ఆయుష్

కోవిడ్ -19 నేపథ్యంలో ఆయుష్ ఇంటర్ వెన్షన్స్ తో కూడిన ఇంటర్ – డిసిప్లినరీ అధ్యయనాలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మరియు ఆయుష్ మంత్రులు

Posted On: 07 MAY 2020 2:51PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్ష వర్థన్ మరియు ఆయుష్ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యశోనాయక్ సంయుక్తంగా కోవిడ్ -19 పరిస్థితుల్లో ప్రామాణిక సంరక్షణకు అనుబంధంగా ఆయుష్ సంజీవని యాప్, ఆయుర్వేద అంశాల పై క్లినికల్ రీసెర్చ్ స్టడీస్ ను ప్రారంభించారు. ఆయుష్ శాఖ సహాయ మంత్రి గోవా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒక గ్రేడెడ్, ప్రీ ఎంప్టీవ్, ప్రో యాక్టివ్ విధానం ద్వారా కోవిడ్ -19 నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షించడం, మరియు పర్యవేక్షించడం చేస్తున్నారని అన్నారు.

భారతదేశానికి చాలా కాలం నుంచి సంప్రదాయ ఔషధ చరిత్ర ఉందని, ఆయుర్వేద రంగంలో దేశం అగ్రగామిగా ఉందని డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. క్లినికల్అధ్యయనాలు, ఆయుష్ వ్యవస్థల సహకారం (రోగనిరోధక శక్తి పెంచడం మరియు యాడ్ ఆన్ ఇంటర్ వెన్షన్స్) ద్వారా దేశంలో కోవిడ్ -19 మహమ్మారి సమస్యను పరిష్కరించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆయుష్ సంజీవని మొబైల్ యాప్ ఆయుష్ విభాగానికి చెందిన వారిలో మరియు జనాభాలో కోవిడ్ -19 నివారణలో దాని ప్రభావం గురించి డేటాను సేకరించడం కోసం ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయుష్ వ్యవస్థల యొక్క క్లినికల్ స్టడీస్ (రోగనిరోధకత మరియు యాడ్ ఆన్ ఇంటర్ వెన్షన్స్) ద్వారా దేశంలోని కోవిడ్ -19 మహమ్మారి పరిష్కారం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుందని, ఆయుష్ ఆధారిత రోగ నిరోధక అంశాల ప్రభావాన్ని అధ్యయనం చేసిందని శ్రీ శ్రీపాద నాయక్ తెలిపారు. ప్రజల్లో కోవిడ్ -19 నివారణకు ఆయుష్ విభాగానికి చెందిన వారు మరియు ఆయా చర్యల ప్రభావం గురించి ఆయుష్ మంత్రిత్వ అధ్యయనం చేస్తోందని తెలిపారు.

ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం కోసం మరియు వ్యాధి నివారణకు ఆయుష్ పాత్రను అంచనా వేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ నాలుగు క్లినికల్ మరియు జనాభా ఆధారిత అధ్యయనాలను సైతం చేపట్టిందిన శ్రీ శ్రీపాద నాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ కోటెక్ మాట్లాడుతూ, ఇప్పటికే తీసుకున్న చర్యలు, ఏర్పాటు చేసిన వ్యూహాల ద్వారా కలిగిన ప్రయోజనాలను తెలుసుకోవడం కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి) ఉపాధ్యక్షులు డాక్టర్ భూషణ్ పట్ వర్థన్ అధ్యక్షతన నిపుణుల బృందంతో ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ ఆర్ అండ్ డి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆయుష్ జాయింట్ సెక్రటరీ శ్రీ పి.ఎన్.రంజిత్ కుమార్ ప్రజెంటేషన్ ద్వారా కోవిడ్ -19 కి సంబంధించిన మూడు ఆయుష్ ఆధారిత అధ్యయనాల గురించి సమగ్రంగా వివరించారు. సంజీవని యాప్ గురించి సమాచారం అందించిన ఆయన, ఆయుర్వేదం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మూడు ఆయుష్ ఆధారిత అధ్యయనాల గురించి మాట్లాడుతూ, ఆలోచనల అభివృద్ధి, క్రౌడ్ సోర్సింగ్, టాస్క్ ఫోర్స్ తయారీ, ఎస్.జి.పి.జి.ఐ, ఎయిమ్స్, ఐ.సి.ఎం.ఆర్, సి.ఎస్.ఐ.ఆర్. వంటి వివిధ సంస్థల బృందం మరియు ఆలోచనలను వాస్తవ రూపానికి తీసుకురావడం గురించి పూర్తి సమాచారాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో ఈ క్రింది అధ్యయనాలు అధికారికంగా ప్రారంభించబడ్డాయి.

