కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో యజమానులు డిజిటల్ లేదా ఆధార్ ఆధారిత ఈ-సంతకం ఉపయోగించడానికి ఇబ్బంది పడుతున్న కారణంగా, యజమానులచే ఈ.పి.ఎఫ్. వర్తింపు ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ-సంతకం పొందడానికి వీలుగా ఈ.పిఎఫ్.ఓ. ఈ-మెయిల్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

Posted On: 06 MAY 2020 4:20PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న నిబంధనల దృష్ట్యా యజమానులు సాధారణ పనులు సైతం నిర్వహించలేకపోతున్నారు. అదేవిధంగా ఈ.పి.ఎఫ్.ఓ. పోర్టల్ పై ఆధార్ ఆధారిత ఈ-సంతకం లేదా డిజిటల్ సంతకం ఉపయోగించడానికి కూడా యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. 

కే.వై.సి. ధ్రువీకరణ, ట్రాన్స్ ఫర్ క్లెయిమ్ ధ్రువీకరణ వంటి అనేక ముఖ్యమైన పనులను ఈ.పి.ఎఫ్.ఓ. పోర్టల్ పై ఆన్ లైన్ ద్వారా యజమానుల అధీకృత వ్యక్తులు వారి డిజిటల్ సంతకాలు (డి.ఎస్.సి.) లేదా ఆధార్ ఆధారిత ఈ-సంతకాలు ఉపయోగించి నిర్వహిస్తూ ఉంటారు.  డి.ఎస్.సి./ఈ-సంతకాలు ఉపయోగించడానికి ప్రాంతీయ కార్యాలయాల నుండి ఒకసారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.  లాక్ డౌన్ కారణంగా ప్రాంతీయ కార్యాలయాల నుండి ఒక సారి నమోదు అభ్యర్ధనలు పంపడానికి చాలా మంది యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. 

పైన పేర్కొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, వర్తింపు ప్రక్రియను సులభతరం చేయాలనే ఉద్ద్యేశ్యంతో, అటువంటి విజ్ఞప్తులను ఇకనుంచీ ఇమెయిల్ ద్వారా కూడా ఆమోదించాలని ఈ.పి.ఎఫ్.ఓ. నిర్ణయించింది.  యజమానులు సంతకం చేసిన విజ్ఞప్తి లేఖను స్కాన్ చేసి కూడా ఈ-మెయిల్ ద్వారా సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి పంపవచ్చు. ప్రాంతీయ కార్యాలయాల అధికారిక ఈ-మెయిల్ చిరునామాలు  www.epfindia.gov.in   వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. 

ఏవైనా సంస్థల అధీకృత అధికారుల డిజిటల్ సంతకాలు ఆమోదించబడి, వారు సంబంధిత కంప్యూటర్ డాంగల్ ను గుర్తించలేకపోయినట్లైతే, అప్పుడు యజమానులకు చెందిన పోర్టల్ లో లాగిన్ అయ్యి అంతకుముందు నమోదు అయిన అధీకృత సంతకందారుల రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా వారి ఈ-సంతకాన్ని నమోదు చేసుకోవచ్చు.  వారి పేరు,  ఎదురుగా ఉన్న ఆమోదించబడిన డిజిటల్ సంతకం వారి ఆధార్ లో ఉన్నట్లే ఉన్నట్లయితే, ఈ-సంతకం నమోదుకు కోసం తిరిగి ఎటువంటి ఆమోదం అవసరం లేదు.  ఇతర అధీకృత సంతకందారులు వారి ఈ సంతకాలను నమోదుచేసుకుని, వారి యజమాని ఆమోదించిన విజ్ఞప్తి లేఖలను సంబంధిత ఈ.పి.ఎఫ్.ఓ. కార్యాలయం ఆమోదం కోసం పంపవచ్చు. 

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రతికూలంగా ప్రభావితులైన యజమానులకు, ఈ.పి.ఎఫ్. సభ్యులకు ఈ సదుపాయం వల్ల మరింత ఉపశమనం కలుగుతుంది. 

 

*****


(Release ID: 1621537) Visitor Counter : 346