రక్షణ మంత్రిత్వ శాఖ
మిలటరీ ఇంజినీరింగ్ సేవలో 9,304 పోస్టులను రద్దు చేయడానికి రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఆమోదం తెలిపారు
Posted On:
07 MAY 2020 1:06PM by PIB Hyderabad
మిలటరీలో ప్రాథమిక, మిలటరీ పారిశ్రామిక శ్రామిక శక్తిలో భాగంగా ఉన్న 9,300 కు పైగా పోస్టులను ఆప్టిమైజ్ చేయాలన్న మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) ఇంజినీర్-ఇన్-చీఫ్ చేసిన ప్రతిపాదనకు రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. మిలటరీ పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచడానికి మరియు సాయుధ దళాల రక్షణ వ్యయాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి లెఫ్టినెంట్ జనరల్ శేకత్కర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసు మేరకు పోస్టుల ఆప్టిమైజ్ చర్యలు చేపట్టారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకే కేంద్ర రక్షణ మంత్రి 9,300కు పైగా పోస్టుల్ని రద్దు చేయడానికి ఆమోదం తెలిపారు. మిలటరీ సివిలియన్ విభాగంలోని వర్క్‌ఫోర్స్ పునర్వ్యవస్థీకరించాలని కూడా కమిటీ సూచించింది. ఎంఈఎస్ పనుల్లో కొంత డిపార్ట్‌మెంటల్‌గా పని చేసే సిబ్బందికి మరియు ఇతర పనులను అవుట్‌సోర్స్ చేయవచ్చని కూడా ఈ కమిటీ సూచించింది. ఈ సిఫారసుల ఆధారంగా మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌కు చెందిన ఇంజినీర్-ఇన్-చీఫ్ ఆఫ్ ప్రతిపాదన మేరకు మిలటరీలోని ప్రాథమిక, పారిశ్రామిక సిబ్బంది విభాగంలోని మొత్తం 13,157 ఖాళీలలో ఎంఈఎస్‌లోని 9,304 పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదనకు రక్షణ మంత్రి ఆమోదం తెలిపారు. మిలటరీలో ఎంఈఎస్‌ను తక్కవ సంఖ్యలో మేటి శ్రామికశక్తితో సమర్థవంతమైన సంస్థగా మార్చడం, అభివృద్ధి చెందుతున్న దృష్టాంతంలో సంక్లిష్ట సమస్యలను సమర్థవంతంగా మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతిలో నిర్వహించడానికి వీలుగా ఈ సిఫారసు చేయబడింది.
(Release ID: 1621772)
Visitor Counter : 319