1.   ఆయుర్వేద ఆధారిత అంశాలపై క్లినికల్ రీసెర్చ్ స్టడీస్ రోగనిరోధకత మరియు కోవిడ్ -19 ప్రామాణిక సంరక్షణకు అనుబంధంగా – ఆయు, మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల సంయుక్త చొరవతో ఐ.సి.ఎం.ఆర్ సాంకేతిక సహకారంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్) సహకార క్లినికల్ అధ్యయనాలు,

ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ ఆర్ అండ్ డి టాస్క్ ఫోర్స్ ఆశ్వ గంధ, యష్టిమధు, గుడుచి + పిప్పళ్ళు మరియు పాలీ హెర్బల్ సూత్రీకరణ (ఆయుష్ – 64) లాంటి నాలుగు వేర్వేరు అంశాలను అధ్యయనం చేయడానికి దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి మంచి పేరున్న నిపుణుల సమగ్ర సమీక్ష మరియు సంప్రదింపుల ప్రక్రియ ద్వారా రోగనిరోధక అధ్యయనాల కోసం క్లినికల్ రీసెర్చ్ ప్రోటోకాల్స్ మరియు కోవిడ్ -19 సానుకూల కేసుల్లో యాడ్ –ఆన్ అంశాలను రూపొందించింది.

1.ఏ. కోవిడ్ -19 మహమ్మారి సమస్య పెరిగిన ప్రమాద సమయంలో ఎస్.ఏ.ఆర్.ఎస్ –సి.ఓ.వి-2కు బదులుగా రోగనిరోధకత కోసం అశ్వగంధ – ఆరోగ్య సంరక్షణ కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో ఎలాంటి పోలికలు ఉన్నాయనే అంశం.

1. బి. తేలిక పాటి నుంచి అభివృద్ధి చెందిన కోవిడ్ -19 చికిత్స కోసం స్టాండర్డ్ ఆఫ్ కేర్ కు అనుబంధంగా ఆయుర్వేద సూత్రీకరణ ప్రభావం – యాదృశ్చిక, ఓపెన్ లేబుల్, సమాంతర సమర్థత, యాక్టివ్ కంట్రోల్, మల్టీ సెంటర్ ఎక్స్ ప్లోరేటరీ డ్రగ్ ట్రయల్.

2. ఆయుష్ ఆధారిత రోగ నిరోధక అంశాల ప్రభావం పై జనాభా ఆధారిత ఇంటర్ వెన్షనల్ అధ్యయనాలు – అధిక ప్రమాదం ఉన్న ప్రజల్లో కోవిడ్ -19 సంక్రమణ నివారణలో ఆయుర్వే అంశాల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ జనాభా ఆధారిత అధ్యయనాలను ప్రారంభిస్తోంది. కోవిడ్ -19 కోసం ఆయుష్ అంశాల నివారణ సామర్థ్యాన్ని అంచనా వేయడం మరియు అధిక ప్రమాదం ఉన్న జనాభాలో జీవన నాణ్యత మెరుగుదలను అంచనా వేయడం దీని ప్రధాన లక్ష్యాలు. దేశ వ్యాప్తంగా 25 రాష్ట్రాలలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ సంస్థల క్రింద నాలుగు పరిశోధనా మండళ్ళు మరియు సుమారు 5 లక్షల జనాభా ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ అధ్యయనం జరుగుతోంది.

ఈ అధ్యయనాల ఫలితం కచ్చితంగా కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనే నేపథ్యంలో ఆయుష్ అంశాల నివారణ సామర్థ్యాన్ని శాస్త్రీయ ఆధారాల ద్వారా అర్థం చేసుకోవడంలో కొత్త కోణాలను సుగమం చేస్తుంది.  

3. కోవిడ్ -19 నివారణలో ఆయుష్ సలహాదారుల అంగీకారం మరియు వినియోగం యొక్క ప్రభావ అంచనా కోసం ఆయుష్ సంజీవని యాప్ ఆధారిత అధ్యయనం - 5 మిలియన్ల ప్రజల్ని లక్ష్యంగా నిర్దేశించుకుని భారీ స్థాయిలో జనాభా డేటాను తయారు చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ సంజీవని మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసింది. ఆయుష్ విభాగానికి చెందిన వారు తీసుకునే చర్యలు, ఆశించిన ఫలితాల్లో కోవిడ్ -19 నివారణలో దాని ప్రభావం యొక్క అంగీకారం మరియు వాడకంపై డేటాను రూపొందించడాలు ఉన్నాయి. 

 

--(Release ID: 1621837) Visitor Counter : 226