ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోల్డ్ చైన్ ప్రాజెక్టుల ప్రమోటర్లతో మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ వీడియో కాన్ఫరెన్స్
Posted On:
04 MAY 2020 6:47PM by PIB Hyderabad
కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ (ఎఫ్‌పీఐ) మంత్రి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్, మహారాష్ట్రలోని ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో పూర్తయిన ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ ప్రాజెక్టు ప్రమోటర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఒక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 38 కోల్డ్ చైన్ ప్రాజెక్టుల ప్రమోటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రమోటర్లు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రితో వివిధ అంశాలపై సంభాషించారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అనుభవాలను / సమస్యలను ప్రమోటర్లు మంత్రితో పంచుకున్నారు. దీనికి తోడు ప్రమోటర్లు లాక్‌డౌన్ కాలంలో కోల్డ్ చైన్ ప్రాజెక్టులను నడపడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 వైరస్ మహమ్మారి ఆహార ఉత్పత్తుల సరఫరా గొలుసుకు తీవ్రమైన వాలు విసురుతూ ఉందని అన్నారు. కోవిడ్-19 విసిరిన సంక్షోభం నుంచి బయటపడే విషయమై ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ నెట్‌వర్క్ తమ సామూహిక బలాన్ని ఎత్తి చూపాల్సిన ఆవశ్యకత ఎంతైననా ఉందని మంత్రి హర్సిమ్రత్ కౌర్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రెస్టారెంట్లు, విందులు, హోటళ్ళు వంటి సాంప్రదాయ మార్కెట్ల నుంచి కొనుగోళ్లు లేక స్తంభించిపోయిన కూరగాయల నిల్వల మరియు ప్రాసెస్ చేసిన పాల ఉత్పత్తుల ఎగుమతి చేయడంలో ఇబ్బంది వంటి అంశాలపై వారు చర్చించారు. 1/3 వ లేదా సగం శ్రమశక్తితో వ్యాపారాలు పనిచేస్తున్నందున ఎక్కువ పని గంటలు అవసరమని ప్రమోటర్లు తెలిపారు. ఇది తక్కువ పోటీ నేపథ్యంలోనూ తమ ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతోందని అభిప్రాయపడ్డారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా కేంద్ర ఎఫ్‌పీఐ మంత్రి ఈ క్రింది ప్రధాన సమస్యలపై చర్చించారు:
1. ముడి పదార్థాల లభ్యత మరియు దాని అధిక వ్యయం
2. కోల్డ్ చైన్ ప్రాజెక్టుల కార్యకలాపాలపై లాక్‌డౌన్ ప్రభావం
3. కార్మిక మరియు లాజిస్టిక్స్ సమస్యలు
4. అధిక మొత్తంగా మారిన ఇన్వెన్టరీ వ్యయాలు
5. రైతులకు చెల్లింపులు చేయాల్సిన నేపథ్యంలో ద్రవ్య సంక్షోభం
(Release ID: 1621046)
Visitor Counter : 201