వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న కింద ఆహార‌ధాన్యాల పంపిణీకి సంబంధించి 24 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ఆహార కార్య‌ద‌ర్శుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన‌ కేంద్ర ఆహార‌, ప్రజాపంపిణీ కార్య‌ద‌ర్శి

పిఎంజికెఎవై కింద కోవిడ్ -19 సంక్షోభ స‌మ‌యంలో , సుమారు 120 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌ ఆహార ధాన్యాలు 80 కోట్ల మందికి, అంటే భారతదేశ జనాభాలో మూడింట రెండు వంతులమందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు,.
3 నెల‌ల కోటాకు సంబంధించి రాష్ట్రాలు ,కేంద్ర‌పాలిత ప్రాంతాలు 69 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నులకు పైగా అందుకున్నాయి. 5 కేంద్ర పాలిత ప్రాంతాలు 3 నెల‌ల కోటా మొత్తం తీస‌కున్నాయి. 18 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు రెండు నెల‌ల కోటా, 14 రాష్ట్రాలు 1 నెల కోటా తీసుకున్నాయి.
ఈ ప‌థ‌కం కింద మొత్తం 46 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వమే భ‌రిస్తోంది..

Posted On: 06 MAY 2020 7:01PM by PIB Hyderabad

కేంద్ర ఆహార , ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాన్షు పాండే, ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 24 రాష్ట్రాల,కేంద్ర‌పాలిత ప్రాంతాల ఆహార కార్యదర్శులు  , ఇతర సంబంధిత అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో శ్రీ పాండే , ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాన్ అన్న యోజ‌న (పిఎం-జికెఎవై) కింద ఏప్రిల్‌, మే 2020 నెల‌ల‌కు ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేసేందుకు ఆహార‌ధాన్యాలు అందుకోవ‌డం , పంపిణీ కి సంబంధంచిన స్థితిగ‌తుల‌ను చ‌ర్చించారు. ప్ర‌స్తుత కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఎన్ఎఫ్ సి ఎ  లబ్ధిదారులకు తగిన ఆహార ధాన్యాలు లభ్యమయ్యేలా సాధారణ  ఎన్‌.ఎప్.సి.ఎ, టిపిడిఎస్‌ కింద ఆహార ధాన్యాల పంపిణీ గురించి ఆయ‌న స‌మీక్షించారు.
దీనితోపాటు, ఒక దేశఃం, ఒక రేష‌న్ కార్డు సౌల‌భ్యం ఉన్న‌ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలలో ,  ఇది అమ‌లు జ‌రుగుతున్న తీరుపై చ‌ర్చించారు. అలాగే ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో దీనిని అమ‌లు చేసేందుకు వ్యూహం , ప్ర‌ణాళిక‌, ఇందుకు సంబంధించి అవ‌గాహ‌న క‌ల్పించే అంశంపైనా చ‌ర్చించారు.
ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో 24 రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి. ఇందులో బీహార్, డిఎన్‌హెచ్ , డామన్ అండ్ డ‌య్యూ, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ ఒడిశా, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అండమాన్ - నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘ‌డ్‌,  గోవా, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్  ఉత్తర ప్రదేశ్  ఉన్నాయి.
ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న (పిఎంజికెఎవై)
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్ర‌స్తుత‌ సంక్షోభం సమయంలో, కేంద్ర ప్రభుత్వం చేప‌ట్టిన‌ అతి ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి, ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ఆన్ యోజన (పిఎంజికె). ఇది లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ జనాభాకు దీనికింద ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నారు.ఈ పథకంలోని ముఖ్యాంశాలు:
మూడు నెలల‌పాటు ప‌నుల‌కు అంతరాయం కారణంగా ఆహార ధాన్యాలు అందుబాటులో లేకపోవడంతో పేద‌లు బాధ‌ప‌డ‌డాన్ని ప్ర‌భుత్వం  అనుమతించదు.
    80 కోట్ల మంది ప్ర‌జ‌లు, అనగా, భారతదేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది ఈ పథకం పరిధిలోకి వస్తారు.
    వీరిలో ప్రతి ఒక్కరికి వచ్చే మూడు నెలల్లో వారి ప్రస్తుత అర్హత కంటే రెట్టింపు  పంపిణీ చేస్తారు.
    అదనంగా పంపిణీ చేసే ఆహార ధాన్యాల‌పై ఏమాత్రం ఖ‌ర్చుచేయాల్సిన అవ‌స‌రం వారికి ఉండ‌దు. .
ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా   సమాజంలోని బలహీన వర్గాలకు సుమారు 120 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎమ్‌టి) ఆహార ధాన్యాలు పంపిణీ అవుతున్నాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ఉన్న అన్ని ప్రాధాన్యతా గృహాలకు (పిహెచ్‌హెచ్) 2020 ఏప్రిల్, మే  జూన్ మూడు నెలల్లో వారి సాధారణ కేటాయింపుల కంటే రెట్టింపు కేటాయింపు లభిస్తుందని ప్రభుత్వం నిర్ధారించింది, ప్రతి అంత్యోద‌య అన్న‌ యోజన (AAY) లబ్ధిదారుడు వారి సాధారణ కోటా  కార్డుకు నెలకుపొందే  35  కిలోల‌కన్నా, నెలకు 5 కిలోలు  అదనంగా పొందుతారు.
    రాష్ట్ర‌ప్ర‌భుత్వాలనుంచి ఈ ప‌థ‌కంపై మంచి స్పంద‌న వ‌చ్చింది. 06-05-2020 నాటికి ఈ ప‌థ‌కం కింంద రాష్ట‌ప్ర‌భుత్వాలు 69.28 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఆహార ధాన్యాల‌ను తీసుకున్నాయి.

