వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో అదనపు అవసరాలు తీర్చిన తర్వాత కూడా ఎఫ్.సి.ఐ. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి : శ్రీ రాంవిలాస్ పాశ్వాన్.
లాక్ డౌన్ సమయంలో బహిరంగ మార్కెట్ కొనుగోలు పధకం ద్వారా ఎఫ్.సి.ఐ. 4.50 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలనూ, 5.61 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్నీ సేకరించింది.
Posted On:
05 MAY 2020 7:21PM by PIB Hyderabad
ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలు, ప్రభుత్వం వద్ద ఉన్న ఆహారధాన్యాలు, పప్పుల మొత్తం నిల్వలు, ఇంతవరకు రాష్ట్రాలకు పంపిన పరిమాణాలకు సంబంధించిన సవివరమైన సమాచారాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలూ, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు.
2020 మే నెల 4వ తేదీ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఎఫ్.సి.ఐ. వద్ద 276.61 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మరియు 353.49 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయని మంత్రి తెలియజేశారు. దీంతో మొత్తం ఎఫ్.సి.ఐ. వద్ద 630.10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల స్టాక్ అందుబాటులో ఉంది. ఎన్.ఎఫ్.ఎస్.ఏ. మరియు ఇతర సంక్షేమ పధకాల కింద నెలకు సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమౌతాయి.
లాక్ డౌన్ లో సుమారు 69.52 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సేకరించి, 2,483 గూడ్సు రైలు పెట్టెలలో రవాణా చేసినట్లు మంత్రి చెప్పారు. రైలు మార్గంతో పాటు, రోడ్డు మార్గంలోనూ, జల మార్గంలోనూ కూడా ఆహార ధాన్యాలను రవాణా చేయడం జరిగింది. మొత్తం మీద 137.62 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రవాణా చేశారు. వీటిలో 5.92 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఈశాన్య రాష్టాలకు రవాణా చేయడం జరిగింది.
లాక్ డౌన్ సమయంలో, సహాయ శిబిరాలను నిర్వహిస్తున్న ప్రభుత్వేతర సంస్థలు బహిరంగ మార్కెట్ కొనుగోలు పధకం (ఓ.ఎం.ఎస్.ఎస్.) ధరకు గోధుమలు, బియ్యం నేరుగా ఎఫ్.సి.ఐ. డిపోల నుండి కొనుగోలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎఫ్.సి.ఐ. నుండి నేరుగా ఆహార ధాన్యాలు కొనుగోలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు జారీచేసిన నాన్-ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కుటుంబాలకు కూడా వచ్చే మూడు నెలలవరకు రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం / గోధుమలు అందజేయవచ్చు. అవసరమున్న నాన్-ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కుటుంబాలకు రేషన్ అందించవలసిందిగా కోరుతూ ఓ.ఎం.ఎస్.ఎస్. గురించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు / కేంద్ర పాలితప్రాంతాల పరిపాలకులకు లేఖ పంపడం జరిగింది. ఓ.ఎం.ఎస్.ఎస్. కింద బియ్యం ధర కిలోగ్రాము 22 రూపాయలుగా, గోధుమలు ధర కిలోగ్రాము 21 రూపాయలుగా నిర్ణయించారు.
ఇలా ఉండగా, లాక్ డౌన్ సమయంలో ఓ.ఎం.ఎస్.ఎస్. ద్వారా ఎఫ్.సి.ఐ. 4.50 లక్షల మెట్రిక్ తన్నుల్ గోధుమలు, 5.61 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించింది.
"ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన" కింద వచ్చే మూడు నెలలకు మొత్తం 104.4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మరియు 15.6 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు అవసరమౌతాయి. వీటిలో వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు ఇప్పటికే 59.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మరియు 8.14 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు తీసుకున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్ - ఈ ఆరు రాష్టాలు / కేంద్రపాలితప్రాంతాలకు గోధుమలు కేటాయించడం జరిగింది. మిగిలిన రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు బియ్యం కేటాయించారు. ఈపథకం కింద భారత ప్రభుత్వం వంద శాతం ఆర్ధిక భారాన్ని సుమారు 46,000 కోట్ల రూపాయల మేర భరిస్తోంది.
పప్పుల విషయానికి వస్తే, వచ్చే మూడు నెలలకు మొత్తం 5.82 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. ఇంతవరకు, 2,20,727 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు రవాణా చేయడం జరిగింది. కాగా 1,47,165 మెట్రిక్ టన్నుల పప్పులు వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు చేరాయి. 47,490 మెట్రిక్ టన్నుల మేర పంపిణీ చేయడమైనది. మొత్తం 12.54 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు (కందిపప్పు-5.16 లక్షల మెట్రిక్ టన్నులు; పెసరపప్పు-1.26 లక్షల మెట్రిక్ తన్నులు; మినప్పప్పు-2.55 లక్షల మెట్రిక్ టన్నులు; శనగపప్పు-2.72 లక్షల మెట్రిక్ టన్నులు మరియు మైసూర్ పప్పు-0.84 లక్షల టన్నులు) 2020 మే నెల 5వ తేదీ నాటికి మిగులు నిల్వలు ఉన్నాయి.
ఇలా ఉండగా, వినియోగదారుల వ్యవహారాల శాఖ, కోవిడ్-19 నేపథ్యంలో డిమాండు పెరిగిన ఫేస్ మాస్కులు, సానిటైజర్స్ ను నిత్యావసర వస్తువుల చట్టం కింద ప్రకటించింది. మాస్కులు, సానిటైజర్స్ ధరలను, వాటి తయారీకి ఉపయోగించే పదార్ధాలు, వస్తువుల ధరలను పరిమితం చేసింది. లాక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల సరఫరాలో అవరోధాలు రాకుండా, వాటి ధరలు పెరగకుండా నియంత్రించాలని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నిత్యావసరాల చట్టం కింద నిర్ణయాలు తీసుకునే అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.
****
(Release ID: 1621403)
Visitor Counter : 269