హోం మంత్రిత్వ శాఖ

బహుళ ప్రవేశ హక్కు ఉన్న ఓ.సి.ఐ. కార్డ్ హోల్డర్లు భారత దేశాన్ని సందర్శించడానికి ఉన్న జీవితకాల వీసా సౌకర్యం, అంతర్జాతీయ విమాన ప్రయాణాల నిషేధం ఎత్తివేసే వరకూ నిలిపివేయబడుతుంది.

Posted On: 05 MAY 2020 7:54PM by PIB Hyderabad

ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓ.సి.ఐ) కార్డుదారులుగా నమోదు చేసుకున్న వ్యక్తులకు మంజూరు చేయబడిన ఏ ఉద్దేశానికైనా భారదేశాన్ని సందర్శించడానికి బహుళ ప్రవేశ జీవితకాల వీసా సౌకర్యం హక్కును భారత దేశం నుంచి లేదా భారతదేశానికి అంతర్జాతీయ విమాన ప్రయాణాల నిషేధాన్ని ఎత్తివేసే వరకూ నిలిపివేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఏ) ఒక ఉత్తర్వు జారీ చేసింది.

ఈ కాలంలో ముఖ్యమైన కారణాల వల్ల భారతదేశానికి రావాలని అనుకునే ఓ.సి.ఐ. కార్డును కలిగి ఉన్న ఏ విదేశీ పౌరుడైనా సమీప భారతీయ మిషన్ ను సంప్రదించాలి. భారతదేశంలో ఉన్న ఓ.సి.ఐ. కార్డును కలిగి ఉన్న వ్యక్తుల విషయంలో, ఈ కార్డు వారు భారతదేశంలో ఎక్కువ ఉండేందుకు చెల్లుబాటులో ఉంటుంది.

అధికారిక ఆర్డర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి



(Release ID: 1621358) Visitor Counter : 181