. దేశంలోని ఎన్ఐటిలు కూడా ర్యాంకింగ్ ల ప్రకారం దేశంలోని 25 అగ్రశ్రేణి సంస్థల కోవలోకి వస్తాయి. ఆ విధంగా ఎన్ఐటిలు కూడా పిఎంఆర్ఎఫ్ మంజూరు సంస్థగా మారవచ్చు. ఈ సవరణల వల్ల మరింత మంది విద్యార్థులు ఈ స్కీము ద్వారా ప్రయోజనం పొందగలరనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తంచేశారు.
https://twitter.com/DrRPNishank/status/1258340738502361088?s=19
పరిశోధనను మరింత ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా "పరిశోధన మరియు కొత్తకల్పన డివిజన్" ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ డివిజన్ కు ఒక డైరెక్టర్ అధిపతిగా ఉంటారు. మానవ ఐ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని సంస్థల పరిశోధనను సమన్వయ పరుస్తారు.
దేశంలోని వివిధ ఉన్నత విద్యా సంస్థల పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు ఈ స్కీమును డిజైన్ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆకర్షణీయమైన ఫెలోషిప్ ల ద్వారా పరిశోధనలు జరిపేందుకు ప్రతిభావంతులను ఆకర్షించడం ద్వారా కొత్తకల్పనల ద్వారా అభివృద్ధి సాధించాలన్న కలను నిజం చేసుకోవాలన్నది తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ స్కీమును 2018-19 బడ్జెట్ లో ప్రకటించినట్లు ఆయన తెలియజేశారు. సైన్స్ మరియు /లేక టెక్నాలజీ డిగ్రీలు ఇచ్చే అన్ని ఐఐటీలు, అన్ని ఐఐఎస్ఈఆర్ లు, బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మరికొన్ని అగ్రశ్రేణి సెంట్రల్ యూనివర్సిటీలు / ఎన్ఐటిలు కూడా ఈ ఫెలోషిప్ ఇవ్వవచ్చు.
ఈ ఫెలోషిప్ అభ్యర్థుల ఎంపికకు కఠినమైన ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వారి పని, ప్రవర్తన తగిన రీతిలో ఒక జాతీయ సమ్మేళనంలో సమీక్షించడం జరుగుతుంది. విద్యా సంవత్సరం 2020-21 నుంచి అభ్యర్థులు పి ఎం ఆర్ ఎఫ్ కు దరఖాస్తు చేయవచ్చు.
నేరుగా ప్రవేశాల ఛానల్
ఈ ఛానల్ లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసేవారు ఈ దిగువ లక్షణాలు కలిగి ఉండాలి.
1. గడిచిన మూడు సంవత్సరాలలో అభ్యర్థి (అ) దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ /యూనివర్సిటీలో టెక్నాలజీ / సైన్స్ బాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేయడం లేక చివరి సంవత్సరం చదువుతుండటం చేస్తూ ఉండాలి సిజిపిఎ 8.0 లేక అంతకన్నా ఎక్కువ మరియు సంబంధిత విషయం గేట్ పరీక్షలో 650 లేక అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న సాంకేతిక సంస్థల నుంచి డిగ్రీ పాసై ఉన్నట్లయితే గేట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. (ఆ) పి ఎం ఆర్ ఎఫ్ ఫెలోషిప్ మంజూరుచేసే సంస్థల నుంచి ఎం టెక్ / ఎం ఎస్ పూర్తి చేసి లేక చదువుతూ ఉండి గెట్ పాసైన వారు. ప్రస్తుతం చదువుతున్న వారు మొదటి సెమిస్టరులో కనీసం నాలుగు కోర్సులలో కనీసం 8. 0 లేక అంతకన్నా ఎక్కువ సిజిపిఎ కలిగి ఉండాలి .
2. వారు పి ఎం ఆర్ ఎఫ్ ఫెలోషిప్ మంజూరుచేసే సంస్థలలో పి హెచ్ డి కి దరఖాస్తు చేసి ఎంపికవుతారు.
3. ఆ విధంగా సాధారణ ఎంపిక ప్రక్రియ (ఇంటర్వ్యూ) ద్వారా పి హెచ్ డిలో చేర్చుకున్న సంస్థ అతని/ఆమె ప్రతిభ ఆధారంగా ఫెలోషిప్ కు సిఫార్సు చేస్తుంది. పరిశోధనలో అనుభవం, ప్రచురణలు, అంతర్జాతీయ విద్యా పోటీలలో వారి సామర్ధ్యం , గ్రేడ్లు మరియు సిఫార్సు లేఖలతో పాటు ఇతర అంశాల ప్రాతిపదికగా ఫెలోషిప్ లకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
లాటరల్ ఛానల్ ద్వారా ప్రవేశాలు
ఈ ఛానల్ ద్వారా పి ఎం ఆర్ ఎఫ్ కోసం అభ్యర్థులకు ఈ దిగువ ఇచ్చిన అన్ని లక్షణాలు ఉండాలి.
1. పి ఎం ఆర్ ఎఫ్ మంజూరు సంస్థలు దేనిలోనైనా పి హెచ్ డి చేస్తూ ఉండాలి. మాస్టర్స్ తరువాత పి హెచ్ డిలో చేరి ఉంటే 12 నెలలు పూర్తయి ఉండాలి. డిగ్రీ తరువాత పి హెచ్ డిలో చేరిఉంటే 24 నెలలు పూర్తయి ఉండాలి. అతడు/ ఆమె పి హెచ్ డిలో కనీసం నాలుగు కోర్సులను సి జి పి ఎ /సిపిఐ 8.5 లేక అంతకన్నా ఎక్కువ పాయింట్లతో పూర్తి చేసి ఉండాలి.
2, అభ్యర్థి ఫెలోషిప్ గురించి పి ఎం ఆర్ ఎఫ్ మంజూరు సంస్థ సిఫార్సు చేస్తుంది. అభ్యర్థి ప్రతిభను , తత్సంబంధిత వివరాలను
పి ఎం ఆర్ ఎఫ్ వెబ్ పోర్టల్ అప్ లోడ్ చేసి గట్టిగా షిఫార్సు చేస్తుంది.
3. బలమైన పరిశోధనా ప్రతిపాదన, ప్రచురణల రికార్డు మరియు గ్రేడ్లతో పాటు ఇతర అంశాల ప్రాతిపదికగా అభ్యర్థిని నిర్ణయిస్తారు. పేరొందిన పత్రికలో (జర్నల్) ప్రచురణ / విశిష్ట సమ్మేళనంలో వ్యాసం చదవడాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
***
(Release ID: 1622040)
Visitor Counter : 234