ప్ర‌భుత్వం ఆహార ధాన్యాల ఖర్చు. దాని సేకరణ ఖర్చులు, నిల్వ  రవాణాతో పాటు చౌక ధరల దుకాణం (ఎఫ్‌పిఎస్) వద్ద ఉద్దేశించిన లబ్ధిదారులకు పంపిణీ చేసే వరకు  సుమారు 46000 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు భ‌రిస్తోంది. రైతుకు చెల్లించే ధాన్యం ధర నుండి చౌక‌ధ‌ర‌ల‌ దుకాణ యజమానులకు కమీషన్ చెల్లించే వరకు మొత్తం కార్యకలాపాల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. దేశంలో బియ్యంపై కిలోకు సుమారు 39 రూపాయలు , గోధుమలకు కిలోకు 28 రూపాయలు ప్ర‌భుత్వం భ‌రిస్తోంది.
రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌పై ఎలాంటి ఆర్థిక భారం మోప‌కుండా ఈ మొత్తం ఆహార మ‌ధ్ద‌తు ప‌థ‌కాన్ని భార‌త ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది.

 పిఎంజికెఎవై కింద ఆహార‌ధాన్యాల త‌ర‌లింపు స్థితిగ‌తులు:
మొత్తంగా ఆహార ధాన్యాల త‌ర‌లింపు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, ఈ పథకం కింద త‌ర‌లింపు పద్ధతిలో రాష్ట్రాలలో తేడాలు ఉన్నాయి.  ఆహార ధాన్యాల త‌ర‌లింపున‌ కు సంబంధించిన వివ‌రాలు కింద ఉన్నాయి.
3 నెలల కాలానికి  లిఫ్టింగ్ పూర్తి చేసిన‌ రాష్ట్రాలు :05
2 నెలల కోటా లిఫ్టింగ్ పూర్తి చేసిన‌ రాష్ట్రాలు : 18
1 నెల కోటా లిఫ్టింగ్ పూర్తిచేసిన రాష్ట్రాలు : 14

పిఎంజికెఎవై కింద రాష్ట్రాల వారీగా ఆహార‌ధాన్యాల లిప్టింగ్ వివ‌రాలు కిందివిధంగా ఉన్నాయి1.

1. రాష్ట్రాలు,కేంద్ర‌పాలిత ప్రాంతాలు లిఫ్టింగ్ పూర్తిచేసిన‌వి:
 

2.రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు 2 నెల‌ల లిఫ్టింగ్ పూర్తి చేసిన‌వి:

 

3. రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు 1 నెల‌కు లిఫ్ట్ చేసిన‌వి
 

ఆహార‌ధాన్యాల స్టాక్‌ల స‌త్వ‌ర లిఫ్టింగ్‌కు రాష్ట్రాల‌కు అవ‌స‌ర‌మైన  అన్ని ర‌కాల మ‌ద్ద‌తును ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా అందిస్తుంది.

 



(Release ID: 1621608) Visitor Counter : 339