రక్షణ మంత్రిత్వ శాఖ
“సముద్ర సేతు” ఆపరేషన్‌ను ప్రారంభించిన భారత నావికా దళం
Posted On:
05 MAY 2020 7:18PM by PIB Hyderabad
భారత నావికాదళం "సముద్ర సేతు" ఆపరేషన్‌ను ప్రారంభించింది. "సముద్ర సేతు" అంటే "సముద్ర వంతెన" అని అర్థం. భారతీయ పౌరులను విదేశాల నుండి స్వదేశానికి రప్పించే జాతీయ ప్రయత్నంలో భాగంగా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ మొదటి దశ
(ఫేజ్ -1) లో భాగంగా ఈ నెల 08వ తేదీ నుండి భారతీయుల తరలింపు కార్యకలాపాలను ప్రారంభించనుంది. భారత నావికా దళ నౌకలు జలాష్వా మరియు మాగర్ ప్రస్తుతం మాల్దీ, రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవుల ఓడరేవుకు చేరుకున్నాయి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో
విదేశాలలో ఉన్న మన పౌరులపై ఈ ప్రభావాన్ని మన సర్కారు చాలా నిశితంగా పరిశీలిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రవాసంలోని భారతీయులను సముద్రం ద్వారా తరలించడానికి తగిన సన్నాహాలు చేయాలని సర్కారు భారత నావికాదళానికి సూచించింది.
జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు..
రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ మిషన్ నావికా దళ ఓడల ద్వారా భారత్‌కు తీసుకు రావాల్సినభారతీయ పౌరుల జాబితాను సిద్ధం చేస్తోంది. అవసరమైన వైద్య పరీక్షల తరువాత వారి ప్రయాణానికి సన్నాహాలు చేయనున్నారు. మొదటి ట్రిప్‌లో భాగంగా మొత్తం 1,000 మందిని స్వదేశానికి తీసుకురావడానకి ప్రణాళికలు రూపొందించారు. కోవిడ్-19 వైరస్ కట్టడికి సంబంధిత సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ సామర్థ్యం మేరకు వీరిని భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడుగా భారతీయుల తరలింపు నావల్లో తగి వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ తరలింపు ఆపరేషన్ నిమిత్తం నౌకల్లో తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. స్వదేశానికి తెచ్చేందుకు చేయబడిన సిబ్బందికి సముద్ర మార్గాన ప్రయణించే సమయంలో పలు ప్రాథమిక సౌకర్యాలు మరియు వైద్య సదుపాయాలు కూడా కల్పించబడ్డాయి. కోవిడ్ -19 కఠినమైన ప్రోటోకాల్‌తో అనుబంధించబడిన ప్రత్యేక సవాళ్ల దృష్ట్యా నిర్దేశించబడినట్టుగా తగిన ఏర్పాట్లు చేశారు.
కేరళ తీరానికి చేరవేత..
స్వదేశానికి తీసుకురానున్న వారిని కేరళలోని కొచ్చి వద్ద దింపి అక్కడ రాష్ట్ర అధికారులకు సంరక్షణ నిమిత్తం అప్పగించనున్నారు. భారత ప్రభుత్వానికి చెందిన రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వపు ఇతర ఏజెన్సీల సన్నిహిత సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు.
(Release ID: 1621347)
Visitor Counter : 334