గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధర సవరింపు 49 రకాల చిన్నపాటి అటవీ ఉత్పత్తుల ధరలు పెంచిన కేంద్రం

కొత్త ధరలు అమలును పర్యవేక్షించనున్న ట్రైఫెడ్‌ (TRIFED‌)

प्रविष्टि तिथि: 01 MAY 2020 7:03PM by PIB Hyderabad

అటవీ ఉత్పత్తులను సేకరించి, వాటిని అమ్ముకుని జీవనం సాగించే గిరిజనుల జీవనోపాధిని మెరుగు పరిచేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. 49 రకాల చిన్నపాటి అటవీ ఉత్పత్తుల (ఎంఎఫ్‌పీ) కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచింది. ఎంఎఫ్‌పీల కనీస మద్దతు ధర ప్రతి మూడేళ్లకు ఒకసారి సవరిస్తామని, తమ ఆధ్వర్యంలో పనిచేసే ధరల విభాగం ద్వారా ఇది జరుగుతుందని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్‌-19 కారణంగా ప్రస్తుతం దేశంలో అసాధారణమైన, చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయన్న మంత్రిత్వ శాఖ, చిన్నపాటి అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు తగిన సాయం అందించేలా ప్రస్తుత పథకం ఉండాలని వెల్లడించింది. ప్రస్తుత పథకం మార్గదర్శకాలలో ఉన్న నిబంధనలను సడలించాలని మొత్తం యంత్రాంగం నిర్ణయించినట్లు తెలిపింది. ఎంఎఫ్‌పీ ధరల విభాగంతో సంప్రదింపులు జరిపిన తర్వాత, ప్రస్తుత పథకం పరిధిలో ఉన్న ఎంఎఫ్‌పీ రకాలకు సంబంధించి కనీస మద్దతును సవరించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

16 నుంచి 66 శాతం వరకు ఎంఎస్‌పీ పెంపు
    వివిధ రకాల చిన్నపాటి అటవీ ఉత్పత్తుల ధరలు 16 నుంచి 66 శాతం వరకు పెరిగాయి. ఈ పెరుగుదల వల్ల కనీసం 20 రాష్ట్రాల్లో చిన్నపాటి అటవీ ఉత్పత్తులను సేకరణ ఊపందుకుంటుందని భావిస్తున్నారు.

    చిన్నపాటి అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంపుపై పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


(रिलीज़ आईडी: 1620192) आगंतुक पटल : 284
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada