ప్రధాన మంత్రి కార్యాలయం
హంద్ వాడా లో ప్రాణ సమర్పణం చేసిన జవానుల కు మరియు భద్రత దళ సిబ్బంది కి నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
03 MAY 2020 5:06PM by PIB Hyderabad
జమ్ము కశ్మీర్ లోని హంద్ వాడా లో ప్రాణ సమర్పణం చేసిన సాహసిక జవానుల కు మరియు భద్రత దళ సిబ్బంది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
‘‘హంద్ వాడా లో ప్రాణ సమర్పణం చేసిన ధైర్యవంతులు అయినటువంటి మన సైనికుల కు మరియు భద్రత దళ సిబ్బంది కి ఇవే నివాళులు. వారి యొక్క పరాక్రమం, వారి యొక్క త్యాగం ఎన్నటికీ మరపు రానివి. వారు అత్యంత అంకిత భావం తో దేశ ప్రజల కు సేవల ను అందించారు; అంతేకాక, మన పౌరుల ను రక్షించడం కోసం అవిశ్రాంతం గా శ్రమించారు. వారి యొక్క కుటుంబాల కు మరియు వారి యొక్క మిత్రుల కు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1620661)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam