కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 అంతమొందించే పోరాటంలో భాగంగా సిటియు ప్రతినిధులతో కార్మిక మంత్రి సమావేశం

Posted On: 06 MAY 2020 6:24PM by PIB Hyderabad

కేంద్ర కార్మికఉపాధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ కేంద్ర కార్మిక సంఘాల సంస్థలు (సిటియులు)తో ఢిల్లీలో వెబినార్ ద్వారా సమావేశం అయ్యారు. కోవిడ్-19 మహమ్మ్మరి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులుకార్మికులపైనాఆర్ధిక రంగంపైన దాని ప్రభావం ఈ మేరకు తగ్గించవచ్చు వంటి అంశాలపై కేంద్ర మంత్రి చర్చించారు. చర్చనీయాంశాల్లో ముఖ్యమైనవి: కార్మికులువలసకార్మికుల ప్రయోజనాలను కాపాడడంఉపాధి కల్పనా చర్యలుఆర్ధిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడంకార్మిక చట్టాల ప్రకారం వారి బాధ్యతలను నిర్వర్తించటానికి వీలుగా ఎంఎస్ఎంఈల పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు. కార్మికఉపాధి శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ ఆపత్కాలంలో కార్మికులుఉద్యోగుల సమస్యల తీవ్రత తగ్గించడానికి తీసుకున్న చర్యలను మంత్రి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల నుండి ఉద్యోగులు కార్మికులు బయట పడాలంటే తీసుకోవలసిన చర్యలను సూచించవలసిందిగా కార్మిక సంఘాల ప్రతినిధులను మంత్రి కోరారు. ఈ మేరకు వారు చేసిన సూచనలు:

          i.   వలస కార్మికులు వారి ఊళ్లకు వెళ్ళడానికి రైళ్ల సంఖ్యను పెంచాలి. వీరికి తమ కుటుంబ పోషణకు తగిన ఆర్ధిక సహాయం అందించాలి. పరిస్థితి అదుపులోకి వచ్చాక పనులు కల్పించాలి;

         ii.   వలస కార్మికులుఅసంఘటిత కార్మికుల జాతీయ రిజిస్టర్ ను తయారు చేయాలి. ఉద్యోగంఇతర సహాయం అందించేటపుడు వివరాలు అందరికి అందుబాటులో ఉంచితే వారికి తగు ప్రయోజనం చేకూరుతుంది;

        iii.    వడ్డీల మాఫీ/పునర్వ్యవస్థీకరణవిద్యుత్ సబ్సిడీ ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఎంఎస్ఎంఈలను ముఖ్యంగా చిన్నలఘు పరిశ్రమలను ఆదుకోవాలి. ఈ పరిశ్రమలకు సరైన ముడి సరుకు అందేలా చర్యలు తీసుకోవాలి

       iv.   లాక్ డౌన్ వల్ల అత్యధికంగా ప్రభావం పడ్డ హోటళ్లుసినిమాలుక్రీడలుఆటోమొబైల్ వంటి రంగాలు సంక్షోభం నుండి బయట పడేందుకు ప్రభుత్వం తగు వ్యూహాలు సిద్ధం చేయాలి;

         v.   చిన్నలఘు పరిశ్రమల వేతన భాగం వరకు సబ్సిడీలు ఇస్తేఆయా యాజమాన్యాలు కార్మికులకు పూర్తి వేతనాలు  ఇవ్వగలుగుతారు

       vi.   మహమ్మారి బాధితుల వద్దకు ధైర్యంగా వెళ్లి విధులు నిర్వహిస్తున్న ఆశా/అంగన్వాడీ వాలంటీర్లకు తగు విధంగా ప్రోత్సాహకాలు కల్పించాలి. 

      vii.   ఉద్యోగాలు కోల్పోయిన వారికి కూడా తగు ఆర్ధిక సహాయం చేయాలి;

     viii.   ఈ సందర్బంగా కార్మికుల పని గంటలను పెంచకుండా తగు చర్యలు తీసుకోవాలి

ix. వేతనాలుజీతాలల్లో కోతలు లేని విధంగా కార్మిక చట్టాలుమార్గదర్శకాల్లో ఉన్న అంశాలను గట్టిగా అమలు చేయాలి;

x.  దినసరి వేతనఅసంఘటిత కార్మికులకు ఆర్ధిక సహాయంతో పాటురేషన్వైద్య సౌకర్యాలు ఉచితంగా అందే ఏర్పాటు చేయాలి

xi. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తేదాని ద్వారా రైతు కూలీలకు సక్రమంగా వేతనాలు అందే పరిస్థితి ఉంటుంది. 

xii. తమ ఇళ్లకు వెనక్కి వెళ్తున్న వలస కార్మికుల రైళ్ల టికెట్ చార్జీలు వసూలు చేయకుండా చూడాలి. 

వీటిపై కార్మికఉపాధి శాఖ కార్యదర్శి సానుకూలంగ స్పందిస్తూ వలస కార్మికులకు  రైల్ చార్జీలు వారి దగ్గర నుండి వసులు చేయబోమని స్పష్టం చేసారు. రాష్ట్రాల సమన్వయంతో వలస కార్మికుల జాబితాలు రూపొందిస్తున్నామని చెప్పారు. కోవిడ్-19 ప్రభావానికి లోనైనా కార్మికుల కోసం 20 హెల్ప్ లైన్లు/కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

పరిశ్రమలను పునరుద్ధరించిక్రమంగా ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కావాలన్నది ఇపుడు ప్రధాన దృష్టి అని కార్మిక శాఖ  కార్యదర్శి చెప్పారు. ఈ మేరకు సిటియుఓలు కార్మికుల్లో విశ్వాసాన్ని పెంపొందించిఎప్పుడు అవకాశం ఉంటే అపుడు పనుల్లోకి వచ్చేలా చూడాలని కోరారు. ఎటువంటి సమస్యలున్నా తమ శాఖ తగు సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. 

యాజమాన్యాల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా వెబినార్ మే 8వ తేదీ ఏర్పాటు చేయనున్నారు. 

*****

 



(Release ID: 1621693) Visitor Counter : 241