పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ముసాయిదా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ (ఈఐఏ) కోసం నోటీసు వ్యవధి జూన్ 30, 2020 వరకు పొడిగింపు
Posted On:
07 MAY 2020 4:24PM by PIB Hyderabad
పర్యావరణ (రక్షణ) చట్టం- 1986 కింద ఇచ్చిన అధికారాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ) నోటిఫికేషన్ పేరిట ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించింది. మార్చి 23, 2020 తేదీతో ఎస్.ఓ.1199 (ఈ) గా ఇది వెలువడింది. దీనిని ఏప్రిల్ 23 న అధికారిక గెజిట్‌లో పొందుపరచడమైంది. ప్రజలకు ఈ ముసాయిదా నోటిఫికేషన్‌లో సమాచారం తెలియజేసేందుకు ఇందులోని ప్రతిపాదనలపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలున్నా.. లేదా తగిన సూచనలు తెలియజేసేందుకు గాను గెజిట్ యొక్క కాపీలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రతులను అందుబాటులో ఉంచిన తేదీ నుంచి అరవై రోజుల్లోపు అభ్యంతరాలు గానీ సూచనలు గానీ చేయాలని కోరుతూ ఈ ముసాయిదా ప్రతాతో పాటు వెల్లడించడమైంది. దేశంలో
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వ్యాప్తి నివారణకు గాను విధించిన లాక్‌డౌన్ సమయంలో ముసాయిదా ఈఐఏ నోటిఫికేషన్, 2020 ప్రచురించబడిన విషయమై ఆందోళనలు వ్యక్తం చేస్తూ నోటీసు వ్యవధిని పొడిగించాలని కోరుతూ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు పలు అభ్యర్థనలు అందాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తగిన పరిశీలన తరువాత నోటీసు వ్యవధిని జూన్ 30, 2020 వరకు పొడిగించడం సముచితమని భావనకు వచ్చంది. ముసాయిదా నోటిఫికేషన్‌లోని ప్రతిపాదనలపై ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఇవ్వదలచిన వారు ఎవైరనా జూన్ 30, 2020 లోపు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనేందుకు వీలుగా వాటిని లిఖితపూర్వకంగా పంపించవచ్చు. కార్యదర్శి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఇందిరా పర్యావరణ్ భవన్, జోర్ బాగ్ రోడ్, అలిగంజ్, న్యూఢిల్లీ -110003కి లేఖ రూపంలో గానీ లేదాః eia2020-moefcc[at]gov[dot]in అనే ఈ-మెయిల్ చిరునామాకు మెయిల్‌ను పంపడం ద్వారా కూడా తమ అభ్యంతరాలను లేదా సలహాలను ఇవ్వవచ్చు.
(Release ID: 1621851)
Visitor Counter : 459