ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కోసం ఆయుష్ జోక్యాలతో కూడిన ఇంటర్ డిసిప్లినరీ అధ్యయనాలను, "సంజీవని" యాప్ ను ప్రారంభించిన - డాక్టర్ హర్ష వర్ధన్.

సాంకేతిక వాటాదారుల మధ్య సంబంధం ఆయుష్ సంప్రదాయ విజ్ఞానం పెద్ద సంఖ్యలో ప్రపంచ మానవాళికి చేరడానికి సహాయపడుతుంది

Posted On: 07 MAY 2020 4:08PM by PIB Hyderabad

కోవిడ్-19 పరిస్థితికి సంబంధించి ఆయుష్ ఆధారిత అధ్యయనాలను, "సంజీవని" యాప్ ను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కేంద్రమంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో  గోవా నుండి ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు

కోవిడ్ -19 ప్రతిస్పందన కోసం సాంకేతిక పరిజ్ఞానం  ప్రాముఖ్యత గురించి కేంద్ర ఆరోగ్యమంత్రి నొక్కి చెబుతూ, "ఈ రోజు ప్రారంభించిన "సంజీవని" మొబైల్ యాప్ ఆయుష్ మందుల వినియోగం, ఆమోదంపై సమాచారాన్ని, కోవిడ్-19 నివారణలో దీని ప్రభావం, ప్రజలు తీసుకోవలసిన చర్యలపై సమాచారాన్ని, సేకరించడానికి, తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. ఆయుష్ మరియు ఎమ్.ఈ.ఐ.టి.వై. మంత్రిత్వ శాఖలు ఈ యాప్ ను అభివృద్ధిచేశాయి. ఈ యాప్ 50 లక్షల మంది ప్రజలకు చేరగలదని లక్ష్యంగా పెట్టుకున్నారు." అని పేర్కొన్నారు. 

కోవిడ్-19 నిర్వహణ ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. మరియు ఆయుష్ మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం కోసం ఒక శక్తివంతమైన వేదికను నెలకొల్పిందని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు.  సి.ఎస్.ఐ.ఆర్., ఐ.సి.ఎం.ఆర్., యు.జి.సి. వంటి సాంకేతిక సంస్థలు ఆయుష్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ సమాజ శ్రేయస్సు కోసం ఆయుష్ విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఇది బాగా దోహదపడింది.  ఈ సంస్థలన్నీ ఇప్పుడు ఐ.సి.ఎమ్.ఆర్. డి.సి.జి.ఐ. నేతృత్వంలో పురాతన సాంప్రదాయ వైద్య పరిజ్ఞానమైన ఆయుర్వేదం ఉపయోగాలను, ప్రయోజనాలను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. 

ఈ యాప్ తో పాటు డాక్టర్ హర్ష వర్ధన్ మరో రెండు శాస్త్రీయ అధ్యయనాలను కూడా ప్రారంభించారుఆయుష్ మంత్రిత్వశాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖలు కలిసి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సి.ఎస్.ఐ.ఆర్.) ద్వారా ఐ.సి.ఎం.ఆర్. సాంకేతిక సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రోగనిరోధకతకు ఆయుర్వేద జోక్యం  మరియు కోవిడ్-19 కు ప్రామాణిక సంరక్షణకు అనుబంధంగా ఈ పరిశోధనా పత్రాన్ని రూపొందించారు. 

దేశంలోని వివిధ సంస్థలకు చెందిన ప్రముఖ నిపుణులను సంప్రదించడం ద్వారా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో రోగనిరోధక అధ్యయనాలు మరియు యాడ్-ఆన్ జోక్యాల కోసం - విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ భూషణ్ పట్వర్ధన్ నేతృత్వంలో ఇంటర్ డిస్సిప్లినరీ ఆయుష్ పరిశోధన, అభివృద్ధి టాస్క్ ఫోర్స్ క్లినికల్ పరిశోధనా ప్రొటొకాల్స్ ను సూత్రీకరించి, రూపొందించారు. ఇందుకోసం అశ్వగంధ, యష్టిమధు, గుడూచి + పిప్పలి వంటి నాలుగు భిన్నమైన పదార్ధాలతో పాటు పోలీ హెర్బల్ ఫార్ములేషన్ (ఆయుష్-64) ను అధ్యయనం చేశారు. 

