రైల్వే మంత్రిత్వ శాఖ

పార్సిల్ రైళ్ల ద్వారా రైల్వేలకు ఆదాయం; లాక్ డౌన్ ప్రారంభం నుండి 54,292 టన్నుల సరకు రవాణా, రూ.19.77 కోట్ల ఆదాయం

2000 దాటిన పార్సిల్ రైళ్లు; 05.05.2020 వరకు 2,067 రైళ్ల రాకపోకలు, వీటిలో 1,988 రైళ్లు సమయ సారిణితో నడిచినవి



ఈ-కామర్స్, లాజిస్టిక్ కంపెనీలను రైల్వేలకు దగ్గర చేయడానికి సమావేశం నిర్వహించిన కేంద్ర రైల్వేలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి



లాక్ డౌన్ సందర్బంగా సరఫరా గొలుసు వ్యవస్థకు తోడ్పాటు ఇచ్చేలా చిన్న పరిమాణం పార్సిళ్లలో నిత్యావసర వస్తువులను త్వరితగతిన రవాణా చేయడానికి పార్సిల్ వ్యాన్లను అందుబాటులో ఉంచిన భారతీయ రైల్వేలు

Posted On: 06 MAY 2020 5:16PM by PIB Hyderabad

కోవిడ్-19 నేపథ్యంలో వైద్య పరికరాలుఆహరం వంటి అత్యవసర వస్తువులను చిన్న పార్సిళ్లగా రవాణా చేయడం చాల ముఖ్యం.  ఈ ముఖ్యమైన అవసరాన్ని తీర్చడానికి ఈ-కామర్స్ కి సంబంధించిన కంపెనీలురాష్ట్ర ప్రభుత్వాల వంటి వినియోగదారులకు సంబంధించిన సరుకును సామూహిక రవాణా ద్వారా త్వరితగతిన గమ్యాలకు చేర్చడానికి భారతీయ రైల్వేపార్సిల్ వ్యాన్లను అందుబాటులో పెట్టింది. సమయ సారిణితో పార్సిల్ ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయించింది. దీని ద్వారా అత్యవసర వస్తువులు నిరంతరాయంగా గమ్యాలకు చేర్చే ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే.  జోనల్ రైల్వేలు క్రమం తప్పకుండా పార్సిల్ ప్రత్యేక రైళ్ల మార్గాలను గుర్తించి నోటిఫై చేస్తున్నాయి. ఇటువంటి రైళ్లు ఎనభై రెండు (82) రూట్లలో నడుస్తున్నాయి. 

 i) దేశంలోని ప్రధాన నగరాలుఢిల్లీముంబైకోల్‌కతాచెన్నైబెంగళూరు,హైదరాబాద్‌ మధ్య క్రమం తప్పకుండా మార్గ నిర్ధారణ. 

ii) రాష్ట్ర-రాజధానులు / ముఖ్యమైన నగరాల నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మార్గాల అనుసంధానం. 

ii) ఈశాన్య రాష్ట్రాలకు మార్గాన్ని నిర్ధారించడం. 

iv) మిగులు ఉన్న ప్రాంతాలు (గుజరాత్ఆంధ్రప్రదేశ్) అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పాలుపాల ఉత్పత్తుల సరఫరా. 

v) ఇతర నిత్యవసరమైన (వ్యవసాయ అవసరాలుమందులువైద్య పరికరాలు మొదలైనవి) వస్తువులను ఉత్పత్తి ప్రాంతాలనుండి ఇతర ప్రాంతాలకు సరఫరా.

ఈ-కామర్స్లాజిస్టిక్స్ కంపెనీలను రైల్వేలకు దగ్గరగా తీసుకురావడానికి రైల్వేలువాణిజ్యపరిశ్రమల మంత్రి ఇటీవల ఒక సమావేశం నిర్వహించారు.

05.05.2020 తేదీన, 66 పార్సెల్ స్పెషల్ రైళ్లు నడిచాయివాటిలో 65 సమయ సారిణి  రైళ్లు. 1,936 టన్నుల సామగ్రిని రవాణా చేసిరైల్వేకు 57.14 లక్షల రూపాయల ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి.

05.05.2020 వరకు 2,067 రైళ్లు నడవగావీటిలో 1,988 రైళ్లు సమయ సారిణితో నడిచాయి. 54,292 టన్నుల సరకు రవాణా చేసిరూ.19.77 కోట్ల ఆదాయం సముపార్జించాయి. 

****



(Release ID: 1621550) Visitor Counter : 241