పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

గరుడ్ పోర్టల్ ద్వారా కోవిడ్-19 సంబంధిత ద్రోన్/ఆర్పిఏఎస్ ఆపరేషన్లు చేసే ప్రభుత్వ సంస్థలకు షరతులతో కూడిన మినహాయింపులు

Posted On: 05 MAY 2020 7:06PM by PIB Hyderabad

కోవిడ్-19 పై ఆర్పిఏఎస్ ( రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్) / డ్రోన్ ఆపరేషన్లు కోసం ప్రభుత్వ సంస్థలకు ఫాస్ట్ ట్రాక్ షరతులతో కూడిన మినహాయింపులను అందించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసిఏ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) గరుడ్ పోర్టల్ (https://garud.civilaviation.gov.in) ను ప్రారంభించాయి.

గరుడ్ అనేది ‘డ్రోన్‌ల ఉపయోగంలో ప్రభుత్వ అధికారిక సహాయం ’ . సంబంధిత సంస్థ నుండి అవసరమైన అనుమతులు పొందడం,  రెండు వారాలలోపు పోర్టల్‌ను ప్రారంభించడం ఈ ప్రక్రియలో పాల్గొన్న ఎంఓసిఏ, డిజిసిఏ, ఏఏఐ, ఎన్ఐసి లోని వివిధ అధికారుల కృషి అంకితభావానికి నిదర్శనం. అనుమతి పొందిన ఎనిమిది రోజుల స్వల్ప వ్యవధిలో, పోర్టల్ రూపకల్పన, అభివృద్ధి, బీటా-పరీక్షించబడింది ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ మిస్టర్ విక్రమ్ సింగ్ ప్రారంభించారు, ఇంట్లో ఒంటరిగానే ఆయన దీనిపై పనిచేసారు. 

పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ జరీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణలు ఉంటాయి. 

షరతులతో కూడిన మినహాయింపు ఇస్తే, అందుకు సంబందించిన షరతులు ఇలా ఉంటాయి. 

ప్రభుత్వం నియయించిన సంస్థ ,  నిఘా, ఫోటోగ్రఫీ, కోవిడ్-19కి సంబంధించిన బహిరంగ ప్రకటనలకు మోహరించిన ఆర్పిఏ- షరతుల మినహాయింపుల పరిమితులకు లోబడే  ఉంటాయి.  ఇవి కాకుండా ఇతర ఆర్యకలాపాలకు, కోవిడ్ కి సంబంధించినవే అయినా, వాటికి విడిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 

షరతులతో కూడిన మినహాయింపులు బాటరీ తో నడిచే రోటరీ వింగ్ ఆర్పిఏ వరకే పరిమితం. ఇతర వినియోగానికి ఖచ్చితంగా నిషేధం. 

ఆర్పిఏ ల ఆపరేషన్లలో భద్రత చర్యల బాధ్యత పూర్తిగా ఆ ప్రభుత్వ సంస్థదే. 

ఇలా ఆర్పిఏ వినియోగంలో కొన్ని పరిమితులు, షరతులు  ఉంటాయి. డీజీసీఏ జారీ చేసిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య /డ్రోన్ రసీదు సంఖ్య కలిగి ఉండాలి; 25 కిలోల మించి బరువు ఉండరాదు; కంట్రోల్ రూమ్ నుండి నియంత్రణ తప్పితే దానంతట అదే తిరిగి వెనక్కి వచ్చేలా ఉండాలి. భూ ఉపరితలం నుండి 200 అడుగులను దాటి వెళ్ళరాదు. ప్రజలకు, భవనాలకు, వాహనాలకు, వివిధ రకాల ఆస్తులకు సురక్షితమైన దూరంతో ఆపరేట్ చేయాలి. ఎటువంటి పదార్థాన్ని తీసుకెళ్లడం కానీ, వెదజల్లడం కానీ చేయకూడదు; సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యే దీనిని ఉపయోగించాలి. 

ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు 5 కిలోమీటర్ల పరిథి లోకి వీటిని అనుమతించరు. ఇంకా వాటిని ఆపరేట్ చేసే ప్రాంతాల పరిమితులను స్పష్టంగా విధించారు. 



(Release ID: 1621381) Visitor Counter : 190