ఇందులో ఈ క్రింది రెండు విషయాలు ఉన్నాయి:

a.     కోవిడ్-19 మహమ్మారి సోకిన సమయంలో ఎక్కువ ప్రమాదం ఉన్న విషయాలలో సార్స్-కోవ్-2 కు వ్యతిరేకంగా రోగనిరోధకత కోసం అశ్వగంధ: ఆరోగ్య సంరక్షణకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పోలిక. 

b.      తేలికపాటి నుండి ఓ మాదిరి తీవ్రతతో ఉన్న కోవిడ్-19 చికిత్స కోసం ‘స్టాండర్డ్ ఆఫ్ కేర్’ కు అనుబంధంగా ఆయుర్వేద సూత్రీకరణ యొక్క ప్రభావం :  ఎ రాండమైజ్డ్, ఓపెన్ లేబుల్, సమాంతర సమర్థత, యాక్టివ్ కంట్రోల్, మల్టీసెంటర్ ఎక్స్‌ప్లోరేటరీ డ్రగ్ ట్రయల్. 

అధిక ప్రమాదం ఉన్న జనాభాలో కోవిడ్-19 సంక్రమణ నివారణకు ఆయుష్ ఆధారిత రోగనిరోధక జోక్యాల ప్రభావంపై జనాభా ఆధారిత ఇంటర్వెన్షనల్ అధ్యయనాలను కూడా డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రారంభించారు.  ప్రధాన లక్షణాలలో, కోవిడ్-19 కోసం ఆయుష్ జోక్యాల యొక్క నివారణ సామర్థ్యాన్ని అంచనా వేయడం మరియు అధిక ప్రమాద జనాభాలో జీవన ప్రమాణాల మెరుగుదలను అంచనా వేయడం ఉన్నాయి.  దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ సంస్థల క్రింద నాలుగు పరిశోధనా మండళ్లు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సుమారు 5 లక్షల జనాభాపై ఈ అధ్యయనం చేయడం జరిగింది.  శాస్త్రీయ ఆధారాల ద్వారా కోవిడ్-19 వంటి మహమ్మారి సమయంలో ఆయుష్ వైద్య విధాన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలో ఈ అధ్యయన ఫలితం  కొత్త మార్గాన్ని సుగమం చేస్తుందని భావిస్తున్నారు.

ఈ అధ్యయనాల గురించి డాక్టర్ హర్ష్ వర్ధన్ వివరిస్తూ,  సి.యస్.ఐ.ఆర్;  ఐ.సి.ఎం.ఆర్; మరియు డి.సి.జి.ఐ. సంస్థల సహకారంతో ఆయుష్ ప్రాముఖ్యతను ఈ అధ్యయనాలు తిరిగి స్థాపించగలవని పేర్కొన్నారు.  ఇది ఒక ముఖ్యమైన రోజు. కోవిడ్-19 మహమ్మారి తగ్గిన తర్వాత కూడా, ప్రధాన స్రవంతి శాస్త్ర ప్రయత్నాలలో ఆయుష్ యొక్క ఏకీకరణ ద్వారా, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరిష్కారాల ద్వారా, మనం  ప్రయోజనం చేకూర్చుకోడానికి విలువైన అవకాశాన్ని అందిస్తుంది. " అని  అన్నారు.  మన ప్రియతమ ప్రధానమంత్రి నాయకత్వంలో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో  (హెచ్.ఎఫ్.డబ్ల్యూ) ఓ.ఎస్.డి./కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ఆయుష్ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటేచశాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండే;  భారత ఔషధ నియంత్రణ మండలి కి చెందిన డాక్టర్ వి.జి. సోమాని తో పాటు ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. మరియు ఆయుష్ శాఖల ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు

***



(Release ID: 1621901) Visitor Counter : 268